అన్వేషించండి

Nissan CNG SUV: బడ్జెట్ ఫ్రెండ్లీ, మెగా మైలేజ్‌తో వచ్చిన నిస్సాన్ CNG SUV - మారుతి బ్రెజ్జాకి గట్టి పోటీ

Nissan Magnite CNG SUV: నిస్సాన్, తన పాపులర్‌ SUV మాగ్నైట్‌ CNG వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 6.89 లక్షలు. ఆన్‌-రోడ్‌ ధర ఇంకొంచం ఎక్కువ ఉంటుంది.

Nissan Magnite CNG SUV Price, Mileage And Features: భారతదేశంలోకి కొత్త, తక్కువ ధర SUV వచ్చింది. నిస్సాన్ ఇండియా, తన హిట్ సబ్-కాంపాక్ట్ SUV మాగ్నైట్ CNG వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ఇంధన ఖర్చు, స్టైలిష్ & పవర్‌ఫుల్‌ SUV కోరుకునేవాళ్లకు సరిపోయే కార్‌ ఇది. భారతీయ మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్‌ ధర (Nissan Magnite CNG SUV ex-showroom price) రూ. 6.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.       

రెట్రోఫిట్ CNG ఆప్షన్‌
నిస్సాన్ మాగ్నైట్ CNG అనేది కంపెనీ తయారు చేసిన ప్రత్యేక మోడల్ కాదు. కానీ, ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌పై డీలర్ స్థాయిలో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసి డెలివెరీ చేస్తున్నారు. ఈ కిట్‌ను మోటోజెన్ అందిస్తోంది & ప్రభుత్వం ఆమోదించిన ఫిట్టింగ్ సెంటర్లలో ఇన్‌స్టాల్ చేస్తారు.         

కొత్త మాగ్నైట్ CNGని ఎక్కడ కొనాలి?
ప్రస్తుతం, నిస్సాన్ మాగ్నైట్ CNG దిల్లీ-NCR, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ & కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని బుకింగ్ జూన్ 1, 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తరువాత, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వస్తుంది.          

వ్యయం & అదనపు అంశాలు
నిస్సాన్ మాగ్నైట్ CNG వెర్షన్ కొనుగోలు చేసేవాళ్లు పెట్రోల్ మోడల్ కంటే దాదాపు రూ.75,000 ఎక్కువ ఖర్చు చేయాలి. అయితే, పెట్రోల్‌తో పోలిస్తే CNG కోసం తక్కువ ఖర్చు, మెరుగైన మైలేజ్ & తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా ఈ అదనపు ఖర్చు (రూ.75,000) మొత్తం అతి త్వరలోనే తిరిగి వస్తుంది. ఆ తర్వాత అంతా మిగులే కనిపిస్తుంది.            

ఇంజిన్ స్పెసిఫికేషన్లు & మైలేజ్
మాగ్నైట్ CNG 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ పొందుతుంది, ఇది 72PS శక్తిని & 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో కొంచెం తక్కువ పవర్‌ జనరేట్‌ కావచ్చు, కానీ పెరిగే మైలేజ్‌ ఈ లోటును భర్తీ చేయగలదు. నిస్సాన్ మాగ్నైట్ పెట్రోల్ వేరియంట్ల మైలేజ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 17.9 km నుంచి 19.9 km వరకు ఉంటుంది. CNG మోడల్ మైలేజ్ కిలోకు 24 km వరకు ఉంటుంది. ఈ కారు, మారుతి బ్రెజ్జాకు (Maruti Brezza) ప్రత్యామ్నాయంగా ప్రత్యక్ష పోటీ ఇస్తుంది.

టర్బో-CNG వేరియంట్ వస్తుందా?
ప్రస్తుతం, నిస్సాన్ మాగ్నైట్ CNGలో టర్బోచార్జ్‌డ్‌ ఇంజిన్ ఆప్షన్‌ అందుబాటులో లేదు. ప్రస్తుతం, భారత మార్కెట్లో, టాటా నెక్సాన్ CNG మాత్రమే టర్బో-CNG ఇంజిన్‌తో వస్తుంది. నిస్సాన్ కంపెనీ, మాగ్నైట్ CNGని బేస్ మోడల్ XE నుంచి మిడ్-స్పెక్ XV వరకు మొత్తం 6 పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. అంటే, కస్టమర్లు వారి అవసరాలు & బడ్జెట్ ప్రకారం మెరుగైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget