అన్వేషించండి

Most Cheapest Sedan: భారత్‌లో అత్యంత చవకైన సెడాన్ కారు Tata Tigor తక్కువ ధరకే.. రూ.30000 డిస్కౌంట్

Tata Tigor భారత్‌లో అతి తక్కువ ధర కలిగిన సెడాన్ కారు. వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దీనిపై రూ.30 వేల వరకు బెనిఫిట్ అందిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టిగోర్‌పై సెప్టెంబర్‌లో నగదు, స్క్రాపేజ్ బోనస్ లభిస్తోంది.
  • ఈ ఆఫర్‌లు కలిపి రూ. 30,000 వరకు ప్రయోజనం అందిస్తాయి.
  • తక్కువ ధర సెడాన్ టిగోర్ పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీలో అందుబాటు.
  • కొత్త ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లున్నాయి.

తక్కువ బడ్జెట్‌లో సెడాన్ కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే Tata Tigor పై సెప్టెంబర్ నెలలో లభించే డిస్కౌంట్ మీకు కలిసిరావొచ్చు. టాటా మోటార్స్ సెప్టెంబర్ 2026లో టాటా టిగోర్‌పై రూ. 30,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్ లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ప్రయోజనాన్ని పొందే ముందు మీకు దగ్గర్లోని డీలర్‌ను కలిపి ఆఫర్, కండీషన్లను తెలుసుకోవడం మంచిది. 

Tata Tigor పై కస్టమర్లకు మొత్తంగా రూ. 30,000 వరకు ఆదా అవుతుంది. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బోనస్ కింద రూ. 15,000 ఇస్తున్నారు. అంటే కస్టమర్ తన పాత వాహనాన్ని స్క్రాప్ చేయడానికి అర్హత కలిగి ఉంటే, ఈ స్క్రాపేజ్ బోనస్ వారు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ సిటీ, డీలర్, స్టాక్, కారు వేరియంట్‌ను బట్టి మారవచ్చు.

టాటా టిగోర్ కారు ధర ఎంత?

హైదరాబాద్‌లో Tata Tigor ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.68 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.84 లక్షల వరకు ఉంటుంది. ఈ కారణంగా భారత్‌లో అత్యంత చవకైన కాంపాక్ట్ సెడాన్లలో ఒకటిగా నిలిచింది. డిస్కౌంట్ తర్వాత, తక్కువ బడ్జెట్‌లో సెడాన్ కావాలనుకునే కస్టమర్లను టాటా టిగోర్ ఆకర్షించనుంది. తన సెగ్మెంట్‌లో Tigor ప్రధానంగా Maruti Suzuki Dzireతో పాటు Hyundai Aura వంటి కార్లకు పోటీ ఇస్తుంది. 

Tata Tigor ప్రత్యేకత ఏమిటంటే దీనిని విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కొనవచ్చు. ఇందులో పెట్రోల్, iCNG మోడళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా Tigor ఎలక్ట్రిక్ వెర్షన్ సైతం లభిస్తుంది. 2025 మోడల్ Tigor లో కంపెనీ ఎక్స్‌టీరియర్‌ను కొంత అప్‌డేట్ చేసింది. ఇందులో గ్రిల్, ఫ్రంట్ బంపర్ డిజైన్‌లో చిన్నపాటి మార్పులు చేశారు. కొన్ని వేరియంట్లలో బూట్‌లిడ్ స్పాయిలర్ లభిస్తుంది. కారులో వచ్చే అల్లాయ్ వీల్స్ ప్రైమరీ డిజైన్ గతంలోలాగే ఉన్నప్పటికీ, హైపర్‌స్టైల్ వీల్ లుక్‌లో కొన్ని మార్పులు చేశారు.

కారు ఇంటీరియర్, ఫీచర్లు
కొత్త Tigor లో ఇంటీరియర్‌ను అప్‌డేట్ చేశారు. ఇందులో కొత్త ఇంటీరియర్ థీమ్, ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, టాప్ వేరియంట్లలో డ్యూయల్-టోన్ లెదర్ ఫినిషింగ్ లభిస్తుంది. కొన్ని వేరియంట్లలో 3.5 ఇంచుల మ్యూజిక్ సిస్టమ్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్ ఫీచర్లు ఇచ్చారు. 

కారు టాప్ వేరియంట్‌లో 10.25-ఇంచుల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు Tigor XZ లో LED హెడ్‌ల్యాంప్స్‌తో పాటు DRLలు, 15 ఇంచుల హైపర్‌స్టైల్ వీల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ ఇచ్చారు. ఇందులో 7 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు Android Auto, Apple CarPlay లభిస్తుంది.

Tigor EV.. ఇందులో 75hp ఎలక్ట్రిక్ మోటార్, 26kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. కంపెనీ క్లెయిమ్ ప్రకారం దీని రేంజ్ సుమారు 315 కిలోమీటర్లుగా పేర్కొంది. ఇందులో BaaS వంటి సౌకర్యాన్ని తెస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి

సెప్టెంబర్ నెలలో రూ. 30,000 వరకు ప్రయోజనం ఉన్నప్పటికీ, ప్రతి కస్టమర్‌కూ ఒకే రకమైన బెనిఫిట్ లభించదని గుర్తుంచుకోవాలి. క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బోనస్ అర్హతలు వేర్వేరుగా ఉండవచ్చు. అలాగే మీ సిటీ, డీలర్ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఆఫర్‌లో మార్పులు జరగనున్నాయి. కారు బుక్ చేసుకునే ముందు డీలర్ నుంచి డిస్కౌంట్, వేరియంట్, అన్ని నిబంధనల సమాచారాన్ని తెలుసుకోవాలి.

 

Frequently Asked Questions

టాటా టిగోర్ కారుపై సెప్టెంబర్ నెలలో ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?

సెప్టెంబర్ నెలలో టాటా టిగోర్ కారుపై రూ. 30,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.

టాటా టిగోర్ కారు ధర హైదరాబాద్‌లో ఎంత?

హైదరాబాద్‌లో టాటా టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.68 లక్షల నుంచి రూ. 8.84 లక్షల వరకు ఉంటుంది. ఇది భారత్‌లో అత్యంత చవకైన కాంపాక్ట్ సెడాన్లలో ఒకటి.

టాటా టిగోర్ ఏ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది?

టాటా టిగోర్ పెట్రోల్, iCNG, అలాగే ఎలక్ట్రిక్ వెర్షన్ (Tigor EV) ఆప్షన్లలో లభిస్తుంది.

కొత్త 2025 మోడల్ టాటా టిగోర్‌లో ఏ మార్పులు చేశారు?

2025 మోడల్ టిగోర్‌లో గ్రిల్, బంపర్ డిజైన్, బూట్‌లిడ్ స్పాయిలర్, హైపర్‌స్టైల్ వీల్స్ వంటి ఎక్స్‌టీరియర్ మార్పులు ఉన్నాయి. ఇంటీరియర్‌లో కొత్త థీమ్, ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ లెదర్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget