Maruti Swift On Road Price: మారుతి స్విఫ్ట్ కొనుగోలుపై రోడ్డు పన్ను, బీమా ఎంత చెల్లించాలి? పూర్తి ఆన్-రోడ్ లెక్క ఏంటి?
Maruti Swift insurance cost: మారుతి బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్ ఒకటి. కొత్త కారు రిజిస్ట్రేషన్ జరగాలంటే రోడ్డు పన్ను & బీమా తప్పనిసరిగా చెల్లించాలి.

Maruti Swift Price, Mileage And Features In Telugu: మారుతి సుజుకి స్విఫ్ట్, తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన కార్లలో ఒకటి. దేశవ్యాప్తంగానూ దీని సేల్స్ బాగున్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ 5-సీట్ల ఫ్యామిలీ కారు & మధ్య తరగతి కుటుంబాలకు సరైన ఎంపిక. చాలా మంది దీనిని వ్యక్తిగత ఉపయోగం కోసంతోపాటు టాక్సీగా ఉపయోగించడానికి కూడా కొనుగోలు చేస్తారు. మారుతి స్విఫ్ట్ కొనుగోలు చేసేటప్పుడు, ఎక్స్-షోరూమ్ ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. రోడ్డు పన్ను & బీమాను జోడించిన తర్వాత వాస్తవ ఆన్-రోడ్ ధర వస్తుంది.
మారుతి స్విఫ్ట్ LXi మోడల్
హైదరాబాద్‌లో మీరు మారుతి స్విఫ్ట్ LXi (పెట్రోల్) మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, దాని ఎక్స్-షోరూమ్ ధర 6,49,001 (Maruti Swift ex-showroom price, Hyderabad Vijayawada). దీనికి దాదాపు రూ. 93,000 రోడ్ ట్యాక్స్ (RTO), దాదాపు రూ. 31,200 ఇన్సూరెన్స్ & రూ. 800 ఇతర ఛార్జీలు కలపాలి. ఇవన్నీ కలిపితే, హైదరాబాద్‌లో మారుతి స్విఫ్ట్ LXi ఆన్-రోడ్ ధర సుమారు 7.74 లక్షలు (Maruti Swift on-road price, Hyderabad Vijayawada) అవుతుంది. విజయవాడలోనూ స్వల్ప మార్పులతో దాదాపు ఇదే ధర ఉంటుంది.
మారుతి స్విఫ్ట్ VXi AMT మోడల్
మీరు ఆటోమేటిక్‌ను ఇష్టపడితే, స్విఫ్ట్ VXi AMT (పెట్రోల్) మోడల్‌ను ఎంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,79,500. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తే, దాదాపు రూ. 1.11 లక్షల రోడ్డు పన్ను, దాదాపు రూ. 34,100 బీమా & రూ. 800 ఇతర ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కలిపిన తర్వాత, భాగ్యనగరంలో ఈ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 9.25 లక్షలు అవుతుంది. విజయవాడలోనూ దాదాపుగా ఇదే ధర ఉంటుంది.
మారుతి స్విఫ్ట్ VXi CNG మోడల్
మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే, స్విఫ్ట్ VXi CNG మోడల్ (మాన్యువల్ ట్రాన్స్మిషన్) మంచి ఎంపిక. దీని ఎక్స్-షోరూమ్ ధర 8,19,500. హైదరాబాద్‌లో, దీనికి దాదాపు రూ. 1.67 లక్షల రోడ్ ట్యాక్స్, దాదాపు రూ. 37,000 ఇన్సూరెన్స్ & రూ. 800 ఇతర ఖర్చులు చెల్లించాలి. ఈ ఖర్చులన్నీ కలిపి, హైదరాబాద్‌లో ఈ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారు 9.73 లక్షలు అవుతుంది. విజయవాడలోనూ స్వల్ప మార్పులతో దాదాపు ఇదే ధర ఉంటుంది.
ప్రతి రాష్ట్రంలో పన్ను & బీమా భిన్నం
తెలుగు రాష్ట్రాల్లో, ఏ బండి ఎక్స్-షోరూమ్ ధరైనా దాదాపుగా మారదు. అయితే, రోడ్డు పన్ను & బీమా ఛార్జీలు కొద్దిగా మారతాయి. దీనివల్ల, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో ఒకే మోడల్ ఆన్-రోడ్ ధర కొద్దిగా మారుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో రోడ్డు పన్ను & బీమా ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి, మీరు మారుతి స్విఫ్ట్ కొనడానికి ముందు, మీ సమీపంలోని మారుతి డీలర్‌షిప్ నుంచి సరైన సమాచారాన్ని పొందండి.
మీ బడ్జెట్‌కు ఏ మోడల్ సరిపోతుంది?
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, స్విఫ్ట్ LXi పెట్రోల్ అత్యంత చౌవకైన ఆప్షన్. ఆటోమేటిక్ కారు నడపాలనుకుంటే VXi AMT పెట్రోల్ ఎంచుకోవచ్చు. ఎక్కువ మైలేజ్ కోరుకుంటే VXi CNG మోడల్ దీర్ఘకాలంలో మెరుగ్గా ఉంటుంది.





















