Mahindra Car: ఈ రోజు బుక్ చేస్తే ఏడాది తర్వాతే డెలివెరీ, అయినా ఈ కార్‌ను వదలడం లేదు - ఏంటంట దీని స్పెషాలిటీ?
Mahindra XUV 3XO: ఈ మహీంద్రా కార్ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ కారులోని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 82 kW పవర్‌ను & 200 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

Mahindra XUV 3XO Price, Mileage And Features: మన మార్కెట్‌లో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనగలిగిన కార్లలో మహీంద్రా XUV 3XO ఒకటి. ధర అందుబాటులో ఉన్నప్పటికీ, కారు మాత్రం అందుబాటులో లేదు. దీనికి కారణం డిమాండ్. Mahindra XUV 3XO కోసం జనం ఎగబడుతున్నారు & షోరూమ్‌ల ఎదుట క్యూ కడుతున్నారు. హై డిమాండ్ కారణంగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా హై రేంజ్‌లో ఉంది. మీరు ఈ కారు బేస్ వేరియంట్‌ను ఈ రోజు బుక్ చేసుకుంటే ఒక సంవత్సరం తర్వాత డెలివరీ ఇస్తారు. దీనిని బట్టి ఈ ఫోర్‌వీలర్ డిమాండ్ స్థాయిని అంచనా వేయవచ్చు.
మహీంద్రా XUV 3XOలో అన్ని వేరియంట్లకు ఇంత భారీ వెయిటింగ్ పిరియడ్ లేకపోయినా, కొన్ని వేరియంట్‌ల కోసం వేచి ఉండే కాలం ఒక సంవత్సరం వరకు పెరిగింది. తాజా నివేదిక ప్రకారం, మే 2025 నాటికి మహీంద్రా XUV 3XO బేస్ వేరియంట్ MXT (పెట్రోల్) మోడల్ కావాలంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ టైమ్ వెయిట్ చేయాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ కారును ఎంత రేటుకు కొవనచ్చు?
ఈ కారు విడుదలైన తర్వాత మహీంద్ర కంపెనీ సుడి తిరిగింది, మంచి అమ్మకాలు సాధిస్తోంది. గత నెలలో (2025 ఏప్రిల్) 7 వేల 568 యూనిట్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా XUV 3XO బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Mahindra XUV 3XO ex-showroom price) 7.99 లక్షల రూపాయలు & హై-ఎండ్ మోడల్ రేటు 15.57 లక్షల రూపాయలు. తెలుగు నగరాల్లో.. మహీంద్రా XUV 3XO బేస్ వేరియంట్ ఆన్-రోడ్ రేటు (Mahindra XUV 3XO on-road price) 9.70 లక్షల వరకు ఉంటుంది.
ఇంజిన్ పవర్ & పెర్ఫార్మెన్స్
మహీంద్రా XUV 3XO మూడు ఇంజిన్ ఎంపికలతో (2 పెట్రోల్ వెర్షన్స్ & 1 డీజిల్ వెర్షన్) మార్కెట్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్స్‌ను చూస్తే... ఈ కారులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ బిగించారు, ఈ ఇంజిన్ గరిష్టంగా 82 kW పవర్‌ను జనరేట్ చేస్తుంది & 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ TGDi పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది, ఇది 96 kW పవర్‌ను & 230 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే... ఈ మహీంద్రా కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు, ఈ ఇంజన్ 86 kW పవర్‌ను & 300 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
లోన్ మీద ఈ కారు కొనవచ్చు
మహీంద్రా XUV 3XOలో అత్యంత చవకైన మోడల్ MX1 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్. దీని ఆన్-రోడ్ ధర రూ. 9.70 లక్షలు. మీరు ఈ కారు కొనడానికి రూ. 2 లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన 7.70 లక్షలను రుణంగా (Mahindra XUV 3XO Bank Loan) పొందవచ్చు. ఈ రుణంపై బ్యాంక్ వసూలు చేసే వడ్డీ ప్రకారం, ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని (Mahindra XUV 3XO Loan EMI) బ్యాంకుకు తిరిగి జమ చేయాలి. అంటే, మీపై పెద్దగా ఆర్థిక భారం లేకుండా ఈజీ EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు.





















