అన్వేషించండి

New Bike Engine Safety Tips: కొత్త బైక్‌ కొన్నవాళ్లు ఈ తప్పులు చేయొద్దు, లేదంటే ఫస్ట్‌ 2000 కి.మీ.కే ఇంజిన్‌ గుల్ల!

Safety Tips For New Bike: మీరు కొత్త బైక్ కొని ఝామ్మంటూ దూసుకుపోతుంటే, మీ స్పీడ్‌కు బ్రేక్‌లు వేయండి. లేదంటే బండి ఇంజిన్‌ గుండు సున్నా అవుతుంది!.

Tips For Keeping A New Bike In Good Condition: ధూమపానం & మధ్యపానం ఆరోగ్యానికి హానికరం - అధిక వేగం కొత్త బండికి అపాయకరం. మీరు ఒక కొత్త బైక్ కొని, గంటకు 80–100 కి.మీ. స్పీడ్‌తో నడుపుతూ ఆ థ్రిల్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే.. మీ జోరుకు వెంటనే బ్రేకులు వేయండి. లేదంటే ఇంజిన్‌ ఎందుకూ పనికిరాకుండా పోవచ్చు & పాత సామాను కింద దానిని అమ్మేయాల్సి రావచ్చు. 

కొత్త బైకును కొన్ని వేల కిలోమీటర్ల వరకు సరిగ్గా ట్రీట్ చేయడం చాలా ముఖ్యం. దీనిని వాహన పరిశ్రమలో "రన్నింగ్-ఇన్ పీరియడ్" (Running-in Period) అని పిలుస్తారు. ఈ నిర్దిష్ట కాలంలో జాగ్రత్తగా ఉంటేనే బండి ఆయుష్షు పెరుగుతుంది, బైకు కోసం మీరు ఖర్చు చేసిన డబ్బు నిలబడుతుంది.

రన్-ఇన్ పీరియడ్ ఎందుకు అవసరం?
ఏదైనా కొత్త బైక్‌కి రన్నింగ్-ఇన్ పీరియడ్ చాలా కీలకం. ఆ సమయంలో ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ & ఇతర మెకానికల్ భాగాలు ఒకదానికొకటి రుద్దుకుంటూ సెట్‌ అవుతాయి. ఈ భాగాలు కొత్తవి కాబట్టి వాటి మధ్య సమన్వయం నెమ్మదిగా పెరుగుతుంది. రన్నింగ్-ఇన్ పీరియడ్‌లో మీరు కొత్త బైక్‌ను అధిక వేగంతో నడిపితే ఈ భాగాలు అరిగిపోవడం ప్రారంభం కావచ్చు. ఇది ఇంజిన్ పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది, ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది & బైక్ జీవితకాలం కూడా తగ్గుతుంది. అందువల్ల, ప్రారంభ కాలంలో బైక్‌ను నెమ్మదిగా, బ్యాలెన్స్‌డ్‌గా & జాగ్రత్తగా నడపడం ముఖ్యం.

మొదటి 2,000 కి.మీ. వరకు బైక్‌ను ఎలా నడపాలి?
మొదటి 2,000 కి.మీ. సమయంలో బైక్‌ను నడపడానికి ఒక్కో కంపెనీ ఒక్కో విధానం రూపొందించింది, ఈ విషయం చాలా మందికి తెలీదు. ఉదాహరణకు, బజాజ్ పల్సర్ 150 విషయానికి వస్తే... గేర్ & వేగాన్ని బట్టి పరిమితులను నిర్ణయించింది. మొదటి 1,000 కి.మీ. సమయంలో... మొదటి గేర్‌లో గరిష్టంగా 10 కి.మీ/గం, రెండో గేర్‌లో 20, మూడో గేర్‌లో 30, నాలుగో గేర్‌లో 35 & ఐదో గేర్‌లో గరిష్టంగా 45 కి.మీ/గం వేగంతోనే వెళ్లాలని సిఫార్సు చేసింది. మిగిలిన 1,000 కి.మీ. విషయంలో ఈ వేగ పరిమితి... మొదటి గేర్‌లో 15 కి.మీ/గం, రెండో గేర్‌లో 30, మూడో గేర్‌లో 40, నాలుగో గేర్‌లో 45 & ఐదో గేర్‌లో గరిష్టంగా 55 కి.మీ/గం. వరకు పెంచింది. ఈ సమయంలో వెంటవెంటనే ఆక్సిలరేషన్‌ రైజ్‌ చేయడం  లేదా హఠాత్తుగా బ్రేక్‌లు వేయడం వంటివి కూడా చేయకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్‌పై అధిక ఒత్తిడి ఉండదు.

బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఈ పని చేయకూడదు
చాలా మంది బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్‌ రైజ్‌ ఇచ్చి వేగంగా నడపడం ప్రారంభిస్తారు, ఇది ఇంజిన్‌కు అత్యంత హాని చేసే అలవాట్లలో ఒకటి. బైకును స్టార్ట్ చేసినప్పుడు, ఇంజిన్ ఆయిల్ అన్ని భాగాలకు పూర్తిగా చేరి లూబ్రికేషన్ అందించడానికి కొంత సమయం పడుతుంది. మీరు వెంటనే స్పీడ్‌ అందుకుంటే ఆయిల్ ప్రతి భాగానికి సరిగ్గా చేరదు, ఇంజిన్‌ భాగాలు అరిగిపోవడం ప్రారంభమవుతుంది. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇంజిన్ ఆయిల్ పూర్తిగా ప్రసరించేలా & అన్ని భాగాలకు సరైన లూబ్రికేషన్ లభించేలా కనీసం 1 నిమిషం పాటు దానిని స్టాండ్‌పైనే ఉంచాలి.

కొత్త బండి విషయంలో విస్మరించకూడని ఇతర జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం & మొదటి 500 నుంచి 1,000 కి.మీ. మధ్య మొదటి సర్వీస్ ఆయిల్‌ను మార్చడం వంటివి చేయాలి. ప్రారంభంలోనే బైక్‌ మీద భారీ లోడ్ వేయకూడదు. సర్వీస్ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, మొదటి మూడు ఉచిత సర్వీసులను సకాలంలో పూర్తి చేయాలి. చైన్ టెన్షన్, టైర్ ప్రెజర్ & బ్రేకింగ్ సిస్టమ్‌ను తరచుగా చెక్‌ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ భద్రత & బండి పనితీరు బాగుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సినవి - ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొనాలా, వద్దా? - మంచి మైలేజ్‌ ఇస్తున్నప్పటికీ 3 మైనస్‌లు కూడా ఉన్నాయ్‌!
మాన్యువల్ నుంచి DCT వరకు - కార్లలో ఉండే అన్ని రకాల గేర్‌బాక్స్‌ల గురించి పూర్తి వివరాలు
MT, AMT, CVT.. కార్లలో ఎన్ని రకాల గేర్‌బాక్స్‌లు ఉంటాయి? తేడాలేంటి, మీకు ఏది బెస్ట్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Embed widget