అన్వేషించండి

Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?

Viksit Bharat Shiksha Adhishthan Bill: 18వ లోక్‌సభ 8వ సెషన్‌లో వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు ప్రవేశ పెట్టనుంది. రాజ్యాంగ సవరణ బిల్లులపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Government Legislative Agenda Lok Sabha: పద్దెనిమిదో లోక్‌సభ ఎనిమిదో సెషన్  వర్షాకాల సమావేశాలు  ప్రారంభానికి ముందే దేశ రాజధానిలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విడత సభ ముందుకు తీసుకురానున్న ఐదు కొత్త బిల్లులు, రెండు పాత బిల్లుల జాబితాను విడుదల చేసింది. గత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి, తీవ్ర వివాదాల మధ్య జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపిన వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025ను మళ్లీ ప్రవేశ పెట్టనున్నారు. దేశ ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా మార్చేసే ఈ బిల్లుపై విపక్షాలు సభలో గట్టిగా నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

విద్యా సంస్కరణల్లో కీలక మలుపు 

 వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు  భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి లేదా అత్యంత వివాదాస్పద కేంద్రీకరణకు దారితీయనుంది. ప్రస్తుతమున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  , ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్  , నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ లను రద్దు చేసి, వాటన్నింటినీ ఒకే ఒక్క అపెక్స్ బాడీ అయిన  వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ కిందకు తీసుకురావడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విజన్‌కు అనుగుణంగా రెగ్యులేషన్, అక్రిడిటేషన్, అకడమిక్ స్టాండర్డ్స్ కోసం మూడు స్వతంత్ర కౌన్సిళ్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే, దీనివల్ల విద్యా సంస్థల స్వయంప్రతిపత్తి  దెబ్బతింటుందని, రాష్ట్రాల అధికారాలకు కోత పడుతుందని ప్రతిపక్షాలు , విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   

మరో ఆరు కీలక బిల్లులలపై చర్చ

ఈ కీలక బిల్లుతో పాటు ప్రభుత్వం జాబితా చేసిన మరో 6 బిల్లులపైనా మీడియా దృష్టి సారించింది. గతంలో ప్రవేశపెట్టిన  ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్‌మెంట్ బిల్లు, 2026  తో పాటు ఆర్డినెన్స్‌ల స్థానంలో రానున్న ఇన్‌కమ్ టాక్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లులు ఈ విడత సభ ముందుకు రానున్నాయి. అయితే, ఈ మొత్తం ఎజెండాలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే.. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  రాజ్యాంగ సవరణ బిల్లులు,  నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన  డిలిమిటేషన్ బిల్లులు  ప్రస్తుతానికి ఈ అధికారిక జాబితాలో లేకపోవడం.  

రాజ్యాంగ సవరణ బిల్లులు ఎప్పుడు? 

 గత  ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను 550 నుండి 850కి పెంచేందుకు, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన  131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026  ను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, నాడు సభలో మూడింట రెండు వంతుల   మెజారిటీ లభించకపోవడంతో ఆ బిల్లు వీగిపోయింది.  ప్రస్తుత వర్షాకాల సమావేశాల జాబితాలో రాజ్యాంగ సవరణ బిల్లులు లేకపోవడం వెనుక కేంద్రం వ్యూహాత్మక వెనకడుగు వేసిందా? లేక విపక్షాలతో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత సప్లిమెంటరీ ఎజెండా ద్వారా సభలోకి తెస్తుందా? అనే సస్పెన్స్ నడుస్తోంది.

విపక్షాలు రెడీ ! 

మరోవైపు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష కూటమి ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండాను గట్టిగా ప్రతిఘటించేందుకు సిద్ధమవుతోంది. వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లుతో పాటు ఎఫ్‌సిఆర్‌ఏ   సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను కేంద్రీకరించే బిల్లులపై జేపీసీ  నివేదిక రానున్నందున  సభలో తీవ్రస్థాయిలో చర్చలు, వాదోపవాదాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద 18వ లోక్‌సభ 8వ సెషన్ విద్యా సంస్కరణలు, నిరుద్యోగిత,   పెండింగ్ బిల్లుల చుట్టూ తీవ్ర ఉత్కంఠ రేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget