Upcomong SUVs: మారుతి, మహీంద్రా, టాటా నుంచి కొత్త మిడ్‌సైజ్ SUVలు - వచ్చే 6 నెలల్లో లాంచ్
Upcomong SUVs 2025: మారుతి సుజుకి విక్టోరిస్, e విటారా, మహీంద్రా నుంచి XUV700 ఫేస్‌లిఫ్ట్, టాటా నుంచి సియెరా EV వచ్చే 6 నెలల్లో రానున్న 4 కొత్త మిడ్‌సైజ్ SUVలు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

4 New Midsize SUVs Launching 2025: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్ రోజు రోజుకూ హాట్‌గా మారుతోంది. కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ పెద్ద కంపెనీలు కొత్త మోడల్స్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే 6 నెలల్లో నాలుగు కొత్త మిడ్‌సైజ్ SUVలు మన మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి. వీటిలో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉండటంతో, SUV లవర్స్‌కు మంచి ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
1. Maruti Suzuki Victoris
మారుతి సుజుకి నుంచి వస్తున్న విక్టోరిస్ ఇప్పటికే హడావుడి సృష్టించింది. షోరూమ్‌లలో త్వరలోనే కనిపించబోతోంది. ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు ₹9.75 లక్షల నుంచి మొదలై ₹20 లక్షల ఉండే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. లెవెల్ 2 ADAS, గెస్టర్ కంట్రోల్ టెయిల్‌గేట్, డ్యూయల్ పానొరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ లాంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
2. Maruti Suzuki e Vitara
మారుతి నుంచి రాబోయే మరో బిగ్ హిట్ ఇ విటారా. ఇప్పటికే గుజరాత్‌లో ప్రొడక్షన్ మొదలైంది. త్వరలోనే, తెలుగు రాష్ట్రాలు సహా భారతదేశ వ్యాప్తంగా సేల్స్ స్టార్ట్ అవుతాయి. రెండు బ్యాటరీ ఆప్షన్లలో రానున్న ఈ SUV, సింగిల్ ఛార్జ్‌తో 500 km పైగా రేంజ్ ఇస్తుందని అంచనా. ఫీచర్ల విషయానికొస్తే, ప్రీమియం SUV లకు పోటీ ఇచ్చేలా అన్ని మోడ్రన్ టెక్నాలజీలు ఇందులో ఉంటాయి.
3. Mahindra XUV700 Facelift
మహీంద్రా ఫేమస్ మోడల్ XUV700 కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రెడీ చేస్తోంది. 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే ఈ అప్‌డేట్‌లో ఎక్స్‌టీరియర్‌లో స్టైలింగ్ మార్పులు, ఇంటీరియర్‌లో కొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉంటాయి. అయితే ఇంజిన్ మాత్రం ప్రస్తుత మోడల్‌లో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్‌నే కొనసాగిస్తుంది.
4. New Tata Sierra EV
టాటా మోటార్స్ లెజెండరీ SUV సియెరా మళ్లీ రాబోతోంది. ఈసారి ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ అవ్వనుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో రెండు బ్యాటరీ ఆప్షన్లు, 500 km పైగా రేంజ్ వంటివి స్పెషల్ హైలైట్స్ అవుతాయి. ఆ తర్వాత, 2026లో ICE వెర్షన్ కూడా రావచ్చు.
దీనిని బట్టి, SUV ప్రేమికుల కోసం వచ్చే ఆరు నెలల్లో 4 కిర్రాక్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఫ్యూచరిస్టిక్ హైబ్రిడ్ SUV కావాలంటే మారుతి విక్టోరిస్
ప్యూర్ ఎలక్ట్రిక్ SUV కోసం మారుతి ఇ విటారా
పెద్ద SUVలో కంఫర్ట్ & టెక్నాలజీ అప్‌డేట్స్ కోసం మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్
స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV కావాలంటే టాటా సియెరా EV
హైబ్రిడ్, ఎలక్ట్రిక్, పెట్రోల్ - ఇలా అన్ని రకాల SUV కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ నాలుగు మోడల్స్ రెడీ అవుతున్నాయి. SUV లవర్స్‌కి నెక్ట్స్ లెవెల్ ఎక్సైట్‌మెంట్ ఖాయంగా కనిపిస్తోంది!.





















