గ్రాండ్ SUV లెవెల్ ఫీచర్లు, 5-స్టార్ సేఫ్టీతో Maruti Victoris లాంచ్ - ఎట్టకేలకు రేట్లు ప్రకటన
Maruti Victoris Launched: ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, 6 వేరియంట్లలో లాంచ్ అయింది. పవర్ హైబ్రిడ్, CNG ఆప్షన్లు ఉన్నాయి. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించింది.

Maruti Victoris Price, Range And Features In Telugu: చాలా కాలం ఎదురు చూపుల తర్వాత, Maruti Suzuki, తన కొత్త కాంపాక్ట్ SUV "విక్టోరిస్" ను లాంచ్ చేసింది. ఎక్స్-షోరూమ్ ధరను రూ. 10.50 లక్షలు నుంచి ప్రారంభించింది. టాప్ వేరియంట్ ZXi Plus (O) eCVT ధర రూ. 19.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ అమేజింగ్ కారును Arena డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తోంది. విక్టోరిస్‌లో మొత్తం 6 వేరియంట్లు లభ్యమవుతున్నాయి, అవి: LXi, VXi, ZXi, ZXi (O), ZXi Plus, ZXi Plus (O).
ధరలు (ఎక్స్-షోరూమ్)
1.5 లీటర్ litre మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ రేట్లు రూ. 10.50 లక్షలు నుంచి రూ. 19.22 లక్షల వరకు ఉన్నాయి.
1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ రేట్లు రూ. 16.38 లక్షలు నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉన్నాయి.
1.5 లీటర్ పెట్రోల్ + CNG ఇంజిన్ రేట్లు రూ. 11.50 లక్షలు నుంచి రూ. 14.57 లక్షల వరకు ఉన్నాయి.
బాహ్య రూపం
Victoris ముందు భాగం LED DRLs, స్లీక్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లతో తో హైలైట్ అవుతుంది. బ్లాంక్ చేసిన గ్రిల్, రగ్గ్‌డ్ స్కిడ్ ప్లేట్‌తో క్లాస్ & మాస్ లుక్స్ ఇస్తోంది. 17-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్స్, బ్లాక్ క్లాడింగ్, సిల్వర్ రూఫ్ రైల్స్‌తో కంప్లీట్ ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తోంది. కారు వెనుక భాగంలో స్లీక్ LED లైట్ బార్, స్లాష్డ్ LED ఎలిమెంట్స్, & స్కిడ్ ప్లేట్ ఆకర్షణను పెంచుతున్నాయి.
ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్లు
ఇంటీరియర్‌లో, వేరియంట్‌ను బట్టి రెండు రకాల డిజైన్‌లు ఉన్నాయి: పెట్రోల్ వర్షన్‌లో డ్యుల్-టోన్ బ్లాక్-ఆఫ్‌వైట్ ఇచ్చారు. స్ట్రాంగ్-హైబ్రిడ్ వర్షన్ ఆల్-బ్లాక్ ఛాంపైన్ ఇన్‌సర్ట్స్‌తో వస్తుంది. మృదువైన మెటీరియల్స్ & 64-కలర్ ఆంబియంట్ లైటింగ్ వంటివి ప్రీమియం ఫీల్ ఇస్తాయి.
టాప్ టెక్నాలజీ ఫీచర్లు:
10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD)
వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ AC, రియర్ AC వెంట్స్
పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్ (8-వే), పవర్డ్ టెయిల్‌గేట్
సేఫ్టీ & కంఫర్ట్
Victoris అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ముందు-వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల కెమెరా, లెవెల్-2 ADAS సూట్ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉన్నాయి. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇచ్చారు. ఈ కారు, Bharat NCAP & Global NCAP రెండింటిలో కూడా 5-స్టార్ రేటింగ్ సాధించింది.
మారుతి సరికొత్త ఫీచర్
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం - "CNG వెర్షన్లు అండర్ బాడీ CNG ట్యాంక్"తో వస్తాయి, దీనివల్ల బూట్ స్పేస్ ఏమాత్రం తగ్గదు.
పోటీ కార్లు
Maruti Victoris ప్రధానంగా Compact SUV సెగ్మెంట్‌లో పోటీ పడుతుంది. Hyundai Creta, Kia Seltos, Honda Elevate, MG Astor, VW Taigun, Skoda Kushaq వంటివి దీని పోటీ కార్లు. సేఫ్టీ & ఫీచర్స్ ఆధారంగా Victoris బలంగా నిలుస్తుందని ఊహించవచ్చు.





















