New Skoda Superb: లగ్జరియస్ లార్జ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ 'స్కోడా సూపర్బ్' లాంచింగ్ ఎప్పుడు, ధర ఎంత?
Skoda Superb Features: స్కోడా ఇండియా, త్వరలో మన దేశంలో కొత్త తరం 'సూపర్బ్'ను విడుదల చేయబోతోంది. ఈ కొత్త సెడాన్‌లో ఏ ఇంజిన్‌తో నడుస్తుంది, ప్రత్యేక లక్షణాలాంటో తెలుసుకుందాం.

New Skoda Superb Sedan Price, Mileage And Features: స్కోడా ఇండియా, ఇటీవలే, భారతీయ మార్కెట్లో Slaviaతో పాటు, మరో కొత్త ప్రీమియం సెడాన్‌తోనూ టీజ్ చేసింది. 2025 ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో దీనిని ప్రదర్శించింది. ఈ సెడాన్‌ను 'స్కోడా సూపర్బ్' న్యూ జనరేషన్ మోడల్ (2025 Skoda Superb) అని భావిస్తున్నారు. నిజానికి, ఈ కారు CBU (Completely Built Unit) గా భారతీయ రోడ్లలో పై పరుగులు తీస్తుంది. అంటే, దీనిని పూర్తిగా నిర్మించిన స్థితిలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు.
డిజైన్ ఎలా ఉంటుంది?
కొత్త స్కోడా సూపర్బ్ మోడల్ మునుపటి మోడల్ (2024 Skoda Superb) కంటే మరింత ప్రీమియంగా & మోడ్రన్ డిజైన్‌తో వస్తోంది. కొత్త Skoda Kodiaq SUV ఆధారంగా Skoda Superb ఎక్స్‌టర్నల్ బాడీని రూపొందించారు. షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు & టెయిల్‌ల్యాంప్‌లు, నిగనిగలాడే పెద్ద గ్రిల్, క్రోమ్ యాక్సెంట్లు & రిఫైన్డ్ ఏరోడైనమిక్ బాడీ డిజైన్‌తో అడ్వాన్స్‌డ్ లుక్స్‌లో కొత్త స్కోడా సూపర్బ్ కారు కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో మరింత లెగ్‌రూమ్ & లగ్జరీ టచ్‌లు కూడా ఇచ్చారు. ఈ ఫీచర్లు ఈ సెడాన్‌ను Toyota Camry Hybrid విభాగంలో బెస్ట్ ఆప్షన్‌గా నిలబెట్టవచ్చు.
ఇంజిన్ ఆప్షన్
స్కోడా సూపర్బ్ న్యూ ఏజ్ వెర్షన్‌లో ఉపయోగించిన ఇంజిన్ విషయానికి వస్తే.. భారతదేశంలో మొదటిసారిగా CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) యూనిట్‌గా డీజిల్ ఇంజిన్‌ను తిరిగి ప్రారంభిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం ఈ కంపెనీ భారతదేశంలో డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి నిలిపివేసినందున, ఇప్పుడు కంపెనీ తీసుకొచ్చే పెద్ద మార్పు ఇదే అవుతుంది. కొత్త Kodiaqలో ఉపయోగించిన అదే 2.0L TSI టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా సూపర్బ్‌లోనూ తీసుకొస్తోంది. డీజిల్ వెర్షన్ వస్తే, అది ఈ విభాగంలోని ఏకైక నాన్-హైబ్రిడ్ డీజిల్ ఆప్షన్ అవుతుంది.
సాంకేతికత & భద్రత
సాంకేతికత & భద్రత పరంగా కొత్త సూపర్బ్ పూర్తిగా హైటెక్ కార్‌లా ఉంటుంది. ADAS, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రిక్ సీట్లు, సన్‌రూఫ్, డిజిటల్ కాక్‌పిట్, పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే & మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను యాడ్ చేశారు. ఇది అంతర్జాతీయ మోడల్ కాబట్టి, భారతదేశం చట్టాల ప్రకారం స్కోడా కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు. సూపర్బ్ CBU యూనిట్‌గా వస్తుంది కాబట్టి దాని ధర దాదాపు రూ. 45–50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. అయితే, ఈ ధర టయోటా కామ్రీ కంటే ఎక్కువ.
ఇది భారతదేశంలో ఎప్పుడుల లాంచ్ అవుతుంది?
ఈ సెడాన్‌ను 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ చేయవచ్చు. ప్రధానంగా టయోటా కామ్రీకి పోటీగా ఈ కారు వస్తోంది & హోండా అకార్డ్‌తోనూ పోటీ పడుతుంది. కొత్త స్కోడా సూపర్బ్ స్కోడా ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ ప్రీమియం సెడాన్‌గా నిలబడి & ఈ బ్రాండ్ గుర్తింపును బలంగా చాటవచ్చు.





















