అన్వేషించండి

Royal Enfield New Bike: ఈ నెలలో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్‌లు - ఎలక్ట్రిక్ బైక్ కూడా!

Royal Enfield: ప్రముఖ బైక్‌ల కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త బైక్‌లను నవంబర్‌లో లాంచ్ చేయనుంది. ఇందులో ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉండనుందని తెలుస్తోంది. నవంబర్ 4న ఈ బైక్ రానుంది.

Royal Enfield New Bikes: బ్రిటీష్ వాహన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇండియా, ఇంగ్లండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రెండు కొత్త మోటార్ సైకిళ్లను మార్కెట్లో లాంచ్ చేయనుంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనుంది. అదే సమయంలో ఈ బ్రాండ్‌కు చెందిన మరో కొత్త మోడల్ కోసం దాదాపు రెండేళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 నవంబర్ 5వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఇలా నవంబర్ మొదటి వారంలోనే రెండు శక్తివంతమైన బైక్‌లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌తో ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించబోతోంది. ఈ బైక్ గురించిన టీజర్‌ను కూడా కంపెనీ ఇటీవలే షేర్ చేసింది. ఈ టీజర్‌ను బట్టి ఈ బైక్ నవంబర్ 4వ తేదీన మార్కెట్లోకి విడుదల కాబోతోందని అనుకోవచ్చు. మిగతా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్లిమ్ బాడీతో రావచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ రేంజ్ 100 నుంచి 160 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే సింగిల్ ఛార్జింగ్‌తో ఈ బైక్ 100 నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బైక్ ఎలక్ట్రిక్ వెర్షన్ అయినందున ఈ మోటార్‌సైకిల్ ధర మార్కెట్లో లభించే ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్‌ల కంటే ఎక్కువగా ఉండనుంది.  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌కు మార్కెట్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాల్సి ఉంటుంది.

Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 కూడా ఇంటర్‌సెప్టర్ బైక్‌లాగా 650 సీసీ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంటుంది. కానీ ఈ బైక్‌లో ఇంటర్‌సెప్టర్ 650 కంటే భిన్నమైన చక్రాలు ఉండవచ్చు. బైక్‌లో 17 అంగుళాల చక్రాలను ఉపయోగించవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ 184 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. అలాగే యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇందులో చూడవచ్చు.

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో 648 సీసీ ఆయిల్, ఎయిర్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది. ఇది 7,150 ఆర్‌పీఎమ్ వద్ద 47 బీహెచ్‌పీ పవర్, 5,150 ఆర్‌పీఎమ్ వద్ద 56.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది.

Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget