అన్వేషించండి

PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!

PM Modi Meeting CMs:పశ్చిమాసియా పరిణామాల వేళ దేశ ఆర్థిక, ఇంధన భద్రతపై ప్రధానమంత్రి  మోదీ ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. కృత్రిమంగా నిత్యావసరాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గించేందుకు సమీక్ష.
  • నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
  • ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక అవసరం.
  • ఇంధన భద్రతకు బయోఫ్యూయల్స్, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి.

PM Modi Meeting CMs: అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకున్న అనిశ్చితి వల్ల భారత్‌లో సప్లై చెయిన్ దెబ్బతినకుండా, సామాన్యులపై భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. 

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు 

సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రదానంగా నిత్యావసరాల నిల్వ, కృత్రిమ కొరత సృష్టించి లాభపడేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సప్లై చెయిన్‌లో ఎటువంటి ఆటంకాలు   లేకుండా చూడాలని, రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను యాక్టివేట్ చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పరిపాలనాపరంగా అత్యంత అప్రమత్తంగా ఉంటూ, మార్కెట్‌లో నిత్యావసరాల లభ్యతను నిర్దారించాలని ఆయన కోరారు. 

వ్యవసాయ రంగంపై ముందస్తు వ్యూహం

రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీ విషయంలో ముందస్తు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరారు. మార్చి 3 నుంచి నిరంతరం పని చేస్తున్న ఇంటర్ మినిస్టీరియల్‌ గ్రూప్ పరిస్థితులను రోజువారీగా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. 

ఇంధన భద్రత- ప్రత్యామ్నాయ మార్గాలు 

దేశ ఇంధన అవసరాల కోసం విదేశాలై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా ప్రధాని పలు సూచనలు చేశారు. బయో ఫ్యూయల్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వంటి రంగాల్లో రాష్ట్రాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ల విస్తరపై దృష్టి పెట్టాలి. చమురు, నేచురల్ గ్యాస్ కోసం దేశీయంగా అన్వేషణను పెంచడంలో రాష్ట్రాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు. 

రాష్ట్రాల స్పందన

ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు దేశంలో పెట్రోల్‌, డీజిల్, ఎల్పీజీ సరఫరా  స్థిరంగా ఉందని భరోసా ఇచ్చారు. ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు గొప్ప ఊరటనిస్తుందని వారు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా  వాణిజ్య ఎల్పీజీ కోటాను సంక్షోభం ముందున్న స్థాయిలో 50 శాతం నుంచి 70 శాతానికి పెంచడానికి కూడా రాష్ట్రాలు స్వాగతించాయి. 

Frequently Asked Questions

భారత ఆర్థిక వ్యవస్థను పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయి?

పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశంలో సరఫరా గొలుసును దెబ్బతీసి, సామాన్యులపై భారం మోపవచ్చు.

నిత్యావసరాల కొరతను సృష్టించేవారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

కృత్రిమ కొరత సృష్టించి లాభపడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సరఫరా గొలుసులో అంతరాయాలు లేకుండా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.

వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం ఎలాంటి ముందస్తు వ్యూహాలను అమలు చేస్తోంది?

రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల నిల్వ మరియు పంపిణీలో ముందస్తు ప్రణాళికతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్రాలను కోరింది.

భారతదేశ ఇంధన భద్రతను మెరుగుపరచడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు?

బయో ఫ్యూయల్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాల్లో ప్రయత్నాలను వేగవంతం చేయాలని, పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను విస్తరించాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget