Sachin Car: సచిన్ నడిపిన పోర్స్చే 911 కారు ధర, ఫీచర్లు ఇవే.. ఈ లగ్జరీ కారు ప్రత్యేకత ఏంటంటే
Porsche 911 Price | భారత క్రికెటర్ సచిన్ రెడ్ కలర్ Porsche 911 Carrera నడుపుతూ కనిపించారు. అయితే ఈ ఫేమస్ పోర్స్ఛే కారు బేస్ మోడల్, టాప్ మోడల్ ఫీచర్లు, ధర తెలుసుకోండి.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వద్ద అద్భుతమైన కార్ కలెక్షన్ ఉంది. రెండు దశాబ్దాలకు పైగా భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన మాస్టర్ బ్లాస్టర్ ఇటీవల తన వద్ద ఉన్న ఎరుపు రంగు పోర్స్చే 911 ని ఒక స్టేడియం లోపల నడిపాడు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు తమ అభిమాన ఆటగాడిని ఎంతో సరదాగా, అద్భుతమైన స్పోర్ట్స్ కారు నడుపుతూ చూడటాన్ని ఎంజాయ్ చేశారు.
సచిన్ ఏ పోర్స్చే 911 నడిపారు?
వాస్తవానికి, సచిన్ టెండూల్కర్ నడుపుతున్న కారు పోర్స్చే 911 కరెరా మోడల్. ఇది పోర్స్చే కంపెనీకి చెందిన అత్యంత ప్రముఖమైన స్పోర్ట్స్ కార్లలో ఒకటి. ఈ కారు దాని డిజైన్, వేగంతో పాటు అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కారణంగా ఫేమస్ అయింది. ప్రముఖ పోర్స్చే 911 కారుని ప్రపంచవ్యాప్తంగా కార్ లవర్స్ బాగా ఇష్టపడతారు.
ఇంజిన్, పనితీరు ఎంత శక్తివంతమైనవి?
పోర్స్చే 911 కరెరాలో 3.0 లీటర్ల 6 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ దాదాపు 290 కిలోవాట్ల శక్తిని, 450 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.9 సెకన్లలో స్టార్టింగ్ నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు దాదాపు 294 కిలోమీటర్లుగా ఉంది. ఇది చాలా వేగంగా వెళ్లే, పవర్‌ఫుల్ కార్లలో ఒకటిగా నిలిచింది.
పోర్స్చే 911 ప్రత్యేకతలు ఏంటంటే..
పోర్స్చే 911 కారులో అనేక ప్రీమియం, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మ్యాట్రిక్స్ LED హెడ్లైట్లు, LED DRLలు, పార్కింగ్ సెన్సార్లు, 21 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని లోపల 12.65 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ సిస్టమ్ Android Auto, Apple CarPlay లను సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు స్పోర్ట్స్ సీటింగ్, డార్క్ ఇంటీరియర్, యాంబియంట్ లైటింగ్, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు పోర్స్చే ఉన్నాయి.
భారతదేశంలో పోర్స్చే 911 ధర
భారతదేశంలో పోర్స్చే 911 కూపే, టర్బో కూపే వేరియంట్లలో విక్రయాలు జరుపుకుంటోంది. ఈ పోర్స్ఛే కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 1.99 కోట్ల రూపాయలకు ప్రారంభం అవుతుంది. దీని టాప్ వేరియంట్ ధర దాదాపు రూ. 3.80 కోట్ల వరకు ఉంటుంది. కంపెనీ ఇందులో మీకు నచ్చిన విధంగా ఎంపికను కూడా అందిస్తుంది. దీంతో కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా కారును కొంతమేర డిజైన్ చేసుకోవచ్చు.






















