అన్వేషించండి

Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే

Electric Cab Service | విన్‌ఫాస్ట్ కంపెనీ సైతం క్యాబ్ సర్వీసులను ప్రారంభిస్తోంది. మొదట ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తేనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విన్‌ఫాస్ట్ భారత్‌లో గ్రీన్ ఎస్‌ఎమ్ ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభిస్తుంది.
  • మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో, తర్వాత ఇతర నగరాలకు విస్తరించనుంది.
  • సుమారు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీల ఫ్లీట్‌ను ఏర్పాటు చేయనుంది.
  • కిలోమీటరుకు సుమారు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.

Cab Services In India | సొంతంగా వాహనం లేని వారితో పాటు వేరే నగరాలకు వెళ్లిన సమయంలో క్యాబ్ సర్వీసుల ద్వారా మీకు కావాల్సిన చోటుకు వెళ్తుంటారు. భారత్‌లో గత కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి. వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి గ్రీన్ ఎస్‌ఎమ్ (Green SM) అని పేరు పెట్టారు. ఈ సర్వీసులను మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత క్రమంగా దీనిని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. దేశంలో పర్యావరణ హితమైన (ఈకో-ఫ్రెండ్లీ), పూర్తిగా ఎలక్ట్రిక్ టాక్సీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడం కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ ప్లాన్‌లో భాగంగా కంపెనీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ టాక్సీలను అందుబాటులోకి తేనుంది. దాదాపు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీల బెడాని (ఫ్లీట్) సిద్ధం చేయాలని సంస్థ ప్లాన్ చేసింది. ఈ టాక్సీలలో ప్రధానంగా విన్‌ఫాస్ట్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కార్లను వినియోగించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా, ప్రయాణికులకు కంఫర్ట్ జర్నీ అందించేలా, ఈ వాహనాలను ప్రత్యేకంగా రైడ్ హెయిలింగ్, టాక్సీ సేవల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

Also Read: పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!

కిలోమీటరుకు ఎంత చెల్లించాలి 
ఈ సర్వీస్‌కు సంబంధించి ప్రత్యేకమైన అంశం దీని అద్దె  మోడల్ అని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, ప్యాసింజర్స్ వద్ద నుంచి ఒక కిలోమీటరుకు దాదాపు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ప్రతిరోజూ క్యాబ్‌లలో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారికి, సిటీలో ప్రయాణించే వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ ఎస్‌ఎమ్ అనేది కేవలం ఒక టాక్సీ సేవ మాత్రమే కాదు. విన్‌ఫాస్ట్ కంపెనీ ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లకు బ్రాండింగ్‌తో పాటు తక్కువ సమయంలో గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది.

Also Read: Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది

ఎకో-ఫ్రెండ్లీగా ఈ ఎలక్ట్రిక్ కార్లు
ఈ ప్రాజెక్ట్ మరో కోణం ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారిత సర్వీస్. దాంతో ఎలాంటి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల అవసరం ఉండదు. దీనివల్ల కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తోంది. కనుక ఇటువంటి సేవలు భవిష్యత్తులో ఎంతో మేలు చేయనున్నాయి. 

ఈ సేవను కేవలం యాప్ ఆధారిత టాక్సీలకే పరిమితం చేయకుండా ఒక ఫ్లీట్ మోడల్‌గా నడపాలని కూడా కంపెనీ యోచిస్తోంది. అంటే డ్రైవర్లు, వాహనాలు, సేవల నాణ్యతపై కంపెనీకి డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల సేవలను నిలకడగా, మరింత మెరుగ్గా అందించడానికి వీలవుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Frequently Asked Questions

భారతదేశంలో విన్‌ఫాస్ట్‌ ఏ కొత్త సర్వీసును ప్రారంభించనుంది?

విన్‌ఫాస్ట్‌ భారతదేశంలో 'గ్రీన్ ఎస్‌ఎమ్' పేరుతో ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీసును ప్రారంభించనుంది. ఇది పూర్తిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన నెట్‌వర్క్‌.

గ్రీన్ ఎస్‌ఎమ్‌ సర్వీసులు మొదట ఏ నగరంలో ప్రారంభమవుతాయి?

గ్రీన్ ఎస్‌ఎమ్‌ సర్వీసులు మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత క్రమంగా ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

గ్రీన్ ఎస్‌ఎమ్‌ ఎంత మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది?

కంపెనీ దాదాపు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వాహనాలను ముఖ్యంగా రైడ్ హెయిలింగ్, టాక్సీ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

గ్రీన్ ఎస్‌ఎమ్‌ టాక్సీలకు కిలోమీటరుకు ఎంత ఛార్జీ వసూలు చేస్తారు?

నివేదికల ప్రకారం, ప్రయాణికుల నుంచి ప్రతి కిలోమీటరుకు సుమారు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఇది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget