Toyota Fortuner Loan: ఎంత జీతంతో టయోటా ఫార్చ్యూనర్ కొనొచ్చు, ఈ కారు కొనడానికి 40-50 ఫార్ములా ఏంటి?
Toyota Fortuner Down Payment: ఫార్చ్యూనర్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 36 లక్షలు. రిజిస్ట్రేషన్, బీమా, ఇతర ఛార్జీలు కలిపి ఆన్-రోడ్ ధర ఇంకా ఎక్కువ అవుతుంది.

Toyota Fortuner Price, Down Payment, Loan and EMI Details: ఫార్చ్యూనర్ కారు టయోటా కంపెనీకే గుర్తింపుగా మారింది, ఆ రేంజ్‌లో హిట్ అయింది. బలమైన పనితీరు, బాహుబలి రూపం, అద్భుతమై రోడ్ ప్రెజెన్స్‌తో ఈ బండి బాగా పాపులర్ అయింది. ఫార్చ్యూనర్ రోడ్డుపై వెళ్తున్న తీరును చూస్తే.. సింహం ఠీవిగా వెళుతుంటే ఇతర జంతువులు సైడ్ ఇచ్చినట్లు కనిపిస్తుంటుంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు & పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తుల మొదటి ఎంపికగా ఈ కారు పేరు తెచ్చుకుంది. సింహం లాంటి టయోటా ఫార్చ్యూనర్ కొనాలని మీకు అనిపించినా, రేటు ఎక్కువమని మీ ప్లాన్ పోస్ట్‌పోన్ చేసుకుంటే, తక్కువ ధరలో ఆ SUVని సొంతం చేసుకునే దారి ఒకటుంది. మీరు ఒకేసారి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, మీకు బ్యాంక్‌లు సపోర్ట్‌గా నిలుస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో టయోటా ఫార్చ్యూనర్ ధర
టయోటా ఫార్చ్యూనర్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 36.05 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో.. రిజిస్ట్రేషన్ ఫీజ్, పన్నులు, ఇన్సూరెన్స్ & ఇతర ఖర్చులు కలిపి దాదాపు 44.60 లక్షలు అవుతుంది. అంటే, కారు ధర మాత్రమే కాదు, దానితో సంబంధం ఉన్న అదనపు ఖర్చులను కూడా లెక్కేయాలి.
టయోటా ఫార్చ్యూనర్ డౌన్ పేమెంట్‌ను ఎలా లెక్కించాలి?
టయోటా ఫార్చ్యూనర్ కొనడం కోసం చాలా బ్యాంకులు 90% వరకు రుణం అందిస్తాయి. మీరు కేవలం 10% మొత్తాన్ని, అంటే దాదాపు రూ. 5 లక్షల వరకు డౌన్ పేమెంట్ చెల్లించాలి. మీరు 5.60 లక్షలు డౌన్ పేమెంట్ చేశారని భావిద్దాం. మిగిలిన రూ. 39 లక్షలు కారు రుణంగా మంజూరు అవుతుంది. ఈ రుణాన్ని మీరు 9% వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలానికి తీసుకున్నారని అనుకుందాం. మీ EMI నెలకు రూ. 62,747 అవుతుంది.
టయోటా ఫార్చ్యూనర్ కొనాలంటే ఎంత జీతం ఉండాలి?
నెలకు రూ. 62,747 EMI అనేది సగటు భారతీయుడికి చాలా ఎక్కువ మొత్తం. మీ నెలవారీ జీతం లేదా ఆదాయం రూ. లక్ష వరకు ఉన్నప్పటికీ ఈ EMI మీకు భారమే అవుతుంది. ఈ జీతంతో ఈ EMI చెల్లించడంతో పాటు ఇతర గృహ ఖర్చులను నిర్వహించడం కూడా దాదాపు అసాధ్యం అవుతుంది. మీ జీతం రూ. 1.25 లక్షలకు తగ్గకుండా, ఇతర లోన్ EMIలు లేకుంటే మీరు టయోటా ఫార్చ్యూనర్ బేస్ వేరియంట్ కొనవచ్చు. టయోటా ఫార్చ్యూనర్ ఇతర వేరియంట్ కొనాలని భావిస్తే.. ధర, డౌన్ పేమెంట్, లోన్ మొత్తం, EMI వంటి వివరాలు కూడా మారతాయి. కాబట్టి, వాటికి తగ్గట్లుగా మీ జీతం ఇంకా ఎక్కువగా ఉండాలి.
40-50 ఫార్ములా ఏంటి?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ EMI మీ జీతంలో గరిష్టంగా 40-50% వరకే ఉండాలి. అంటే, రూ. 50,000 జీతానికి రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు EMI సముచితంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయ వనరు ఉంటే లేదా రూ. 10-12 లక్షల భారీ డౌన్ పేమెంట్ చెల్లించే స్థితిలో ఉంటే మీరు టయోటా ఫార్చ్యూనర్ కొనడం తెలివైన పని. లేకపోతే, ఈ బడ్జెట్‌లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ వంటి SUVలను కొనుగోలు చేయడం మంచిది.
ఇంజిన్, ఫీచర్లు & స్పెసిఫికేషన్లు
టయోటా ఫార్చ్యూనర్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది, అవి - 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ & 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్. ఈ SUVలో 7 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కారు క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్ & 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు కనిపిస్తాయి.





















