అన్వేషించండి

Iran War: అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?

Iran War: అమెరికాతో నేరుగా ఫైట్ చేయాల్సి వస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ 10 లక్షల మందికిపైగా యోధులను సిద్ధం చేస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా భూభాగంపై అడుగుపెడితే లక్షలాది సైనికులతో ఇరాన్ ప్రతిఘటిస్తుంది.
  • ఆధునిక ఆయుధాల నిల్వలు తగ్గి, అమెరికా పాత డమ్‌ బాంబులు వాడాల్సి వస్తోంది.
  • ఇరాన్ 10 ఓడల చమురును అమెరికాకు 'మిస్టీరియస్ బహుమతి'గా పంపింది.
  • హార్ముజ్ జలసంధి నియంత్రణ, దౌత్య చర్చలు యుద్ధానికి కీలకంగా మారాయి.

Iran War: మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. ఇరాన్ తన దేశంపై అమెరికా గ్రౌండ్ వార్‌కు దిగితే గట్టిగా బుద్ది చెప్పేందుకు ఏకంగా 10 లక్షల మందికిపైగా యోధులను రంగంలోకి దించుతోంది. ఇరాన్ అధికార వార్తా సంస్థ తస్నిమ్‌ కథనం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న బాసిజ్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌, సైనిక నియామక కేంద్రాలకు యువకులు పోటెత్తుతున్నారు. అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంపై అడుగు పెడితే వారికి చారిత్రక నరకాన్ని చూపిస్తామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

ఇప్పటికే సరిహద్దుల్లో మోహించిన వేలాది మంది అమెరికన్ మెరైన్లకు తోడుగా, అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన 82వ ఎయిర్‌ బోర్ల్‌ డివిజన్‌ కూడా కొద్ది రోజుల్లోనే మధ్య ప్రాచ్యానికి చేరుకోనుంది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం అనివార్యం అనిపిస్తోంది. 

ఆయుధ నిల్వలపై అమెరికా ఆందోళన 

యుద్దం మొదలైన నెల రోజులు గడుస్తున్న వేళ అమెరికాకు కొత్త చిక్కులు ఎదురువుతున్నాయి. ది టెలిగ్రాఫ్‌ నివేదిక ప్రకారం, అమెరికా వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా దాని మిత్ర దేశాలు 11000 వేల క్షిపణులు, బాంబులు ఉపయోగించాయి. దీని కోసం దాదాపు 26 బిలియన్ డాలర్లు అంటే 2.15 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 

పాత పద్ధతికి వెళ్తున్న అమెరికా

ఆధునిక ఆయుధాల కొరత కారణంగా అమెరికా సైన్యం ఇప్పుడు పాత కాలపు డమ్‌ బాంబ్స్‌ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి కచ్చితత్వంతో లక్ష్యాలను తాకలేవు. సాధారణంగా తక్కువ బడ్జెట్‌ ఉన్న దేశాలు వీటిని ఉపయోగిస్తాయి. ఇరాన్ వంటి శక్తిమంతమైన దేశంతో యుద్దం చేస్తున్న సమయంలో ఇలాంటి ఆయుధాలు కొరత అమెరికా వ్యూహాలను దెబ్బ తీసే అవకాశం ఉంది. 

ట్రంప్ వెల్లడించిన రహస్య కానుక

ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ తమకు ఒక మిస్టీరియస్ బహుమతి పంపిందని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ క్యాబినెట్‌ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఇరాన్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి అమెరికాకు 10 భారీ ఓడల చమురును పంపిందని తెలిపారు. 

మొదట 8 షిప్‌లు పంపిస్తామని చెప్పిన ఇరాన్, తాము చేసిన కొన్ని వ్యాఖ్యలకు క్షమాపణగా అదనంగా మరో 2 కలిపి మొత్తం పది పంపారని వివరించారు. ఇవి పాకిస్తాన్ జెండాలతో ఉన్న ఓడలని ఆయన పేర్కొన్నారు. 

ఈ యుద్ధం కేవలం ఇరు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హుర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించే ప్రయత్నం కూడా. అమెరికా లేదా ఇజ్రాయెల్‌ సైన్యంతో సంబంధం ఉందని భావించే ఓడలను ఇరాన్ ఈ మార్గంలో అడ్డుకుంటోంది. ఇది అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

మరోవైపు బహిరంగంగా ఇరు దేశాలు కత్తులు దూస్తున్నా, తెర వెనుక పాకిస్తాన్ ద్వారా రాయబారాలు సాగుతున్నాయి. పాకిస్తాన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త ద్వారా పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ, రెండు దేశాలు ఒకరి ప్రతిపాదనలను మరొకరు తిరస్కరిస్తూనే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా తన దృష్టిని మధ్య ప్రాచ్యంపై కేంద్రీకరించడం వల్ల రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థల్లో లోపాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Frequently Asked Questions

అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తే ఇరాన్ ఎలా స్పందిస్తుంది?

అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంపై అడుగుపెడితే, వారికి చారిత్రక నరకాన్ని చూపిస్తామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇందుకోసం 10 లక్షల మంది యోధులను సిద్ధం చేస్తోంది.

యుద్ధంలో అమెరికా ఆయుధ నిల్వలు ఎలా ఉన్నాయి?

యుద్ధం మొదలైన నెల రోజులు గడుస్తున్న వేళ అమెరికా వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల అమెరికా పాత కాలపు డమ్ బాంబ్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇరాన్ అమెరికాకు ఎలాంటి 'మిస్టీరియస్ బహుమతి' పంపింది?

ఇరాన్ అమెరికాకు 10 భారీ ఓడల చమురును పంపింది. ఇది తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి, తాము చేసిన కొన్ని వ్యాఖ్యలకు క్షమాపణగా పంపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

ఈ యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఈ యుద్ధం ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హుర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం కూడా జరుగుతోంది. ఇరాన్ ఈ మార్గంలో ఓడలను అడ్డుకోవడం అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget