అన్వేషించండి

Ola Electric Launches S1 X+: ఓలా నుండి S1 X+ స్కూటీ .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు! భారత్ సెల్ టెక్నాలజీతో త‌యారు!

ఓలా ఎలక్ట్రిక్ తన సొంత ‘భారత్ సెల్’ టెక్నాలజీతో రూపొందించిన S1 X+ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది 320 కిలోమీటర్ల భారీ రేంజ్ ఆఫర్ చేస్తోంది. ఈ లాంచ్ ఈవీ బైక్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. 

Ola Electric Launches S1 X+  5.2 kWh Scooty :బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్, భారత మార్కెట్లోకి తన అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ ‘S1 X+ 5.2 kWh’ స్కూటర్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్‌షోరూమ్) గా నిర్ణయించారు. అయితే, ఇది కేవలం ఏప్రిల్ 15, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంట్రడక్టరీ ఆఫర్. ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇందులో ఓలా స్వయంగా అభివృద్ధి చేసిన '4680 భారత్ సెల్' (4680 Bharat Cell) టెక్నాలజీని వాడారు. సాధారణంగా విదేశాల నుండి దిగుమతి చేసుకునే బ్యాటరీ సెల్స్ కాకుండా, దేశీయంగా తయారైన టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఈ లాంచ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

రేంజ్ - పర్ఫార్మెన్స్..
కొత్త ఓలా S1 X+ స్కూటర్ పనితీరు విషయంలో అస్సలు తగ్గలేదు. ఇందులో ఉన్న 11 kW మిడ్-డ్రైవ్ మోటార్ సహాయంతో ఈ వాహనం గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 5.2 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ద్వారా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 320 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. సిటీ లోపల ప్రయాణించే వారికి అలాగే లాంగ్ రైడ్స్ ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడకుండా ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ తో పాటు 'బ్రేక్-బై-వైర్' (Brake-by-Wire) సిస్టమ్ ను ఇందులో అమర్చారు.

సొంత టెక్నాలజీతో ఖర్చు తగ్గింపు..
ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ఈ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ.. 4680 భారత్ సెల్ ను మాస్ మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని అన్నారు. త‌మ అత్యంత ఖరీదైన ప్రొడక్ట్స్ లో వాడే టెక్నాలజీని ఇప్పుడు తక్కువ ధరలోనే కస్టమర్లకు అందిస్తున్నామ‌ని, వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల తాము వేగంగా కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతున్నామ‌ని పేర్కొన్నారు. ఈ భారత్ సెల్ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

విస్తృతమైన పోర్ట్‌ఫోలియో:
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ దగ్గర జెన్-3 (Gen 3) సిరీస్ లో రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. ప్రీమియం విభాగంలో S1 ప్రో+ (5.2 kWh, 4 kWh), S1 ప్రో (4 kWh, 3 kWh) వంటి మోడల్స్ ఉండగా, మాస్ మార్కెట్ కోసం S1 X సిరీస్ అందుబాటులో ఉంది. కేవలం స్కూటర్లే కాకుండా రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) వంటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా ఓలా విక్రయిస్తోంది. రోడ్‌స్టర్ సిరీస్ లో 2.5 kWh నుండి 9.1 kWh వరకు వేర్వేరు బ్యాటరీ కాన్ఫిగరేషన్లు లభిస్తున్నాయి. ఈ కొత్త S1 X+ 5.2 kWh లాంచ్ తో ఓలా మార్కెట్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలకు 320 కిమీ రేంజ్ ఇచ్చే ఈ స్కూటర్ ఒక స్మార్ట్ ఛాయిస్ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

ఇ-క్లచ్‌తో Rebel 300, Rebel 500 - క్లచ్‌ నొక్కే పని లేదు, గేర్‌ మార్చుకుంటూ దూసుకెళ్లడమే!
బాబర్‌ స్టైల్‌లో అదిరిపోయిన Honda Rebel 300, Rebel 500 - త్వరలోనే లాంచ్‌!
2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు
కొత్త Maruti Brezza ఎంత మైలేజ్‌ ఇస్తుంది? - మీ డబ్బులు ఆదా చేసే వేరియంట్‌ ఇదే!
E20తో పాటు E85 ఇంధనంతోనూ నడిచే హోండా ADV160 - ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
బైక్‌ లాంటి హోండా కొత్త మాక్సీ స్కూటర్‌ - అడ్వెంచర్‌ లుక్‌తో ADV160 అదుర్స్‌!
Tata Tiago on EMI: ₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?
₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget