అన్వేషించండి

Nissan X-Trail: టయోటా ఫార్చ్యూనర్‌కి చెక్‌ పెట్టేందుకు వచ్చిన కొత్త ఎస్‌యూవీ, ధర ఎంతో తెలుసా?

నిస్సాన్ ఎక్స్‌-ట్రైల్‌ 4th జనరేషన్‌ SUV భారత్‌లో విడుదల అయ్యింది. దీని ధర రూ. 49.92 లక్షలుగా ఉంది. ఇది టయోటా ఫార్చ్యూనర్‌ కంటే ఎక్కువ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

Nissan X-Trail Launched In India: దశాబ్ద కాలం తర్వాత నిస్సాన్ ఎట్టకేలకు 4వ తరం ఎక్స్-ట్రైల్‌ను (Nissan X-Trail)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ SUV కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి చేయబడుతోంది. ఈ కారుకి సంబంధించిన బుకింగ్స్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వినియోగదారులు రూ.లక్ష టోకెన్ అమౌంట్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గత సంవత్సరం ఇదే ఎక్స్‌-ట్రైల్ ప్రపంచవ్యాప్తంగా 4.50 లక్షలకు పైగా యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది 2023లోనే టాప్ 5 SUVలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డిజైన్

ఇండియా-స్పెక్ ఎక్స్-ట్రైల్ దాని అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 3వ తరం మోడల్ కంటే మరింత సొగసైన డిజైన్‌తో వస్తుంది. ముందు భాగంలో స్ప్లిట్ LED లైటింగ్, ఇన్వర్టెడ్ L-ఆకారపు LED DRLలు, వెనుక భాగంలో L- ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 

ఈ SUV స్టాండర్డ్ 20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. దీని సెగ్మెంట్‌లో ఇది అతి పెద్దది. ఇది 2,705mm వీల్‌బేస్‌తో 4,680mm పొడవు, 1,840mm వెడల్పు మరియు 1,725mm ఎత్తుతో భారీ పరిమాణాన్ని కలిగి ఉంది. డోర్ క్లాడింగ్‌లు, వెనుక వైపర్ మరియు టాప్-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌, వాషర్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి అదనపు ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లు ఆకట్టుకుంటాయి

ఇంటీరియర్ & ఫీచర్లు

ఎక్స్-ట్రైల్ విశాలమైన ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కలిగి ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ వైపర్‌లు మరియు మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్‌ ఉన్నాయి. అంతే కాకుండా సెంటర్ కన్సోల్ కప్ హోల్డర్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్‌ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. 

ఇక ఈ ఎస్‌యూవీలోని సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (Anti-Lock Braking System) తో కూడిన EBD (Electronic Brakeforce Distribution), ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. లాంగ్‌ డ్రైవ్‌లో మంచి డ్రైవింగ్‌ అనుభూతిని అందిస్తుంది. ఆఫ్‌ రోడ్స్‌లోనూ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదు.

ఇంజిన్ స్పెసిఫికేషన్లు

ఇండియా-స్పెక్ నిస్సాన్ X-ట్రైల్ ఒకే ఇంజన్ ఆప్షన్ ద్వారా పనిచేస్తుంది. 1.5-లీటర్ మూడు-సిలిండర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 12V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ ఈ ఎస్‌యూవీలో జత చేయబడింది. ఈ ఇంజిన్ 161bhp పవర్ వద్ద 300nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాఫ్ట్‌ గేర్‌ కోసం షిఫ్ట్-బై-వైర్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ జతచేయబడింది.


అయితే నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను విడుదల చేయడానికి ముందు బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేయబడుతుంది. మొదటగా వినియోగదారులకు డెలివరీ చేయడానికి 150 యూనిట్లు భారత్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఈ SUV మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. అవి డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ మరియు సాలిడ్ వైట్‌గా ఉన్నాయి. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం ఈ కారుని 7-సీటర్‌ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

ఇది కేవలం 2WD (వీల్ డ్రైవ్) ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది. మంచి SUV కొనుగోలు కోసం చూస్తున్న పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్. అయితే దీని ధర టయోటా ఫార్చ్యూనర్ కంటే రూ. 49.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ఎస్‌యూవీతో నైనా భారతీయ మార్కెట్లోకి సత్తా చాటాలని నిస్సాన్‌ మోటార్స్‌ భావిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget