అన్వేషించండి

Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలపై గడ్కరీ సీరియస్ - అలా జరిగితే కఠిన చర్యలు తప్పవు!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులకు వార్నింగ్ ఇచ్చారు.

గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు తగలబడిపోయిన ఘటనలు మనం ఎన్నోసార్లు చూశాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిపై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తామని... అవకతవకలు జరిగినట్లు తెలిస్తే భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

‘ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో గత రెండు నెలల్లో జరిగిన ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది గాయాల పాలవడం దురదృష్టకరం. ఈ ఘటనలపై నిపుణులతో ఒక కమిటీని నియమించాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన సిఫారసులను ఆ కమిటీ అందిస్తుంది.’ అని గడ్కరీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత విషయంలో కొత్త నియమాలు రూపొందిస్తామని, అలాగే లోపాలున్న వాహనాలను ఆయా కంపెనీలు వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏయే కంపెనీల వాహనాల్లో అయితే సమస్యలు తలెత్తాయో... ఆయా కంపెనీలకు నోటీసులు పంపించామని తెలిపారు.

ఏ కంపెనీ అయినా వాహనాల తయారీలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలిస్తే... వారికి జరిమానా విధించడంతో పాటు లోపాలున్న వాహనాలన్నీ వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో కంపెనీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ద్విచక్ర వాహనం నడిపేవారి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget