Maruti Suzuki Fronx CNG: మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో సీఎన్‌జీ మోడల్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో సీఎన్‌జీ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది.
Maruti Suzuki Fronx Launched: మారుతి సుజుకి భారతదేశంలో తన ఫ్రాంక్స్ కారు సీఎన్‌జీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.41 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. మారుతి ఈ కారును సిగ్మా, డెల్టా అనే రెండు వేరియంట్లతో తీసుకువచ్చింది. ఈ కొత్త లాంచ్‌తో మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో సీఎన్‌జీ మోడల్స్ సంఖ్య 15కి పెరిగింది.
సీఎన్‌జీ ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్ కే-సిరీస్ డ్యూయల్‌జెట్ డ్యూయల్ వీవీటీ పెట్రోల్ ఇంజన్ అందించారు. దీని మొత్తం పవర్ అవుట్‌పుట్ గరిష్టంగా 76 బీహెచ్‌పీ, గరిష్ట టార్క్ 98.5 ఎన్ఎంగా ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ కారు కిలో ఇంధనానికి 28.51 కిలోమీటర్ల మైలేజీని కంపెనీ అందించనుంది. ఈ విభాగంలో ఇదే అత్యధికం.
ఫ్రాంక్స్ సీఎన్‌జీ వేరియంట్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు, ఏడు అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (ACC), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, షార్క్ ఫిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే సమయంలో ఈ కారును మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ మెంబర్‌షిప్ ద్వారా నెలవారీ నగదు చెల్లించి వాడుకోవచ్చు. ఇది రూ.23,248 నుంచి ప్రారంభం కానుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర
మారుతి ఈ కారును రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ధర గురించి చెప్పాలంటే ఫ్రాంక్స్ సీఎన్‌జీ సిగ్మా మాన్యువల్ వేరియంట్ ధర రూ. 8.41 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. దాని టాప్ ఎండ్ వేరియంట్ డెల్టా మాన్యువల్ ధర రూ. 9.27 లక్షలుగా నిర్ణయించారు. ఇది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్‌నే.
వీటితో పోటీ
మారుతి సుజుకి ఫ్రాంక్‌లతో పోటీ పడుతున్న వాహనాల్లో హ్యుండాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎస్‌యూవీ వంటి టాప్ ఎండ్ కార్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఇన్విక్టో ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కారును టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా తయారు చేశారు. కియా కార్నివాల్, టయోటా ఇన్నోవా క్రిస్టాలతో మారుతి సుజుకి ఇన్విక్టో కారు పోటీ పడనుంది. ఈ లేటెస్ట్ మారుతి కారు డిజైన్ టయోటా ఇన్నోవా హైక్రాస్ తరహాలో ఉంటుంది. కానీ ఇన్విక్టో బంపర్‌లో మాత్రం మారుతి సుజుకి కొన్ని మార్పులు చేసింది.
ఈ కారు క్యాబిన్ గురించి చెప్పాలంటే దీన్ని పూర్తిగా బ్లాక్ థీమ్‌తో లాంచ్ చేశారు. దీనిలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. పవర్ ఒట్టోమన్ ఫీచర్ కూడా అందించారు. కంపెనీ దీన్ని చింపాంజీ గోల్డ్ యాక్సెంట్‌తో లాంచ్ చేసింది. ఈ కారులో లెదర్ సీట్లు, సాఫ్ట్ టచ్ ప్రీమియం ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, యాంబియంట్ లైటింగ్ ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో 7-8 సీట్ కాన్ఫిగరేషన్, మెమరీతో 8 వే పవర్ డ్రైవర్ సీట్, ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ ఏసీ, వెనుక డోర్ సన్‌షేడ్‌లు, ఐఆర్ కట్ విండ్‌షీల్డ్, పవర్డ్ టెయిల్‌గేట్, 360 డిగ్రీ మానిటర్‌తో వెనుక డోర్ సన్‌షేడ్‌లు ఉన్నాయి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial