ఈ దీపావళికి Maruti Swift ధర తగ్గింది - ఇప్పుడు కేవలం ₹5.79 లక్షలు, ఈ రేటులో ఇన్ని ఫీచర్లు ఎక్కడా దొరకవు!
Maruti Swift Diwali Offer: ఈ నెలలో మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కొంటే కంపెనీ ₹57,500 డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త జీఎస్టీతో రేటు ఇంకా తగ్గింది.

Maruti Swift Diwali 2025 Discount Offer: ఈ దీపావళికి మీరు మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, స్విఫ్ట్ గురించి ఓసారి ఆలోచించండి. ఇది "నెవ్వర్ బిఫోర్ - ఎవ్వర్ ఆఫ్టర్" ఆఫర్ కావచ్చు. ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్ మీద, ఈ నెల (అక్టోబర్ 2025)లో, కంపెనీ ₹57,500 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇంకా, GST 2025 ట్రిమ్మింగ్ కూడా ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ధరను మరింత తగ్గించింది.
ఆటోకార్ రిపోర్ట్ ప్రకారం, మారుతి స్విఫ్ట్ ZXi పెట్రోల్ MT, AMT & CNG మోడల్స్ గరిష్టంగా రూ. 57,500 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి, ఈ ఆఫర్ ఈ నెల (అక్టోబర్ 2025) మొత్తం వర్తిస్తుంది. Maruti Swift LXI ట్రిమ్‌పై పొదుపు ₹42,500 వరకు ఉంటుంది. ఇందులో ₹10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ₹15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.
మారుతి స్విఫ్ట్ ధర ఇప్పుడు ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో, మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు ₹5.79 లక్షలు (Maruti Swift ex-showroom price, Hyderabad Vijayawada). దీనిని కొనాలంటే, రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 86,000, బీమా కోసం దాదాపు రూ. 35,500, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించాలి. దీంతో ఆన్-ధర దాదాపు రూ. 7.01 లక్షలు (Maruti Swift on-road price, Hyderabad Vijayawada) అవుతుంది. మారుతి స్విఫ్ట్‌లో ఇంకా చాలా వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి, వేరియంట్‌ను బట్టి స్పెక్స్ & రేటు మారుతుంది.
మైలేజ్
మారుతి స్విఫ్ట్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 25.75 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.8 kmpl మైలేజ్ ఇవ్వగలదు. మాన్యువల్ CNG వేరియంట్ 32.85 km/kg మైలేజ్‌ను కలిగి ఉంది, ఇది దాని విభాగంలో అత్యధిక ఇంధన-సమర్థవంతమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. స్విఫ్ట్ S-CNG మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది - V, V(O), & Z. అన్ని వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్ అయ్యాయి.
కొత్త స్విఫ్ట్ బోల్డ్ & స్పోర్టి డిజైన్‌తో వచ్చింది. ఈ కారు Z-సిరీస్ డ్యూయల్ VVT ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది తక్కువ CO2 ఉద్గారాలతో 101.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు బాగా పనికొస్తుంది.
మారుతి స్విఫ్ట్ ఫీచర్లు
మారుతి కొత్త స్విఫ్ట్ S-CNGలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ & హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. అదనంగా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, స్ప్లిట్ రియర్ సీట్లు, 7-అంగుళాల స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & సుజుకి కనెక్ట్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది.
పోటీ కార్లు
మారుతి స్విఫ్ట్... హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, టాటా టియాగో, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా & టాటా పంచ్ వంటి ప్రీమియం & కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీ పడుతుంది. అంటే, స్విఫ్ట్ ప్రైస్ &స్పెక్స్ రేంజ్‌లోనే వచ్చే ప్రత్యామ్నాయ కార్లు ఇవి.





















