Swift CNG: మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ కారు రిలీజ్, మంచి మైలేజీ కావాలా? బెస్ట్ ఆప్షన్!
Maruti Suzuki Swift CNG: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ కారుని ఆ సంస్థ విడుదల చేసింది. దీనిని రూ. 8.19 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కారు కిలో సీఎన్‌జీకి 32.85 కి.మీ మైలేజీని అందిస్తుంది.
Maruti Suzuki Swift CNG Launched: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) సరికొత్త సీఎన్‌జీ కారుని విడుదల చేసింది. ఆ సంస్థలో ఫేమస్ లైనప్ అయిన మారుతి స్విఫ్ట్ (Maruti Swift) కారుని సీఎన్‌జీ (Maruti Suzuki Swift CNG) వెర్షన్‌లో లాంచ్ చేసింది. మొత్తం మారుతి కార్లలో ప్రస్తుతం వ్యాగన్‌ఆర్ తర్వాత మారుతి స్విఫ్ట్ అతిపెద్ద మార్కెట్‌కి కలిగి ఉన్న కారుగా ఉంది. ఈ ఫేమస్ కారుని ఇప్పుడు సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల చేసింది. 1.2-లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్‌తో ఈ సరికొత్త మారుతి సీఎన్‌జీ పని చేయనుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 70 ps శక్తిని, 102 nm టార్క్‌ని విడుదల చేస్తుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఆరు లక్షల సీఎన్‌జీ యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో మారుతి స్విఫ్ట్‌ని ఆ కంపెనీ ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి ప్రస్తుతం పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒటకిగా ఉంది. ప్రస్తుతం దీని 4th జనరేషన్ వెర్షన్‌ని మార్కెట్‌లో మారుతి విక్రయిస్తుంది. ఇప్పుడు దీనినే సీఎన్‌జీ వేరియంట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ .8.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త స్విఫ్ట్ VXi, VXi (0), ZXi వేరియంట్లలో లభిస్తుంది. ఈ సీఎన్‌జీ కారు కిలోకు 32.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లోనే అత్యధిక మైలేజీ ఇచ్చే కారుగా ఉంది.
ఫీచర్లు
ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, 7 ఇంచెస్ స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించింది. ఈ కారుని సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం రూ .21,628 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ ఫీజుతో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, మెయింటైనెన్స్ వంటి సదుపాయాలను కంపనీ కవర్ చేయనుంది. అయితే ఇది కచ్చితంగా తీసుకోవాల్సిన పనిలేదు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమేనని కంపనీ స్పష్టం చేసింది. ఈ సీఎన్‌జీ వెర్షన్ సిటీ డ్రైవింగ్ కోసం డ్యూయల్ వివిటి ఇంజిన్‌తోనూ వస్తుంది. ఇది 2900 rpm వద్ద గరిష్టంగా 101.8 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ తక్కువ కార్బన్ డయాక్సైడ్‌ని విడుదల చేయనుంది. కావున ఇది సిటీలో ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎక్కువ మైలేజీ అందించడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని ఈ మారుతి స్విఫ్ట్‌ని కంపెనీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. సేల్స్‌ని పెంచుకోవడం కోసం గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తుంది. అందుకోసం అన్ని మోడళ్లను సీఎన్‌జీలో ప్రవేశపెడుతుంది. తాజాగా మారుతి స్విఫ్ట్ విడుదలతో ఈ సంస్థలో మొత్తం సీఎన్‌జీ మోడళ్ల సంఖ్య 14కి చేరుకుంది.
ప్రస్తుతం మారుతి సుజుకి స్విఫ్ట్ 4th జనరేషన్ వెర్షన్ మార్కెట్‌లో కొనుగోలుకి సిద్ధంగా ఉంది. దీనిని మే నెలలో పూర్తిగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ పెట్రోల్ వేరియంట్ దాదాపు 67,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. దీంతో కొత్త సీఎన్‌జీ వేరియంట్ కూడా మార్కెట్‌లో రాణిస్తుందని కంపెనీ భావిస్తుంది.
సీఎన్‌జీ సేల్స్‌లో టాప్..
ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా సీఎన్‌జీ కార్లతో కస్టమర్లకు మారుతి సుజుకి మరింత చేరువ అయ్యిందిని ఆ సంస్థ పేర్కొంది. భవిష్యత్తులోనూ గ్రీన్ మొబిలిటీని ప్రోత్సాహించేందుకు సీఎన్‌జీ లైనప్‌పై ఫోకస్ చేసినట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు ఎలక్ట్రిక్ విభాగంలోనూ లైనప్‌ని మరింత విస్తరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం సీఎన్‌జీ అమ్మకాల్లో 46.8% వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుుగుతుందని కంపనీ భావిస్తోంది.