Low Price Car: రూ.30,000 జీతంతోనూ కొనగలిగే స్టైలిష్ కార్ - మైలేజ్, ఫీచర్లలో నెక్ట్స్ లెవెల్
Renault Kwid On Loan EMI: ఈ కారు చవకగా వస్తుంది, రూ.30 వేల జీతం ఉన్న వ్యక్తి కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఆర్థిక భారం పడకుండా EMI ఆప్షన్ కూడా ఉంది.

Renault Kwid Finance Plan: సొంత కారు అనేది సగటు భారతీయుడి కల. ఓపికగా సెర్చ్ చేస్తే తక్కువ రేటులో కొత్త బండిని సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ లేకపోవడం వల్ల, చాలా మంది ప్రజలు సొంత కారు కలను నిజం చేసుకోలేకపోతున్నారు. అయితే, రూ. 30,000 జీతం ఉన్న వ్యక్తి కోసం కూడా మన మార్కెట్‌లో కార్లు (2025 Low Cost Car) ఉన్నాయని చెబితే మీరు నమ్మగలరా?. మీ నెల జీతం 30,000 మాత్రమే అయినప్పటికీ, సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక కారును చవకగా కొనవచ్చు.
చవకైన కారు ధర ఎంత?
మేం చెబుతున్న కారు - రెనాల్ట్ క్విడ్. దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Renault Kwid ex-showroom price) రూ. 4.70 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో... రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బీమా, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ. 92,000 చెల్లించాలి. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 5.62 లక్షలు అవుతుంది. మీరు కేవలం లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ కార్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన రూ. 4.62 లక్షలను బ్యాంకు మీకు లోన్‌గా ఇస్తుంది. ఈ డబ్బును మీపై పెద్దగా ఆర్థిక భారం లేకుండా సులభంగా చెల్లించడానికి EMI ప్లాన్స్ కూడా ఉన్నాయి.
మీకు, రూ. 4.70 లక్షల రుణాన్ని 9 శాతం వార్షిక వడ్డీ రేటుకు బ్యాంక్ మంజూరు చేసిందనుకుందాం. మీరు ఆ రుణాన్ని 4, 5, 6, 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా EMI ప్లాన్ పెట్టుకోవచ్చు.
రెనాల్ట్ క్విడ్ ఫైనాన్స్ ప్లాన్
* 7 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, నెలకు మీరు రూ. 7,433 EMI చెల్లిస్తే సరిపోతుంది.
* 6 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, నెలకు రూ. 8,328 EMI కడితే చాలు.
* 5 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, EMI రూ. 9,590 EMI అవుతుంది.
* 4 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, నెలకు మీరు రూ. 11,497 EMI చెల్లిస్తే సరిపోతుంది.
మీ జీతం రూ. 30,000 అయితే, మీరు 7 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకోవచ్చు. మీ క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ విధానాలను బట్టి బ్యాంక్ లోన్ రేటు మారుతుంది.
ఇంజిన్ పవర్ & మైలేజీ
రెనాల్ట్ క్విడ్ 1.0 RXE 1.0L వేరియంట్‌లో కంపెనీ 999 cc ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 bhp శక్తిని, 9 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం, ఈ కారు లీటరుకు దాదాపు 21 కి.మీ మైలేజీ (Renault Kwid Mileage) అందిస్తుంది. దీనికి 28 లీటర్ల ఇంధన ట్యాంక్ కూడా ఉంది. ఈ లెక్కన, ట్యాంక్ ఫుల్ చేస్తే ఈ కారు దాదాపు 588 కిలోమీటర్లు ఆగకుండా వెళ్తుంది.
రెనాల్ట్ క్విడ్ స్పెసిఫికేషన్లు
ధర తక్కువైనా రెనాల్ట్ క్విడ్ ఫీచర్లలో కొత్తదనానికి కొదవ లేదు. కార్ క్యాబిన్‌లో.. పవర్ స్టీరింగ్, లేన్ చేంజ్ ఇండికేటర్, టాకోమీటర్, రియర్ స్పాయిలర్, LED DRL, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, చైల్డ్ సేఫ్టీ లాక్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి చాలా మంచి & ఆధునిక లక్షణాలతో ఈ కార్‌ను డిజైన్ చేశారు. మార్కెట్లో, ఈ కారు మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10) కు పోటీ ఇస్తుంది.





















