అన్వేషించండి

కేవలం రూ.10,000 EMIతో మీరు Tata Punch EV ఓనర్‌ కాగలరు, డౌన్ పేమెంట్‌ వివరాలు తెలుసుకోండి

Tata Punch EV EMI Options: పంచ్ EVని పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది. ఇది గరిష్టంగా 140 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.

Tata Punch EV Price, Down Payment, Car Loan and EMI: కొత్త ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ చాలా చురుగ్గా మంచి పని చేస్తోంది, మార్కెట్‌ మూడ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు లాంచ్‌ చేస్తోంది. బిల్డ్‌ క్వాలిటీలో భేష్‌ అనిపించుకున్న టాటా బ్రాండ్‌ నుంచి వచ్చిన బెస్ట్‌ ఎలక్ట్రిక్ కారు "టాటా పంచ్‌ EV". ఈ కారు మోడ్రన్‌ ఫీచర్లను అందించడమే కాదు, ధర పరంగానూ కస్టమర్‌ను ఇబ్బంది పెట్టదు.

టాటా పంచ్ EV కొత్త లుక్‌ చాలా స్టైలిష్‌గా, మోడర్న్‌గా ఆకర్షిస్తోంది. ముందు భాగంలో ఇచ్చిన LED హెడ్‌ల్యాంప్స్‌ & క్లోజ్డ్‌ గ్రిల్‌ డిజైన్‌ ఈ ఎలక్ట్రిక్‌ కారుకు ఫ్యూచరిస్టిక్‌ ఫీల్‌ను ఇస్తుంది. సైడ్‌ ప్రొఫైల్‌లో ఉన్న షార్ప్‌ లైన్స్‌ SUV తరహా స్టాన్స్‌ను కలిగిస్తున్నాయి. వెనుక భాగంలో స్లీక్‌ టెయిల్‌ల్యాంప్స్‌ & స్పోర్టీ బంపర్‌ డిజైన్‌ పంచ్ EV కి అదనపు ఆకర్షణ తీసుకొస్తున్నాయి.

టాటా పంచ్ ఈవీ ఆన్‌-రోడ్‌ ప్రైస్‌
తెలుగు రాష్ట్రాల్లో, టాటా పంచ్‌ ఈవీ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ . 9.99 లక్షలు (Tata Punch ex-showroom price, Hyderabad Vijayawada) మాత్రమే. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 2,000 (ఎలక్ట్రిక్‌ కారు కాబట్టి నామమాత్రపు రుసుము), బీమా కోసం దాదాపు రూ. 48,000, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుంటే, ఈ కారును దాదాపు రూ. 10.50 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు (Tata Punch on-road price, Hyderabad) కొనుగోలు చేయవచ్చు. విజయవాడ (Tata Punch on-road price, Vijayawada) సహా ఇతర తెలుగు నగరాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంటుంది. 

హైదరాబాద్‌లో టాటా పంచ్‌ ఈవీ కొనడానికి మీరు రూ. 4 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రూ. 6.50 లక్షలను బ్యాంకు నుంచి కారు లోన్‌గా తీసుకోవాలి. మీరు ఈ మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. 

నెలకు రూ. 10,124 EMI చొప్పున చెల్లిస్తే, మీ మొత్తం కారు లోన్‌ 7 సంవత్సరాల్లో తీరిపోతుంది.

నెలకు రూ. 11,389 EMI చొప్పున కడితే, మీ మొత్తం కారు లోన్‌ 6 సంవత్సరాల్లో క్లోజ్‌ అవుతుంది.

నెలకు రూ. 13,171 EMI చొప్పున డిపాజిట్‌ చేస్తే, మీ మొత్తం కారు లోన్‌ 5 సంవత్సరాల్లో మాఫీ అవుతుంది.

నెలకు రూ. 15,858 EMI చొప్పున చెల్లిస్తే, మీ మొత్తం కారు లోన్‌ను 4 సంవత్సరాల్లో తీర్చేయవచ్చు.

టాటా పంచ్ ఈవీ ఫీచర్లు & ఇంజిన్
టాటా మోటార్స్, పంచ్ EV పవర్‌ కోసం 25 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను AC ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు & DC ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది .

పూర్తిగా ఛార్జ్ చేస్తే, పంచ్ EV 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని టాటా మోటార్స్ వెల్లడించింది. అలాగే, ఇది గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో బాణంలా దూసుకెళ్తుంది. కంపెనీ ప్రకారం, పంచ్ EV 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి 9.5 సెకన్లు పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget