అన్వేషించండి

Honda First Electric Bike: హోండా తొలి ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేసింది - సింగిల్‌ ఛార్జ్‌తో 170 km ఆగకుండా వెళ్లొచ్చు!

Honda Electric Bike E-VO: హోండా కంపెనీ, తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ E-VOను లాంచ్‌ చేసింది. ఈ మోటార్ సైకిల్‌ను తొలుత చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.

Honda Electric Bike E-VO Launching: ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ "హోండా E-VO"ను ఆవిష్కరించింది. ఈ బైక్‌ను చైనా కంపెనీ సహాయంతో తయారు చేసింది & మొదట అక్కడే లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో హోండా మొట్టమొదటి ప్రజంటేషన్‌ ఇది. లాంగ్‌ రేంజ్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌లో ఈ మోటార్‌ సైకిల్‌ను హోండా తీసుకువచ్చింది.

డిజైన్‌ 
హోండా E-VO డిజైన్ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్ బైక్ లాగా ఉంటుంది, ఇది యువతను బాగా ఆకర్షిస్తుంది. ముందు చక్రం 16 అంగుళాలు & వెనుక చక్రం 14 అంగుళాలతో సెమీ-స్లీక్ టైర్లను కంపెనీ అందించింది. సెమీ-స్లిక్ టైర్లను హై-పెర్ఫార్మెన్స్‌ బండ్ల కోసం ఉపయోగిస్తారు. రోడ్డుపై ఇవి సరైన గ్రిప్‌ కలిగి ఉంటాయి, తడి రోడ్ల మీద కూడా బండిని జారిపోనివ్వవు. మెరుగైన హ్యాండ్లింగ్, స్టీరింగ్ వీల్ రెస్పాన్స్ & మిడ్-కార్నర్ కంట్రోల్‌ నియంత్రణను కోరుకునే రైడర్లు వీటిని ఇష్టపడతారు. హోండా E-VO బేస్ మోడల్‌ బైక్ బరువు 143 కిలోలు & హై-రేంజ్ మోడల్‌ బరువు 156 కిలోలు. ఇది బ్లాక్‌ & వైట్‌ కలర్‌ ఆప్షన్స్‌తో లాంచ్‌ అయింది. ఈ బైక్‌లో 7-అంగుళాల డిజిటల్ TFT డాష్‌బోర్డ్ కూడా ఉంది.

బ్యాటరీ & రేంజ్‌
హోండా E-VOలో రెండు బ్యాటరీ ఎంపికలు (Honda Electric Bike E-VO Battery Options) అందించారు. మొదటి వేరియంట్ 4.1kWh బ్యాటరీతో వస్తుంది, ఇది 120 కిలోమీటర్ల రేంజ్‌ (Honda Electric Bike E-VO Range) ఇస్తుంది & 1 గంట 30 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. రెండోది హై-రేంజ్ వేరియంట్, ఇది 6.2kWh బ్యాటరీతో వచ్చింది, ఫుల్‌ ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు & 2 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు వేరియంట్‌లను పోర్టబుల్ AC ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.

పనితీరు & పవర్‌
హోండా E-VOలో గరిష్టంగా 20.5 bhp పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంది. ఇది బండి రన్నింగ్‌ను మృదువుగా ఉంచుతునే వేగవంతమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. రైడర్ల వెసులుబాటు కోసం ఎకో, నార్మల్ & స్పోర్ట్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) & బ్యాటరీ SOC డిస్‌ప్లే వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కూడా ఈ బండిలో యాడ్‌ చేశారు.

ధర
హోండా E-VO ధర (Honda Electric Bike E-VO Price) చైనాలో CNY 30,000 నుంచి CNY 37,000 మధ్య నిర్ణయించారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 3.56 లక్షల నుంచి రూ. 4.39 లక్షల వరకు ఉంటుంది. 

భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?
ప్రస్తుతం, భారతదేశంలో హోండా E-VO లాంచ్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇది, లోకల్‌ పార్ట్‌నర్‌ సహకారంతో చైనా కోసం అభివృద్ధి చేసిన మోడల్‌. అయితే, భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్‌ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి, భవిష్యత్తులో ఇండియాలోనూ ఈ బండి లాంచింగ్‌ సాధ్యమే. హోండా E-VO భారతదేశంలో లాంచ్ అయితే TVS iQube, Ola S1 Pro & Ather 450X వంటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గట్టి పోటీని ఇవ్వగలదు. లాంగ్‌ రేంజ్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ  & హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ బండిని EV బైక్ విభాగంలో గేమ్ ఛేంజర్‌గా మార్చగలవు.

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget