అన్వేషించండి

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు

షాబాద్‌లో ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్‌కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పుల వల్లే గతంలోనూ అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సోదరుడు భాస్కర్ పేర్కొన్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • షాబాద్ ఆరుగురి హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతిపై పోలీసులు కేసు నమోదు.
  • ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు, పోక్సో కేసుతో ఆరుగురిని హతమార్చాడు.
  • సెల్ఫీ వీడియోలో హత్యల ప్రణాళిక చెప్పి, అనంతరం ప్రాణాలు తీసుకున్నాడు.

Shabad 6 Murder Accused Rajkumar | షాబాద్: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన షాబాద్ 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతిపై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో, పోలీసులు బాధితుడి సోదరుడు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజ్‌కుమార్ ఆత్మహత్య మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని రాజ్‌కుమార్ సోదరుడు భాస్కర్ తన పిటిషన్‌లో తెలిపారు. 

రాజ్‌కుమార్ గత ప్రవర్తనకు సంబంధించిన పలు కీలక విషయాలను నిందితుడి సోదరుడు భాస్కర్ పోలీసులకు తన ఫిర్యాదులో వెల్లడించారు. రాజ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడని, దానివల్ల భారీగా అప్పులపాలు కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. అప్పుల బాధ తట్టుకోలేక గతంలో అక్టోబర్ 2025లో రాజ్‌కుమార్ ఇదే తరహాలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అతడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు తర్వాత నుంచి రాజ్‌కుమార్ చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని కీలక విషయాలు వెల్లడించారు. 

ఆరుగుర్ని హత్యచేయడానికి కొన్ని రోజుల ముందు రాజ్‌కుమార్ ప్రవర్తన ఉన్మాదానికి పరాకాష్టగా నిలిచింది. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసిన అనంతరం, రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. నేను ఆరుగురిని చంపేశాను, మీరు కూడా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్లిపోండి అని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు సమాచారం. ఆ తర్వాత పరారీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో రాజ్‌కుమార్, గతంలో లాగే మళ్లీ గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. 

Also Read: Shabad Mass Murder Accused: "అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

అసలేం జరిగిందంటే.. 

కొన్ని రోజుల కిందట రాజ్‌కుమార్ మీద మైనర్ (17) బాలిక కుటుంబసభ్యులు పోక్సో కేసు పెట్టారు. అయితే నిందితుడు బెయిల్ మీద విడుదలయ్యాడు. గత వారం బి. రాజ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురిని కత్తితో పొడిచి, గొంతుకోసి హత్య చేశాడు. మొదట తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక తల్లి, నానమ్మలను షాబాద్‌లోని వారి నివాసంలోనే హతమార్చాడు. ఆ తర్వాత కత్తితో బెదిరించి బాలికను ఊరి బయటకు తీసుకెళ్లి అక్కడ గొంతు కోసి హత్య చేశాడు. తరువాత తన స్వగ్రామానికి వెళ్లి, ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య సరితతో పాటు, 4 సంవత్సరాలు, 18 నెలల వయసున్న తన ఇద్దరు కుమారులును గొంతుకోసి దారుణంగా చంపేశాడు.  

హత్యలకు ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో 
ఈ ఆరుగుర్ని హత్య చేయడానికి కొన్ని గంటల ముందే రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్లు ఫ్యూచర్ సిటీ పోలీసులు గుర్తించారు. పోక్సో కేసు వల్ల తన జీవితం నాశనమైందని, ఆ యువతి వల్ల, ఆమె కుటుంబం వల్ల భారీగా అప్పులు చేశానని, తన కుటుంబానికి ఏమీ మిగలేదన్నాడు. దాంతో ఆ యువతి కుటుంబాన్ని హత్య చేయాలని.. ఆ తరువాత తన భార్యా పిల్లలను హత్య చేయాలని భావించినట్లు తెలిపాడు. 

హత్యల అనంతరం నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉండటంతో అతడి ఆచూకీ చెప్పినవారికి పోలీసులు రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు. దాదాపు  7 నుంచి 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల తరువాత కొత్తూరు మండలం పంజార్ల గ్రామం సమీపంలోని ఒక వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.  

Frequently Asked Questions

షాబాద్ 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతిపై కొత్తగా కేసు నమోదైందా?

అవును, నిందితుడు రాజ్‌కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతని సోదరుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు BNS సెక్షన్ 194 కింద దర్యాప్తు జరుగుతోంది.

రాజ్‌కుమార్ హత్యలకు ముందు ఎలా ప్రవర్తించాడు?

రాజ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పులపాలయ్యాడు, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పోక్సో కేసు తర్వాత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని అతని సోదరుడు తెలిపాడు. గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

రాజ్‌కుమార్ ఎవరెవరిని హత్య చేశాడు?

అతను మొదట తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక తల్లి, నానమ్మలను, ఆ తర్వాత బాలికను చంపాడు. ఆపై తన భార్య సరిత, 4, 18 నెలల వయసున్న తన ఇద్దరు కుమారులును హత్య చేశాడు.

రాజ్‌కుమార్ మృతదేహం ఎలా, ఎక్కడ లభ్యమైంది?

హత్యల అనంతరం పరారీలో ఉన్న రాజ్‌కుమార్ నాలుగు రోజుల తర్వాత కొత్తూరు మండలం పంజార్ల గ్రామం సమీపంలోని ఒక వెంచర్‌లో మృతదేహంగా కనుగొనబడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం, అతను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget