(Source: ECI/ABP News/ABP Majha)
MG ZS EV: తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో లాంచ్ చేయనున్న ప్రముఖ బ్రాండ్!
ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ త్వరలో మనదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
ఎంజీ మోటర్ తన కొత్త ఉత్పత్తిని ప్రకటించింది. జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లోపే కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్నట్లు ఎంజీ మోటర్ అధికారికంగా ప్రకటించింది. దీని ధర రూ.10 నుంచి రూ.15 లక్షల మధ్యలో ఉండనుంది.
గ్లోబల్ ప్లాట్‌ఫాం మీద బేస్ అయిన వాహనాన్ని భారతదేశం కోసం లోకలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరలో అందిస్తూ లోకలైజ్ చేయడం ముఖ్యం. ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వాటి బ్యాటరీలు, ఇతర భాగాలు కాస్త ఖరీదైనవి. లోకలైజ్ చేయడం ద్వారా వీటి ధర తగ్గుతుంది.
దీని బ్యాటరీ, మోటర్, ఇతర భాగాలను ఎంజీ లోకలైజ్ చేయడం ద్వారా ప్రజలకు పెద్దఎత్తున దగ్గర కావాలని చూస్తుంది. మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఇందులో ఉండే చార్జింగ్ నెట్‌వర్క్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయాలి. దీంతోపాటు హోమ్/ఆఫీస్ చార్జింగ్‌కు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఇందులో ఉండనున్నాయి.
రేంజ్ డిజైన్, ఇతర విషయాలను కూడా భారతదేశ మార్కెట్‌కు తగ్గట్లు దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ ధరలో ఉన్న జెడ్ఎస్‌నే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.
ఇదే కారు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తే సేల్స్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనదేశంలో తక్కువ ధరలోనే ఈ కార్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఎంజీ కూడా మనదేశంలో కార్ల మార్కెట్‌పై దృష్టి పెట్టనుందని అర్థం చేసుకోవచ్చు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?