అన్వేషించండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ చిన్న పరికరాలు మీ దగ్గర ఉంటే టెన్షన్‌-ఫ్రీ, పెద్ద ఖర్చు కూడా కాదు!

వర్షాకాలంలో కారును సురక్షితంగా నడిపేందుకు ఉపయోగపడే కీలక యాక్సెసరీస్‌, వాటి ధరలు, ప్రయోజనాలు, కారు సంరక్షణ చిట్కాలను తెలుసుకోండి.

Monsoon rains car accessories: వర్షాకాలంలో కారు నడపడం అంత సులభం కాదు. రహదారిపై నీరు నిలవడం, బ్రేక్‌ వేస్తే జారే రోడ్లు, విజిబిలిటీ తగ్గడం వంటివి వాహనదారులను చాలా చికాకు పెడతాయి. రాత్రివేళ ఈ సమస్య మరింత పెరుగుతుంది. విండ్‌షీల్డ్‌పై నీటి బిందువులు చేరితే ముందున్న రోడ్డు స్పష్టంగా కనిపించదు. సైడ్‌ మిర్రర్లపై నీరు చేరినా వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో డ్రైవింగ్‌ నైపుణ్యం ఒక్కటే సరిపోదు, కొన్ని చిన్న పరికరాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి.

ఈ వర్షాల సమయంలో, కారుకు అవసరమైన యాక్సెసరీస్‌ను సిద్ధం చేసుకోవడం మంచిది. వీటి కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలోనే లభించే కొన్ని పరికరాలు కారుకు, మీకు రక్షణ ఇస్తాయి. డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి.

విండ్‌షీల్డ్‌ స్పష్టంగా కనిపించాలంటే

వర్షం పడుతున్నప్పుడు ముందున్న రహదారి స్పష్టంగా కనిపించడం చాలా ముఖ్యం. ఇందుకోసం హైడ్రోఫోబిక్‌ విండ్‌షీల్డ్‌ స్ప్రే ఉపయోగపడుతుంది. ఇది గాజుపై నీటిని వికర్షించే పలుచని పొరను ఏర్పరుస్తుంది. దీంతో వర్షపు నీటి బిందువులు గాజుపై నిలవకుండా వెంటనే జారిపోతాయి. వైపర్‌ పనితీరుపైనా ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రివేళ డ్రైవింగ్‌లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

వైపర్‌ బ్లేడ్ల విషయంలోనూ జాగ్రత్త అవసరం. సిలికాన్‌ లేదా ఏరోట్విన్‌ వైపర్‌ బ్లేడ్లు, విండ్‌షీల్డ్‌పై పడిన వర్షపు నీటిని సమర్థంగా తొలగించడంలో సహాయపడతాయి. గాజుపై నీటి మరకలు, గీతలు మిగలకుండా చూస్తాయి. వైపర్‌ బ్లేడ్లను ఆరు నుంచి పన్నెండు నెలలకు ఒకసారి పరిశీలించడం మంచిది.

సైడ్‌ మిర్రర్లకు రెయిన్‌ గార్డులు అమర్చుకోవచ్చు. ఇవి అద్దాలపైకి నీరు చేరకుండా కొంతవరకు అడ్డుకుంటాయి. దీంతో, కారు వెనుక వైపు దృశ్యం మెరుగ్గా కనిపిస్తుంది. దట్టమైన వర్షం, పొగమంచు ఉన్న ప్రాంతాల్లో సరైన లైటింగ్‌ కూడా అవసరం. వాహనానికి అనుకూలమైన LED ఫాగ్‌ లైట్లు ఉపయోగపడవచ్చు.

ఇది కూడా చదవండి: తక్కువ జీతం ఉన్నవారికి బెస్ట్ కార్లు ఇవే.. వీటిపై EMI చాలా తక్కువ

కారు లోపల తేమకు చెక్‌

వర్షాకాలంలో తడి బూట్లు, బురదతో కారు లోపలి భాగం త్వరగా మురికిగా మారుతుంది. కార్పెట్‌లో నీరు చేరితే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి 7డీ ఫ్లోర్‌ మ్యాట్లు లేదా ఆల్‌ వెదర్‌ మ్యాట్లు ఉపయోగపడతాయి. ఇవి నీరు, బురదను ఒకే చోట నిల్వ ఉంచి కార్పెట్‌ను రక్షిస్తాయి. వీటి ధర సాధారణంగా రూ.2,500 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది.

కారులో తేమ ఎక్కువగా ఉంటే అద్దాలకు పొగమంచు పట్టే అవకాశం ఉంది. చిన్న డీహ్యూమిడిఫైయర్‌ తేమను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటి ధర సుమారు రూ.500 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది. తడి పరిస్థితుల్లో పాదాలు జారకుండా రబ్బరు పెడల్‌ కవర్లు కూడా ఉపయోగపడతాయి.

అత్యవసర సమయంలో ఇవి ఉపయోగకరం

వర్షాకాలంలో టైర్ల పరిస్థితి కీలకం. సరైన PSI లేకపోతే రహదారిపై టైర్‌ గ్రిప్‌ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పోర్టబుల్‌ టైర్‌ ఇన్‌ఫ్లేటర్‌ను కారులో ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు టైర్‌లో గాలి నింపుకోవచ్చు. వీటి ధర సుమారు రూ.1,500 నుంచి రూ.4,500 వరకు ఉంటుంది.

వాటర్‌ప్రూఫ్‌ కార్‌ కవర్‌ మీ వాహనాన్ని తేమ నుంచి రక్షిస్తుంది. మైక్రోఫైబర్‌ క్లాత్‌ కూడా కారులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. తడి గాజు, డాష్‌బోర్డ్‌ను వెంటనే శుభ్రం చేసుకోవచ్చు.

సైడ్‌ మిర్రర్‌ గార్డుల ధర రూ.200 నుంచి రూ.800 వరకు ఉంటుంది. సిలికాన్‌ వైపర్‌ బ్లేడ్ల ధర సుమారు రూ.500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. ఖర్చు తక్కువే అయినా వర్షాకాలంలో ఇవి మంచి ఉపయోగాన్ని అందిస్తాయి.

ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యంత చవకైన సెడాన్ కారు Tata Tigor తక్కువ ధరకే.. రూ.30000 డిస్కౌంట్

అయితే, యాక్సెసరీస్‌ ఉన్నాయి కదాని కారు ప్రాథమిక భద్రతను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బ్రేక్‌లు, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో పరిశీలించాలి. టైర్లలో గాలి ఒత్తిడిని తరచూ చెక్‌ చేయాలి. వైపర్‌ బ్లేడ్లు గాజును సరిగ్గా శుభ్రం చేస్తున్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా, హైవేలపై తరచుగా ప్రయాణించేవాళ్లు వర్షాలకు తగ్గట్లుగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. చిన్న ఖర్చుతో కారును అన్ని విధాలా సిద్ధం చేసుకుంటే, వర్షంలో డ్రైవింగ్‌ సమయంలో అనవసరమైన ఇబ్బందులు దరిచేరవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో
సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!
టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం రూ.4.5 లక్షలే.. సింగిల్‌ ఛార్జ్‌తో 320km!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget