సెప్టెంబర్ నెల ఆఫర్ల కింద, Maruti Alto K10 కారుపై కస్టమర్లు గరిష్టంగా రూ. 62,500 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఈ పూర్తి ప్రయోజనం అందరికీ వర్తించదు.
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
Maruti Alto K10 on Discount | ఆల్టో కే10లో వచ్చే 1.0 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ సిటీలో రోజువారీ వాడకానికి సెట్ అవుతుంది. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇస్తుంది. తాజాగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.

- మారుతి ఆల్టో K10పై సెప్టెంబర్‌లో రూ.62,500 వరకు డిస్కౌంట్.
- పెట్రోల్-MT LXI వేరియంట్‌పై అధిక డిస్కౌంట్లు, బోనస్‌లు అందిస్తున్నారు.
- ఇతర వేరియంట్లపై రూ.42,500 వరకు, నిర్దిష్ట షరతులు వర్తిస్తాయి.
Maruti Alto K10 on Discount More than Rupees 60000 all details here
తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనాలని చూస్తున్నట్లు అయితే Maruti Alto K10 మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. సెప్టెంబర్ 2026లో మారుతి కంపెనీ పలు కార్లపై డిస్కౌంట్లు, బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ క్రమంలోనే Alto K10పై కస్టమర్లకు భారీ పొదుపు చేసుకునే అవకాశం లభిస్తోంది. కంపెనీ సెప్టెంబర్ ఆఫర్ కింద ఈ కారుపై రూ.62,500 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఈ పూర్తి బెనిఫిట్స్ ప్రతీ కస్టమర్‌కూ లభించదు. డిస్కౌంట్లలోని కొంత భాగం ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, ఇతర అంశాలతో ముడిపడి ఉంది.
ఏ వేరియంట్‌పై డిస్కౌంట్ ఎంత
సెప్టెంబర్ నెల ఆఫర్లో Maruti Alto K10 పెట్రోల్-MT LXI వేరియంట్‌పై అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ మోడల్‌పై కస్టమర్లకు మొత్తంగా అరవై రెండు వేల ఐదు వందల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో కేవలం క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, పలు రకాల ఆఫర్లు, బోనస్‌లను కలిపి పూర్తి బెనిఫిట్ అవుతుంది.
ఈ వేరియంట్‌పై మొదటగా 35,000 రూపాయల కన్స్యూమర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇందులో రూ. 10,000 స్పాట్ ఆఫర్, రూ. 25,000 RIPS ఆఫర్ కలిసి ఉన్నాయి. వీటితో పాటు 10,000 రూపాయలు PCM బోనస్ లభిస్తోంది.
కస్టమర్ తన పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బదులు స్క్రాపేజ్ ఆప్షన్ ఎంచుకుంటే 10,000 రూపాయలు స్క్రాపేజ్ బోనస్ ఇస్తారు. వీటితో పాటు రూ.2,500 ఇన్స్టిట్యూషనల్ ఆఫర్, రూ.2,100 రూరల్ ఆఫర్ సైతం ఉన్నాయి.
ఇతర వేరియంట్లపైనా డిస్కౌంట్
Maruti Alto K10 అన్ని మోడళ్లపై ఒకే రకమైన ఆఫర్ లభించడం లేదు. దీని STD, CNG వేరియంట్లపై మొత్తం 37,500 వరకు ఆదా కావచ్చు. మిగిలిన పెట్రోల్ వేరియంట్లపై మొత్తం 42,500 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కారు కొనేముందు మీకు నచ్చిన వేరియంట్‌పై ఆఫర్ ఎంత వర్తిస్తుందని తెలుసుకున్నాకే కొనాలి. ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ రెండూ ఒకేసారి లభించవు. కస్టమర్ తన పరిస్థితికి తగినట్లుగా ఏదో ఒక ఆఫర్ బెనిఫిట్ పొందుతారు. అలాగే ఇన్స్టిట్యూషనల్, స్పెషల్ ఆఫర్లు అందరు కస్టమర్లకు వర్తించవు.
Maruti Suzuki Alto K10ని కంపెనీ ఒక బడ్జెట్ కారుగా విక్రయాలు చేస్తోంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹3.70 లక్షలుగా ఉంది. మొదటిసారి కారు కొంటున్న లేదా తక్కువ బడ్జెట్లో చిన్న కారు కోరుకునే కస్టమర్లకు ఇది సెట్ అవుతుంది. కస్టమర్ RTO, ఇన్సూరెన్స్, టాక్స్, ఇతర ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో మీకు కారు ఆన్-రోడ్ ధర ఎంతో తెలుస్తుంది. కొనేటప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించాలి.
ఆల్టో కే10 పవర్‌ట్రెయిన్, మైలేజ్
మారుతి Alto K10లో 1.0 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఈ కారును మ్యాన్యువల్, AGS ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కొనవచ్చు. Alto K10 అతిపెద్ద ఫీచర్లలో దీని మైలేజ్ ఒకటి. పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 24.39 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్లో మైలేజీ తక్కువగా ఉంటుంది. Alto K10 CNG వేరియంట్ కేజీకి సుమారు 33.85 km వరకు మైలేజ్ ఇస్తుంది. ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి CNG మోడల్ సహాయపడుతుంది.
Alto K10 ప్రస్తుత మోడల్‌ను పాత మోడల్‌తో పోలిస్తే మరింత మోడ్రన్ డిజైన్‌తో రూపొందించారు. కారు ముందు వైపు కొత్త గ్రిల్, షార్ప్ డిజైన్ ఉన్న హెడ్లైట్లు ఇచ్చారు. దీనివల్ల కారు ఫ్రంట్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాంపాక్ట్ షేప్ వల్ల సిటీలోని ఇరుకైన రోడ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నడపడం ఈజీగా ఉంటుంది.
కారు ఇంటీరియర్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇచ్చారు. ఇందులో Apple CarPlay, Android Autoకి సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. దాంతో కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను కారుతో కనెక్ట్ చేసి మ్యూజిక్, కాల్స్, ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. కారులో పవర్ విండోస్, మెరుగైన డాష్‌బోర్డ్ లేఅవుట్ లభిస్తాయి.
Frequently Asked Questions
మారుతి ఆల్టో K10 కారుపై సెప్టెంబర్ నెలలో ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?
ఏ Maruti Alto K10 వేరియంట్‌పై అత్యధిక డిస్కౌంట్ ఉంది?
సెప్టెంబర్ నెలలో Maruti Alto K10 పెట్రోల్-MT LXI వేరియంట్‌పై అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ మోడల్‌పై కస్టమర్లు రూ. 62,500 వరకు ఆదా చేసుకోవచ్చు.
Maruti Alto K10 మైలేజ్ ఎంత?
పెట్రోల్ వేరియంట్ దాదాపు 24.39 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ అయితే కేజీకి సుమారు 33.85 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది.
Maruti Alto K10 ఏ కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది?
తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనాలనుకునే వారికి, లేదా మొదటిసారి కారు కొనే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని కాంపాక్ట్ షేప్ సిటీలో డ్రైవింగ్ చేయడానికి సులభం.
ట్రెండింగ్ వార్తలు






















