అన్వేషించండి

టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV

హ్యుందాయ్ భారత మార్కెట్లో చౌక కాంపాక్ట్ EVను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్‌కు పోటీగా రానున్న ఈ కారు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ భారత మార్కెట్లోకి చౌకైన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఈవీతో వస్తుంది.
  • 2026 చివరకు 355 కి.మీ. రేంజ్‌తో ఈ కారు విడుదలవుతుంది.
  • ఆధునిక ఫీచర్లు, రెండు బ్యాటరీ ఆప్షన్లతో బడ్జెట్ ఈవీ పోటీ పెరుగుతుంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో EV వాహనాలు నగరాల్లో మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఈ వాహనాలు కనిపిస్తున్నాయి. దాంతో కంపెనీలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తమ సత్తా చాటుతున్నాయి. ఇప్పటికీ EV వాహనాలు చాలా ఖరీదుగా ఉన్నాయి. కానీ బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్‌కి చెందిన టియాగో ఈవీ, ఎంజీ మోటార్స్‌ (MG Motors)కి చెందిన కామెట్ ఈవీ వంటి వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 

ఈ బడ్జెట్ EV స్పేస్‌లో సంచలనం సృష్టించడానికి దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ సిద్ధంగా ఉంది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన, ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి హ్యుందాయ్ ఏర్పాట్లు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టియాగో ఈవీ, కామెట్ వంటి వాహనాలకు పోటీ పెరుగుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో ఎప్పుడు రానుంది, దీని ఫీచర్లు ఇక్కడ తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ మాస్టర్‌ప్లాన్ 

మొదట హ్యుందాయ్ తన ఈ బడ్జెట్ EVను 2027 ప్రారంభంలో పరిచయం చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కంపెనీ వినియోగదారులను గుడ్ న్యూస్ చెబుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు 2026 చివరి నాటికే భారత మార్కెట్లో లాంచ్ కానుంది. భారత్‌లో తన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వాటాను పెంచడమే కంపెనీ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం దేశీయ స్థాయిలో లోకల్ బ్యాటరీ సప్లై చైన్‌ను బలోపేతం చేస్తున్నారు.

350+ KM తో అద్భుతమైన రేంజ్

హ్యుందాయ్ తన ఈ కొత్త కాంపాక్ట్ EVను రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లతో లాంచ్ చేయనుంది. ఇందులో వినియోగదారులకు ఒక స్టాండర్డ్ రేంజ్, మరోటి లాంగ్ రేంజ్ ఆప్షన్ లభిస్తుంది. దీని లాంగ్-రేంజ్ వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 355 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ రేంజ్ లభిస్తే, ఈ కారు నగరంలోని రోజువారీ ప్రయాణాలకే కాదు, వీకెండ్‌లో సమీపంలోని స్పాట్ లకు సైతం నమ్మకమైన, టెన్షన్-ఫ్రీ ఎంపికగా నిలుస్తుంది.

ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్

ఇక హ్యుందాయ్ తన వాహనాల్లో ఎప్పటినుంచో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇస్తోంది. ఈ కాంపాక్ట్ కారులో తన నెక్స్ట్-జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనిపిస్తుందని కంపెనీ స్పష్టంచేసింది. కేబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మోడ్రన్ ఫీచర్లు ఇవ్వవచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇందులో అనేక ఎయిర్‌బ్యాగ్స్, ABS, పార్కింగ్ కెమెరాల సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది.

మార్కెట్లో పోటీ పెరుగుతుంది

ప్రస్తుతం ఆటో సెక్టార్‌లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ కనిపిస్తోంది. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే పట్టు సాధించాయి. హ్యుందాయ్ తన శక్తివంతమైన పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, తక్కువ ధరతో కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తే కనుక విక్రయాల్లో తిరుగుండదు. మీరు కూడా కొత్త, తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, కొంతకాలం వేచి చూడక తప్పదు. 

Frequently Asked Questions

హ్యుందాయ్ తన బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును ఎప్పుడు విడుదల చేయనుంది?

మొదట 2027 ప్రారంభంలో అనుకున్నా, తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు 2026 చివరి నాటికే భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఈవీ లాంగ్-రేంజ్ వేరియంట్ ఎంత దూరం ప్రయాణించగలదు?

హ్యుందాయ్ కాంపాక్ట్ ఈవీ యొక్క లాంగ్-రేంజ్ వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 355 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది రోజువారీ ప్రయాణాలకు, వీకెండ్ ట్రిప్స్‌కు అనుకూలంగా ఉంటుంది.

హ్యుందాయ్ రాబోయే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారులో ఏ ఫీచర్లు ఉండనున్నాయి?

ఇందులో నెక్స్ట్-జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ వంటివి ఉండవచ్చు. భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్స్, ABS, పార్కింగ్ కెమెరాలు లభిస్తాయి.

హ్యుందాయ్ బడ్జెట్ ఈవీ ఏ వాహనాలకు పోటీ ఇవ్వనుంది?

ఈ కొత్త ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ వంటి బడ్జెట్ సెగ్మెంట్ వాహనాలకు పోటీ ఇవ్వనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget