New Tata Car: 27km మైలేజ్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లున్న స్టైలిష్ SUV - రేటు రూ.10 లక్షల కంటే తక్కువే!
2025 Tata Punch Facelift Version: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2025 వెర్షన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ 5-స్టార్ రేటింగ్ పొందిన SUV మైలేజ్, ఫీచర్లు, ఇంజిన్ & ధర గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.

2025 Tata Punch Facelift Price, Features And Mileage: టాటా మోటార్స్, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ను షేక్ చేయడానికి మరోమారు సిద్ధమైంది. 2025 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో, ఈ కంపెనీ, 5-స్టార్ రేటెడ్ SUVని కొత్త అవతార్‌లో పరిచయం చేయబోతోంది. టెస్టింగ్ టైమ్‌లో గుర్తించిన & లీక్ అయిన ఫొటోలు, వివరాల ప్రకారం.. ఈ SUV స్టైల్, సేఫ్టీ & స్మార్ట్ టెక్నాలజీల సూపర్ కాంబినేషన్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
డిజైన్‌లో EV తరహా టచ్
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2025 వెర్షన్ డిజైన్ కూడా టాటా పంచ్ EV డిజైన్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. టెస్టింగ్ టైమ్‌లో, కారు ముందు & వెనుక భాగాల్లో కొన్ని కాస్మెటిక్ మార్పులు కనిపించాయి, ఇవి ఈ SUVని మునుపటి కంటే మరింత మోడర్న్‌గా & యూత్‌ఫుల్‌గా కనిపించేలా చేయవచ్చు. ఈ బండికి కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ప్యాటర్న్, EV-ఇన్‌స్పైర్డ్ DRLs, LED టెయిల్‌లైట్లు & కొత్త స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను బిగించే అవకాశం ఉంది.
ఎక్‌ట్రార్డినరీ ఇంటీరియర్!
పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత స్మార్ట్ & ప్రీమియంగా తీర్చిదిద్దేందుకు టాటా కంపెనీ ప్రయత్నించవచ్చు. ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త 2-స్పోక్ లెథరెట్ స్టీరింగ్ వీల్ క్యాబిన్‌లో ఉండవచ్చు. 7-అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, కొత్త FATC క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, వైర్‌లెస్ ఛార్జింగ్, కప్ హోల్డర్ & ఫాబ్రిక్ సీట్ అప్‌హోల్‌స్టెరీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను చేసే అవకాశం ఉంది. డాష్‌బోర్డ్ లేఅవుట్ ప్రస్తుత మోడల్ లాగానే ఉంటుంది.
అదే ఇంజిన్ & అదే పెర్ఫార్మెన్స్
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాబట్టి బండి ఇంజిన్ & పనితీరులో ఎటువంటి మార్పులు ఉండవు. ఈ SUV మునుపటి మాదిరిగానే 1.2 లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 86 bhp పవర్ & 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. CNG వెర్షన్ 73.4 bhp పవర్ & 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ & 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో బండిని కొనుగోలు చేయవచ్చు. ఈ కారు పెట్రోల్ వెర్షన్‌లో లీటరుకు 27 కి.మీ. & CNG వెర్షన్‌లో లీటరుకు 26.99 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ప్రయాణీకుల భద్రత మాటేంటి?
టాటా అంటేనే భద్రతకు పాపులర్ బ్రాండ్. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మునుపటి కంటే మెరుగైన భద్రతతో వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే GNCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా సాధించింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి లక్షణాలు కూడా తోడవుతాయని భావిస్తున్నారు. ఇవన్నీ కారుకు & కారులోని ప్రయాణీకులకు అదనపు రక్షణగా నిలుస్తాయి.
ధర & విడుదల
ఈ కారును 2025 పండుగ సీజన్‌లో భారతదేశంలో విడుదల చేయవచ్చని అంచనా. దీని అంచనా ఎక్స్-షోరూమ్ ధర (2025 Tata Punch Facelift ex-showroom price) రూ. 6 లక్షల నుంచి రూ. 9.5 లక్షల వరకు ఉండవచ్చు. Hyundai Exter, Maruti Suzuki Fronx & Citroen C3 వంటి SUVలతో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పోటీ పడుతుంది.





















