అన్వేషించండి

PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!

PM E-Drive :ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా పీఎం ఈడ్రైవ్ పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే వారికి భారీ సబ్సిడీ అందిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లకు సబ్సిడీ ఇస్తుంది.
  • ప్రాధాన్యతా ప్రాంతాల్లో 100% వరకు, రద్దీ ప్రాంతాల్లో 70-80% సబ్సిడీ లభిస్తుంది.
  • 2-3 లక్షల పెట్టుబడితో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యమవుతుంది.
  • రోజుకు 20 కార్లు ఛార్జింగ్ చేస్తే నెలకు 4-5 లక్షల ఆదాయం వస్తుంది.

PM E-Drive  Schemes: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈవీల వాడకం పెరగాలంటే పటిష్టమైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అత్యవసరం. ఈ లోటు భర్తీ చేస్తూనే, సామాన్యులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పట్టాలెక్కించింది. 

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏంటీ?

పీఎం ఈ డ్రైవ్ స్కీమ్‌ అనేది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం. ఈ స్కీమ్‌ ద్వారా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో ప్రధాన భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు తక్కువ రిస్క్‌తో ఈ వ్యాపారంలోకి ప్రవేశించే వీలు కలుగుతుంది. 

సబ్సిడీ వివరాలు ఏంటీ?

ఈ పథకం కింద సబ్సిడీ శాతాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి విభజించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ కాలనీలు, ఆసుపత్రుల, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల పరికరాల కోసం కేంద్ర వంద శాతం సబ్సిడీని అందిస్తుంది. 

అధిక రద్దీ ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, టోల్ ప్లాజాల సమీపంలో సెటప్ చేసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 80శాతం, పరికరాలపై 70శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి మౌలిక సదుపాయాల కోసం 80 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. 

పెట్టుబడి ఎంత? ఆదాయం ఎలా ఉంటుంది? 

సాధారణంగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి పది నుంచి 15లక్షల వరకు ఖర్చు అవుతుంది. పీఎం ఈడ్రైవ్ పథకం ద్వారా మీరు 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని వల్ల జేబు నుంచి పెట్టాల్సిన పెట్టుబడి 2 నుంచి మూడు లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రాథమికంగా మొత్తం ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.

ఆదాయం ప్రధానంగా యూనిట్ల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ ఛార్జింగ్‌కు సగటున రూ.15 నుంచి 20 వరకు వసూలు చేస్తున్నారు. ఒక సాధారణ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి చార్జింగ్ కోసం 30 నుంచి 45 యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. రోజుకు సుమారు 20 కార్లు మీ స్టేషన్‌కు వస్తే, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు తీసివేస్తే మిగిలిందే మీకు ఆదాయం. 

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకంలో దరఖాస్తు ప్రక్రియ నేరుగా సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఇది ఓ పద్ధతిలో జరుగుతుంది. సామాన్య ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోలేరు. కేవలం ప్రబుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేసే అధికారం కలిగి ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత స్థలంలో లేదా వాణిజ్య స్థలంలో స్టేషన్ ప్రారంభించాలనుకుంటే వారు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లుగా మారి, పైన పేర్కొన్న నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు లేదా కమర్షియల్ స్థలం ఏదైనా అనుమతి ఉంటుంది. కానీ అది వ్యూహాత్మకంగా వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, నోడల్ ఏజెన్సీల వివరాల కోసం ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌ pmed.gov.ingను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు,కొత్త వ్యాపార మార్గాల కోసం చూస్తున్న వారికి ఈ పథకం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏమిటి?

పీఎం ఈ డ్రైవ్ పథకం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం.

పీఎం ఈ డ్రైవ్ పథకం కింద సబ్సిడీ ఎంత?

ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి సబ్సిడీ శాతం మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాలనీలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో 100% సబ్సిడీ లభిస్తుంది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవసరం?

సాధారణంగా పది నుంచి 15 లక్షలు ఖర్చవుతుంది. ఈ పథకం ద్వారా 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది, కాబట్టి మీ జేబు నుంచి 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

పీఎం ఈ డ్రైవ్ పథకానికి ఎవరు అర్హులు?

ప్రభుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేయగలవు. ప్రైవేట్ వ్యక్తులు నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget