Royal Enfield Vs Amazon Latest Updates: ఇకపై అమెజాన్ యాప్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ బుక్.. నో కాస్ట్ తోపాటు మరిన్ని ఆఫర్లతో సందడి..
రాయల్ ఎన్ ఫీల్డ్, అమెజాన్ కలిసి కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చాయి. ఇకమీదట రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును ఆన్ లైన్ తో బుక్ చేసుకోవచ్చని తెలుస్తోంది. అలాగే సరికొత్త ఆఫర్లను కూడా అందిస్తున్నాయి.

Royal Enfeild Bikes available on Amazon Letest News: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తుంటే, మీకోసం ఒక శుభవార్త! ఈ పాపులర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో (Amazon) కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అమెజాన్ ఇండియా భాగస్వామ్యంలో భాగంగా ఈ 350సీసీ (350cc) బైక్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. దీనిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లతో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల (Credit Card)పై నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) , ఎక్స్ఛేంజ్ ఆఫర్ల (Exchange Offers) వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. హంటర్ 350ను కేవలం ₹4,999/- బుకింగ్ మొత్తంతో (Booking Amount) ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ (Ex-showroom) ధర ₹1.37 లక్షల నుండి మొదలై, వేరియంట్‌ను బట్టి ₹1.66 లక్షల వరకు ఉంటుంది. ఈ సౌలభ్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.
సూపర్బ్ ఫీచర్లు..
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) పవర్‌ట్రైన్ (Powertrain) గురించి చూసినట్లయితే, ఇందులో 349cc J-సిరీస్ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ (Single-cylinder) ఇంజన్ (Engine) అమర్చబడి ఉంది. ఈ ఇంజన్ 20.2 బీహెచ్‌పి (BHP) శక్తిని ,27 ఎన్ఎమ్ (NM) టార్క్‌ను (Torque) ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ శక్తివంతమైన ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ (Gearbox) ,స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో (Slip Assist Clutch) జత చేయబడింది, ఇది రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బైక్ మైలేజీ (Mileage) లీటరుకు సుమారు 36 నుండి 40 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశముందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఈ కేటగిరీలో చాలా మెరుగైనదిగా పరిగణించబడుతుంది.
ట్రాఫిక్ లో రయ్..
తక్కువ బరువు , చిన్న వీల్‌బేస్ (Wheelbase) కారణంగా, హంటర్ 350 సిటీ ట్రాఫిక్‌లో కూడా సులభంగా కంట్రోల్ చేయబడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో దీనికి ప్రధాన పోటీదారులు టీవీఎస్ రోనిన్ (TVS Ronin), హోండా హైనెస్ సిబి350/సిబి350 ఆర్‌ఎస్ (Honda H'ness CB350/CB350 RS) వంటి రెట్రో-స్టైల్ (Retro-style) బైక్‌లు ఉన్నాయని తెలుస్తోంది. జావా 42 (Jawa 42) ,బుల్లెట్ 350 (Bullet 350) కూడా దీనికి గట్టి పోటీని ఇస్తాయని తెలుస్తోంది, అయితే జావా 42 కొంచెం ఎక్కువ ధరలో ఉందని సమాచారం. అమెజాన్‌లో బుకింగ్ సౌకర్యంతో పాటు, కొనుగోలుదారులు కొత్త కలర్ ఎడిషన్ల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లు, అధికారిక వెబ్‌సైట్ ,యాప్ (App) ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. సో రాయల్ బైక్ లవర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. ఇంటి నుంచి కదలకుండానే ఎంచక్కా బైక్ బుక్ చేసుకుని, రాయల్ అనుభూతిని పొందవచ్చని పేర్కొనవచ్చు.





















