అన్వేషించండి

Toyota Launches First Electric Car Urban Cruiser Ebella: టోయోటా నుంచి తొలి ఆల్-ఎలక్ట్రిక్ కార్ అర్బన్ క్రూజర్ ఎబెల్లా లాంచ్: సింగిల్ ఛార్జ్ పై 543 కిలోమీటర్ల మైలేజ్

టోయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాలో తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూజర్ ఎబెల్లాను రూ. 23.60 లక్షల ప్రారంభ ధరతో అఫీషియల్ గా లాంచ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టోయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా భారతదేశంలో ఆవిష్కరించబడింది.
  • కొత్త ఎలక్ట్రిక్ SUVలో JBL సౌండ్, ADAS ఉన్నాయి.
  • 61 kWh బ్యాటరీ 543 కిమీ రేంజ్ అందిస్తుంది.

Toyota Launches First Electric Car Urban Cruiser Ebella In India: ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టోయోటా కిర్లోస్కర్ మోటార్ రంగంలోకి దిగింది. బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కార్ 'అర్బన్ క్రూజర్ ఎబెల్లా' (Urban Cruiser Ebella) ను కంపెనీ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. దీని టాప్-స్పెక్ ఈ3 వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.60 లక్షలుగా నిర్ణయించారు. మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైన ఈ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ లాంటి మోడల్స్ కు గట్టి కాంపిటీషన్ ఇవ్వనుంది.

Read Also: New Gen Tata Tiago Vs Old Model: సరికొత్త టాటా టియాగో Vs పాత మోడల్: డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ పరంగా మారిన కారు.. కంప్లీట్ కంపారిజన్ రిపోర్ట్

ఆకట్టుకునే కలర్ ఆప్షన్స్..

అర్బన్ క్రూజర్ ఎబెల్లా షేప్ మారుతి ఈ-విటారాను పోలి ఉన్నా, టోయోటా తన సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్స్ తో దీనికి సరికొత్త లుక్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా దీని ఫ్రంట్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కారుకు మస్కులర్ అప్పీల్ ఇచ్చేలా చెక్కినట్లున్న బోనెట్, సైడ్స్ లో షార్ప్ క్యారెక్టర్ లైన్స్, ఏరోడైనమిక్ డిజైన్ తో కూడిన అల్లాయ్ వీల్స్ దీని లుక్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ ఎస్‌యూవీ 2700 మిమీ వీల్‌బేస్, 4285 మిమీ పొడవు, 1800 మిమీ వెడల్పును కలిగి ఉంటుంది. కెఫే వైట్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్ లాంటి సింగిల్ టోన్ కలర్స్‌తో పాటు బ్లాక్ రూఫ్ ఉన్న డ్యూయల్ టోన్ ఆప్షన్లలో కూడా ఇది లభిస్తోంది.

Read Also: Fuel Price Impact Automobile Demand:  పెరుగుతున్న ఇంధన ధరలతో ఆటోమొబైల్ రంగానికి షాక్: కార్ల అమ్మకాలపై పడనున్న ఇంపాక్ట్..!!

జేబీఎల్ సౌండ్ సిస్టమ్ తో పాటు లెవెల్ 2 అడాస్ సేఫ్టీ..

ఈ ఈవీ లోపల బ్లాక్, బ్రౌన్ షేడ్స్ తో కూడిన డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ చాలా క్లాసీగా డిజైన్ చేశారు. సరికొత్త డ్యాష్ బోర్డ్ తో పాటు మోడ్రన్ ఎలక్ట్రిక్ కార్లలో ఉండే పనోరమిక్ సన్‌రూఫ్, 10.1-ఇంచ్ బిగ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, లగ్జరీ జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, అంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా టోయోటా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ కారులో ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, డ్రైవింగ్ మరింత సేఫ్ గా మార్చే అడ్వాన్స్‌డ్ లెవెల్ 2 అడాస్ (ADAS) టెక్నాలజీని ప్రొవైడ్ చేసింది.

పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్.. 

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టోయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా టాప్ మోడల్ లో 61 కిలోవాట్ అవర్ (kWh) కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది 171 హార్స్ పవర్ (hp) శక్తిని, 189 ఎన్ఎమ్ (Nm) టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్ ట్రైన్ కారుకు క్విక్ యాక్సిలరేషన్ అందించడమే కాకుండా సింగిల్ ఛార్జ్ పై ఏకంగా 543 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. లాంగ్ జర్నీస్ చేయాలనుకునే వారికి, సిటీలో రోజువారీ ప్రయాణాలకు తక్కువ రన్నింగ్ కాస్ట్ తో లగ్జరీ ఎక్స్ పీరియన్స్ కావాలనుకునే కస్టమర్లకు ఈ టోయోటా ఈవీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారనుంది.

Frequently Asked Questions

టోయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా ధర ఎంత?

అర్బన్ క్రూజర్ ఎబెల్లా టాప్-స్పెక్ ఈ3 వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.60 లక్షలుగా నిర్ణయించారు.

అర్బన్ క్రూజర్ ఎబెల్లాలో ఏయే కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

ఈ SUV కెఫే వైట్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్ లాంటి సింగిల్ టోన్ కలర్స్‌తో పాటు బ్లాక్ రూఫ్ ఉన్న డ్యూయల్ టోన్ ఆప్షన్లలో కూడా లభిస్తోంది.

అర్బన్ క్రూజర్ ఎబెల్లా ఫీచర్లలో ముఖ్యమైనవి ఏమిటి?

ఇందులో 10.1-ఇంచ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, JBL సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ లెవెల్ 2 ADAS టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అర్బన్ క్రూజర్ ఎబెల్లా బ్యాటరీ, రేంజ్ ఎంత?

టాప్ మోడల్ లో 61 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది సింగిల్ ఛార్జ్ పై 543 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget