Maruti Suzuki Fronx Offer: మారుతి ఫ్రాంక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు - కొనాలంటే ఇదే బెస్ట్ టైం!
Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై రూ.77 వేల వరకు అందుబాటులో ఉండనుంది.
Maruti Suzuki Fronx Discount Offers in March 2024: మారుతి సుజుకి ఈ నెలలో ఎరీనా, నెక్సా ఉత్పత్తుల లైనప్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ప్రయోజనాల్లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, యాక్సెసరీ డిస్కౌంట్ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌లు ఈ నెల వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
డిస్కౌంట్ ఎంత?
మార్చిలో ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.77,000 తగ్గింపు అందిస్తున్నారు. వెలాసిటీ ఎడిషన్‌పై రూ. 60,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్‌తో వస్తున్న వేరియంట్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
మారుతి ఫ్రాంక్స్ ఇంజిన్ ఎలా ఉంది?
మారుతి ఫ్రాంక్స్ అనేది కంపెనీ బలెనో ఆధారంగా రూపొందించిన కూపే ఎస్‌యూవీ. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. వీటిలో నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 89 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. టర్బో పెట్రోల్ ఇంజన్ వరుసగా 99 బీహెచ్‌పీ పవర్, 148 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల గురించి మాట్లాడాలంటే 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉన్నాయి.
మారుతి ఫ్రాంక్స్ ఫీచర్లు
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హెడ్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మారుతి ఫ్రాంక్స్ ముఖ్య ఫీచర్లు. ఇది కాకుండా సెక్యూరిటీ ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి.
మారుతీ ఫ్రాంక్స్... టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీ పడుతోంది. రెండూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి. ఈ రెండిట్లోనూ మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఈ రెండు కార్లు కూడా సీఎన్‌జీ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ విక్రయాల గురించి కంపెనీ ఇటీవలే సమాచారం ఇచ్చింది. ఈ కారు ఇప్పటికే లక్ష యూనిట్ల అమ్మకాలను దాటింది. కేవలం తొమ్మిది నెలల్లోనే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది. గ్రాండ్ విటారా కంటే ఫ్రాంక్స్ ఎస్‌యూవీ అమ్మకాల్లో చాలా ముందుంది. ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి కంపెనీ వాటా 2022లో 10.4 శాతం నుంచి 2023లో 19.7 శాతానికి పెరిగింది. ఈ సేల్స్‌ను దాదాపుగా రెట్టింపు చేయడంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కీలక పాత్ర పోషించడం విశేషం.