అన్వేషించండి

Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది

Best Electric Scooter: హీరో, TVS, ఓలా (OLA EV) లకి చెందిన Electric Scooters భారత మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. అయితే ధర, రేంజ్, ఫీచర్ల ఆధారంగా ఏ ఈవీ బెస్ట్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ పెరుగుతోంది.
  • Ola, TVS, Hero Vida వంటి సంస్థలు మెరుగైన రేంజ్, ఫీచర్లతో స్కూటర్లను అందిస్తున్నాయి.
  • Ola ఎక్కువ టెక్నాలజీ, రేంజ్ అందిస్తుండగా, TVS, Hero నమ్మకం, స్థిరమైన పనితీరును అందిస్తున్నాయి.
  • కొనుగోలుదారులు రేంజ్, ఫీచర్లు, సర్వీస్ నెట్‌వర్క్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.

Best Electric Scooter: భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత మూడేళ్లుగా ఓ మోస్తరుగా ఈవీల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరగడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ప్రజలు ఈవీ స్కూటర్ల (EV Scooters) వైపు వేగంగా షిఫ్ట్ అవుతున్నారు.

ప్రస్తుతం ఆటో మార్కెట్లో హీరో (Hero), TVS, ఓలా (OLA) వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రతి కంపెనీ తమ స్కూటీని మెరుగైన రేంజ్, ఎక్కువ ఫీచర్లు, హై స్పీడ్‌తో లాంచ్ చేస్తోంది. స్పీడ్ సైతం బాగానే ఉండటం, ఇంధర ధరలతో పోల్చితే ఛార్జింగ్ కోసం తక్కువ ఖర్చు కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 

కొంతమంది ఎక్కువ రేంజ్ కోరుకుంటే, మరికొందరికి ఫీచర్లు, సర్వీస్ నెట్‌వర్క్ చాలా ముఖ్యమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేముందు వాటి బ్యాటరీ కెపాసిటీ, ధర, స్పీడ్, చార్జింగ్, రేంజ్ వంటి అనేక అంశాలను అర్థం చేసుకోవాలి. సరైన ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) మీ రోజువారీ ప్రయాణాన్ని చాలా చౌకగా, తేలిక చేస్తుంది. 

Also Read: Car Mileage Guide: కారు మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఇవి పాటిస్తే మీ ఖర్చులు తగ్గుతాయి

OLA, TVS ఎలక్ట్రిక్ స్కూటర్ల పవర్‌ఫుల్ ఫీచర్లు, స్పీడ్
OLA Electric తన ఫీచర్లు, ఎక్కువ రేంజ్ ఇచ్చే కారణంగా చాలా పాపులర్ అయింది. ఓలా కంపెనీకి చెందిన పలు మోడల్స్ లాంగ్ రేంజ్,  పెద్ద టచ్‌స్క్రీన్ వంటి సౌకర్యాలతో వస్తున్నాయి. టాప్ స్పీడ్ విషయంలో కూడా OLA స్కూటర్లు చాలా పవర్‌ఫుల్. మరోవైపు TVS iQube దాని నమ్మకమైన పర్ఫార్మెన్స్, స్మూత్ రైడ్ కోసం ఇష్టపడుతున్నారు. 

TVS కంపెనీ బలమైన సర్వీస్ నెట్‌వర్క్ కూడా వినియోగదారులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా భావిస్తారు. టీవీఎస్ iQubeలో రోజువారీ వాడకానికి సరిపోయేలా బ్యాలెన్స్‌డ్ రేంజ్, మంచి ఫీచర్లు లభిస్తాయి. చాలామంది ఫ్యామిలీ కస్టమర్లు TVS ఈవీ కొనాలని చూస్తున్నారు. రెండు కంపెనీలు ఈవీ మార్కెట్లో తమ పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!

సవాల్ విసురుతున్న Hero Vida 
Hero MotoCorp కి చెందిన Vida Electric Scooter సిరీస్ ఇప్పుడు మార్కెట్లో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. Hero కంపెనీపై ఉన్న బ్రాండ్ నమ్మకం, సర్వీస్ నెట్‌వర్క్ దీనిని మార్కెట్లో బెస్ట్ ఈవీగా మారుతోంది. Vida లో మంచి ఫీచర్లు, రిమూవబుల్ బ్యాటరీ, అద్భుతమైన డిజైన్ ఇచ్చారు. అయితే కొన్ని విషయాల్లో OLA ఎక్కువ టెక్నాలజీ, లాంగ్ రేంజ్ ఆఫర్ చేస్తుండగా TVS మెరుగైన నమ్మకానికి, స్థిరమైన పర్ఫార్మెన్స్‌తో మార్కెట్లో దూసుకెళ్తోంది. 

కస్టమర్ లాంగ్ రేంజ్, స్పీడ్ లాంటి ఎక్కువ ఫీచర్లు  కావాలనుకుంటే OLA బెస్ట్ ఆప్షన్ కావచ్చు. సర్వీస్ నెట్ వర్క్ సమస్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. నమ్మకమైన సర్వీస్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి TVS, Hero మెరుగైన ఛాయిస్ అని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు బ్యాటరీ కెపాసిటీ, ధర, స్పీడ్, ఛార్జింగ్ సమయం, రేంజ్ వంటి అంశాలను అర్థం చేసుకోవాలి.

OLA ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు పాపులర్ అయ్యాయి?

OLA ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటి ఫీచర్లు, ఎక్కువ రేంజ్, పెద్ద టచ్‌స్క్రీన్, పవర్‌ఫుల్ టాప్ స్పీడ్ కారణంగా పాపులర్ అయ్యాయి.

TVS iQube స్కూటర్ యొక్క ప్రధాన ఆకర్షణలు ఏమిటి?

TVS iQube దాని నమ్మకమైన పర్ఫార్మెన్స్, స్మూత్ రైడ్, బలమైన సర్వీస్ నెట్‌వర్క్, రోజువారీ వాడకానికి సరిపోయే బ్యాలెన్స్‌డ్ రేంజ్, మంచి ఫీచర్ల కోసం వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

Hero Vida Electric Scooter మార్కెట్లో ఎందుకు మంచి పేరు తెచ్చుకుంటోంది?

Hero MotoCorp బ్రాండ్ నమ్మకం, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, మంచి ఫీచర్లు, రిమూవబుల్ బ్యాటరీ, అద్భుతమైన డిజైన్ దీనిని మార్కెట్లో మంచి ఈవీగా నిలబెడుతున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget