Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Cars Without Waiting Period: కొంతమంది యూజర్లు కారు బుక్ చేయగానే డెలివరీ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. వారి కోసం వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి.
Popular Cars Without Any Waiting Period: పండుగల సమయంలో భారతీయులు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్లు, బైకులు, ఫోన్లు, బంగారం వంటి వాటిని దీపావళికి కొనాలని అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా కాలం వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్న అనేక కార్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా బుక్ చేసిన కొంత కాలంలోనే త్వరగా చేతికి వచ్చే కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లు మీరు బుకింగ్ చేసుకుంటే అతి త్వరలోనే చేతికి వచ్చేస్తాయి. ఒకవేళ వెయింటింగ్ పీరియడ్ ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం...
కియా సోనెట్ (Kia Sonet)
ఈ లిస్టులో మొదటి కారు కియా సోనెట్. దీని వెయిటింగ్ పీరియడ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోయింది. దీపావళి రోజున ఆర్డర్ చేస్తే వెంటనే ఇందులో మీరు ఎంచుకున్న వేరియంట్లు, కలర్ ఆప్షన్లను పొందుతారు. వాస్తవానికి మారుతి సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్ అమ్మకాల కారణంగా దీని అమ్మకాలు తగ్గాయి. మీరు ఈ కారును ఎక్స్ షోరూం ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny)
ఈ లిస్టులో ఉన్న రెండో కారు మారుతి సుజుకి జిమ్నీ. ఈ కారుకు సంబంధించిన కొన్ని వేరియంట్‌లు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మీరు కలర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.74 లక్షలుగా ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
హోండా ఎలివేట్ (Honda Elevate)
ఇటీవల విడుదల చేసిన హోండా ఎలివేట్‌ను కొన్ని డీలర్‌షిప్‌ల నుంచి వెంటనే కొనుగోలు చేయవచ్చు. ఈ కారు భారత మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో పోటీపడుతుంది. కారు డిమాండ్ కాస్త తక్కువగా ఉన్న కారణంగా మీరు వెంటనే దీన్ని డీలర్‌షిప్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ధర గురించి చెప్పాలంటే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.73 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
ఈ జాబితాలో తదుపరి కారు మారుతి మోస్ట్ పాపులర్ కారు ఫ్రాంక్స్. ఇది కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లు, కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్ షోరూ ధర రూ.7.41 లక్షల నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఈ పండగ సీజన్లో ఎక్కువ వెయిటింగ్ లేకుండా త్వరగా కార్లు డెలివరీ కావాలనుకునే వారు ఈ ఆప్షన్లను ఎంచుకుంటే బెటర్. ఎందుకంటే ఇవి చాలా త్వరగా డెలివరీ అవుతాయి.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?