అన్వేషించండి

Tata Tiago EV: టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ? నెలవారీ EMI ప్లాన్, రేంజ్ వివరాలు

Electric Vehicle | పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. ఒక మంచి, బెస్ట్ ఈవీ టాటా టియాగో కొనేందుకు డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరిగింది.
  • టాటా టియాగో ఈవీ తక్కువ డౌన్ పేమెంట్‌తో EMI లో లభిస్తుంది.
  • బేస్ మోడల్‌కు సుమారు రూ. 13,885 EMI నెలవారీ వస్తుంది.
  • ఈ కారు 226-285 కిలోమీటర్ల రేంజ్, అధునాతన ఫీచర్లను అందిస్తుంది.

భారత్‌లో కార్ల కొనుగోలు బాగా పెరిగింది. వెకేషన్ కోసం ప్రయాణాల కంటే రోజువారీ ప్రయాణాలకు తమకు సరిపోయే కార్ల కోసం చూస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు, ఫీచర్ల పరంగా కూడా బెస్ట్ కారును కొనాలని భావిస్తారు. పశ్చిమాసియా చమురు సంక్షోభం కారణంగా భారత్‌లో మే నెలలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాంతో నిరంతరం వాహనాలు నడిపేవారికి ఇంధన ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ మెయింటనెన్స్, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లడం వీటి ప్లస్ పాయింట్.

ఎలక్ట్రిక్ కారును నడపడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. పెట్రోల్, డీజిల్ తరహాలో ధరల పెరుగుదల భయం ఉండదు. అందుకే ప్రజలు నెమ్మదిగా ఎలక్ట్రిక్ కార్ల (Electric Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV). ఒకవేళ మీరు ఈ కారు కొనాలనుకుంటే, దీనిని పూర్తి నగదు చెల్లించకుండానే సొంతం చేసుకోవచ్చు. దీనిని సింగిల్ డౌన్ పేమెంట్ తరువాత నెలవారీ ఈఎంఐ (EMI) చెల్లిస్తూ కొనవచ్చు. టాటా టియాగో ఈవీ (EV) ఫైనాన్స్ ప్లాన్ గురించి ఇక్కడ వివరాలు తెలుసుకుందాం.

Also Read: Car Mileage Guide: కారు మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఇవి పాటిస్తే మీ ఖర్చులు తగ్గుతాయి

టాటా టియాగో ఈవీ ఆన్ రోడ్ ధర

టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ 'స్మార్ట్ 19' ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 6 లక్షల 99 వేలు. కాగా, ఆన్-రోడ్ ధరకు వచ్చేసరికి దాదాపు రూ. 7 లక్షల 30 వేల వరకు అవుతుంది. దీని టాప్ వేరియంట్ 'క్రియేటివ్ ప్లస్ 24' ప్రారంభ ధర రూ. 9 లక్షల 99 వేలు.. దీని ఆన్‌రోడ్ ధర సుమారు రూ. 10 లక్షల 40 వేల వరకు చెల్లించాలి. చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆర్‌టీఓ (RTO), రోడ్ టాక్స్‌లో భారీ రాయితీ ఇస్తున్నారు. దాంతో కారు ధర కొంతమేర తగ్గుతుంది.

ఈఎంఐ లెక్కలు ఇలా..

ఒకవేళ మీరు టాటా టియాగో ఈవీ కారు బేస్ వేరియంట్ 'స్మార్ట్ 19' కొనాలంటే మీరు కేవలం రూ. 1 లక్ష కనీస డౌన్ పేమెంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు బ్యాంక్ నుండి సుమారు రూ. 6 లక్షల 30 వేల వరకు లోన్ తీసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ మీకు ఏడాదికి 9.8 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలపరిమితికి ఈ లోన్ ఇస్తే, మీ నెలవారీ EMI దాదాపు రూ. 13 వేల 885 అవుతుంది. మీరు టాప్ వేరియంట్ తీసుకుని రూ. 1 లక్షా 4 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మీ ఈఎంఐ రూ. 19 వేల 790 వరకు అవుతుంది. 

Also Read: Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది

బెస్ట్ రేంజ్, సేఫ్టీ ఫీచర్లు

బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు ఈ కారు పనితీరు పరంగా కూడా చాలా ముందుంది. ఇది 2 బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 19.2 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 226 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా, 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ 285 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. కారు కేబిన్‌లో మీకు 10.25 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ప్రయాణీకుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి మోడ్రన్ ఫీచర్లు లభిస్తాయి.

Frequently Asked Questions

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలు ఏ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు?

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. వీటికి తక్కువ మెయింటనెన్స్, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌలభ్యం ఉంది.

టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర ఎంత?

టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ 'స్మార్ట్ 19' ఎక్స్-షోరూమ్ ధర రూ. 6,99,000. ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7,30,000 వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలతో ధర తగ్గే అవకాశం ఉంది.

టాటా టియాగో ఈవీ 'స్మార్ట్ 19' వేరియంట్ ను EMIలో కొనుగోలు చేయడానికి ఎంత డౌన్ పేమెంట్ మరియు EMI ఎంత వస్తుంది?

ఈ వేరియంట్ ను రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ తో బుక్ చేసుకోవచ్చు. సుమారు రూ. 6.30 లక్షల లోన్ తీసుకుంటే, 5 సంవత్సరాల కాలపరిమితికి, 9.8% వడ్డీ రేటుతో నెలవారీ EMI దాదాపు రూ. 13,885 వస్తుంది.

టాటా టియాగో ఈవీలో ఏయే సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, మరియు ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఆధునిక ఫీచర్లు లభిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget