Maruti Suzuki eVX: కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్న మారుతి - లాంచ్ ఎప్పుడంటే?
Maruti Suzuki eVX Launch: మారుతి సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారు మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Maruti Electric SUV: మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్‌తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో మొదటిసారిగా సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా కనిపించింది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షోలో సుజుకి రెండు మోడళ్లను పరిచయం చేసింది. 2024లో స్విఫ్ట్, 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలా ఉంది?
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సిల్వర్ కనెక్ట్ బార్, సి-పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్‌తో ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది. దీని పైకప్పు ఈ కారుకు కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ... కారు చుట్టూ క్లాడింగ్ విస్తృతంగా ఉపయోగించారు. ఇది కారుకు బలమైన ఆకర్షణగా ఉండనుంది. మారుతి సుజుకి ఈవీఎక్స్ క్యాబిన్ చాలా ఫీచర్లతో ఉండనుందని స్పై పిక్స్ ద్వారా తెలుస్తోంది.
ఇది ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వెనుక పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది నిలువుగా పేర్చిన ఎయిర్ కాన్ వెంట్‌లతో ఇబ్బంది లేని డాష్‌బోర్డ్ లేఅవుట్, సెంటర్ కన్సోల్‌లో రోటరీ డయల్‌ను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటుతో రానుంది. ఇందులో అనేక ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ పొందే అవకాశం కూడా ఉంది.
కొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై...
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గుర్గావ్‌లో కంపెనీ ప్రొడక్షన్ ప్లాంట్‌కు సమీపంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఎంఎస్ఐఎల్ ఇంకా దాని నిర్మాణం గురించి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే దీన్ని కొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. దీనిని 27పీఎల్ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తారు. ఈ ఆర్కిటెక్చర్‌ను టయోటా 40పీఎల్ ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ నుంచి గ్రహించారు. ఈ సరికొత్త ఈవీ గుజరాత్‌లోని సుజుకి తయారీ ప్లాంట్‌లో తయారు అయింది. మారుతీ సుజుకి తర్వాత టయోటా కూడా భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల చేయనుంది.
డిజైన్, ఇంటీరియర్ ఎలా ఉన్నాయి?
మారుతి 2023 ఆటో ఎక్స్‌పోలో ఈవీఎక్స్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ఈ కాన్సెప్ట్ కారు పొడవు సుమారు 4.3 మీటర్లుగా ఉంది. వెడల్పు 1.8 మీటర్లుగానూ. ఎత్తు 1.6 మీటర్లుగానూ ఉంది. దీని వీల్‌బేస్ 2.7 మీటర్లుగా ఉండటం విశేషం. డాటెడ్ మోడల్ క్లీన్ ఫ్రంట్ ఫాసియాతో కాన్సెప్ట్ మోడల్‌తో సమానంగా కనిపిస్తుంది. ఇది ఖాళీగా ఉన్న గ్రిల్, ఎల్-ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు, మృదువైన బంపర్‌ను కలిగి ఉంది.
ఇంజిన్ ఎలా ఉంది?
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఎల్ఎఫ్‌పీ బ్లేడ్ సెల్‌లతో కూడిన 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కారు అందిస్తుంది. అయితే ఇది ప్రొడక్షన్ మోడల్‌లో దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ అందించే చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!