Best Electric Bikes: తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే - సూపర్ స్పీడ్, వావ్ అనిపించే రేంజ్!
Best Electric Bikes in India: తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ బైక్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మన మార్కెట్లో రెండు మంచి బైక్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Best Electric Bikes to Buy: పెట్రోల్, డీజిల్‌కు బదులుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. ఇటీవల చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ బైక్‌లను భారతదేశంలో విడుదల చేశాయి. ఇవి తక్కువ ధరలో ఉండటమే కాకుండా అద్భుతమైన రేంజ్‌ని అందిస్తాయి.
మీరు పెట్రోల్ ఖర్చుల నుంచి బయటపడాలనుకుంటే సిటీలో, లోకల్‌లో తిరగడం కోసం ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు మనం తక్కువ ధరలో లాంచ్ అయి మంచి ఫీచర్లను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి తెలుసుకుందాం.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి
ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster)
వీటిలో మొదటి బైక్ పేరు ఓలా రోడ్‌స్టర్. దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్ 2.5 కేడబ్ల్యూహెచ్, 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఓలా రోడ్‌స్టర్ బైక్ ధరల గురించి చెప్పాలంటే 2.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ. 74,999, 3.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ. 84,999, 4.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ బ్యాటరీ ఆప్షన్ ధరత రూ. 99,999గా ఉంది. ఓలా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించింది. దీన్ని పూర్తిగా ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 124 కిలోమీటర్లుగా ఉంది.
The Roadster X doesn’t just perform. It outperforms. Reserve now at ₹999 to experience electric motorcycling like never before. 🏍️💡
— Ola Electric (@OlaElectric) September 18, 2024
Link 👉 https://t.co/WnBcwe18mt#FutureOfMotorcycling #RideTheRevolution pic.twitter.com/H5U1IDM6GV
రివోల్డ్ ఆర్వీ1 (Revolt RV1)
ఈ బైక్ ఆర్వీ1, ఆర్వీ1 ప్లస్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. వీటిలో ఆర్వీ1 ధర రూ.84,990గా ఉంది. ఆర్వీ1 ప్లస్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.99,990గా ఉంది. ఈ బైక్‌ను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. మీరు ఆరు అంగుళాల డిజిటల్ ఎల్సీడీ డిస్‌ప్లేతో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ రివోల్ట్ బైక్‌లో అనేక గొప్ప ఫీచర్లను పొందుతారు.
దీని ఆర్వీ1 వేరియంట్ 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందించింది. ఇది కాకుండా రివోల్ట్ ఆర్వీ1 ప్లస్ వేరియంట్‌లో 3.24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 160 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
Charge anywhere, ride everywhere! 🔋
— Revolt Motors (@RevoltMotorsIN) September 23, 2024
The RV1 makes charging a breeze with its detachable battery. No need for charging stations — just charge it wherever life takes you.
🔋 RV1+ Battery: 3.24 KWH | Range - 160* KM
🔋 RV1 Battery: 2.2 KWH | Range - 100 KM#RV1 #RevoltMotors pic.twitter.com/a8fF8gAWlf
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే