Toyota Mini Fortuner: తుపాను తలొంచి చూసే 'మినీ ఫార్చ్యూనర్', థార్ రాక్స్‌కు పోటీ - రేటు, ఫీచర్లు ఇవే
Toyota Mini Fortuner Features: టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJలో 2.7-లీటర్ 2TR-FE నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చినట్లు సమాచారం. దీని పవర్ ముందు తుపాను కూడా తలొంచాల్సిందే!.

Toyota Mini Fortuner Price, Mileage And Features In Telugu: భారత మార్కెట్లో SUVలకు భారీ డిమాండ్ కొనసాగుతోంది, సుదీర్ఘ వెయిటింగ్ పిరియడ్ ఉన్నప్పటికీ జనం వెయిట్ చేస్తున్నారు, వాటినే కొంటున్నారు. టయోటా కంపెనీ, పవర్‌ఫుల్ కార్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి వదలబోతోంది. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx)తో పోటీ పడే పవర్‌ఫుల్‌గా, స్టైలిష్ లుక్స్‌తో ఆ SUVని లాంచ్ చేయబోతోంది. పైగా.. బడ్జెట్ ఫ్రెండ్లీ బండిగా దానిని తీసుకొస్తూ, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా అందుబాటులో ఉంచనుంది. ఆ SUVనే "టయోటా FJ క్రూయిజర్". దీనిని "మినీ ఫార్చ్యూనర్" అని, "బేబీ ల్యాండ్ క్రూయిజర్" అని కూడా పిలుస్తున్నారు. మార్కెట్‌లో రాకముందే భారీ అంచనాలు మూటగట్టుకున్న ఈ SUV, లాంచ్ అయిన తర్వాత సంచలనాలు నమోదు చేస్తుందని భావిస్తున్నారు.
FJ క్రూయిజర్ ధర ఎక్స్-షోరూమ్ ధర (Toyota FJ Cruiser ex-showroom price) రూ. 20 లక్షల నుంచి రూ. 27 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఈ రేటుతో ఇది కొన్ని పాపులర్ SUVలు - మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N), టాటా సఫారీ (Tata Safari), జీప్ కంపాస్ (Jeep Compass)కు పోటీ ఇస్తుంది.
మన దేశంలో ఎప్పుడు లాంచ్ అయింది?
టయోటా FJ క్రూయిజర్/ మినీ ఫార్చ్యూనర్/ బేబీ ల్యాండ్ క్రూయిజర్ SUV భారతదేశంలో ఇంకా లాంచ్ కాలేదు, ఉత్పత్తి కూడా ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ బండి ప్రొడక్షన్ 2026 చివరి నాటికి థాయిలాండ్‌లో ప్రారంభం అవుతుంది. 2027 జూన్ నాటికి భారతదేశంలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. దీనిని ఛత్రపతి శంభాజీనగర్ (మహారాష్ట్ర)లోని మేక్ ఇన్ ఇండియా ప్లాంట్‌లో తయారు చేస్తారు.
టొయాటా FJ క్రూయిజర్ డిజైన్
టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ డిజైన్ ఇప్పటివరకు పూర్తిగా రహస్యంగా ఉంచారు. అయితే, 2023లో విడుదలైన ఏకైక టీజర్ ఆధారంగా, ఈ SUV లుక్ చాలా రఫ్ &టఫ్‌గా, బాక్సీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది అడ్వాన్స్‌డ్ LED లైటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కావచ్చు, ఈ లైటింగ్ సిస్టమ్ ఈ ఫోర్‌వీలర్‌కు మోడర్న్ & ప్రీమియం లుక్స్‌ను ఆపాదిస్తుంది. హైయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ & చంకీ టైర్లు దీనిని ఆఫ్-రోడ్‌లోనూ చిరుతపులిలా పరిగెత్తిస్తాయి. టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ ఈ బండి క్లాసిక్ SUV లుక్‌ను మరింత బలపరుస్తుంది.
2.7-లీటర్ 2TR-FE నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ నుంచి టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ పవర్ తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ ఈ SUVని బలంగా & వేగంగా పరుగులు తీయిస్తుంది. ఇది గరిష్టంగా 161 bhp పవర్‌ను & 246 Nm టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేస్తారు. నాలుగు చక్రాలకు శక్తిని పంపడానికి 4WD వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. టయోటా కంపెనీ, కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్ కోసం హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా బిగించే అవకాశం ఉంది.





















