ఎస్‌యూవీలకు గండి కొట్టిన మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Maruti Suzuki Dzire | మార్చి 2026 కార్ల అమ్మకాల్లో మారుతి డిజైర్ 21,224 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాటా పంచ్, నెక్సాన్ వంటి పాపులర్ ఎస్‌యూవీలను వెనక్కి నెట్టి తన సత్తా చాటుకుంది.

ఇండియన్ ప్యాసింజర్ వాహన మార్కెట్ 2026 మార్చి నెలలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ప్రస్తుతం దేశంలో ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తున్నప్పటికీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ మారుతి సుజుకి డిజైర్ (Dzire) నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ గత నెలలో ఏకంగా 21,224 యూనిట్ల అమ్మకాలతో టాప్-10 చార్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రాక్టికల్ ఫీచర్లు, మంచి మైలేజీ ఇచ్చే కార్లకు ఇంకా మార్కెట్లో తిరుగులేదని డిజైర్ మరోసారి నిరూపించింది.
టాటా ఎస్‌యూవీల గట్టి పోటీ
మారుతి డిజైర్ తర్వాతి స్థానంలో టాటా పంచ్ (Tata Punch) నిలిచింది. ఈ మైక్రో ఎస్‌యూవీ తన ఈవీ వెర్షన్‌తో కలిపి మొత్తం 20,977 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మూడవ స్థానంలో 19,810 యూనిట్ల సేల్స్‌తో టాటా నెక్సాన్ (Tata Nexon) నిలిచింది. అర్బన్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఈసారి మారుతి డిజైర్ చేతిలో కొంచెం వెనుకబడింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఎంతో క్రేజ్ ఉన్న హ్యుందాయ్ క్రెటా 17,838 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది.
మారుతి సుజుకి హవా
టాప్-10 జాబితాలో మారుతి సుజుకి తన పట్టును మరింత పెంచుకుంది. ఫ్యామిలీ ఎంపీవీ మారుతి ఎర్టిగా 17,072 యూనిట్లతో ఐదో స్థానంలో ఉండగా, వ్యాగన్ఆర్ 17,025 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది. వీటితో పాటు మారుతి బాలెనో (16,392 యూనిట్లు), బ్రెజ్జా (16,130 యూనిట్లు), ఫ్రాంక్స్ (15,540 యూనిట్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహీంద్రా స్కార్పియో రేంజ్ (స్కార్పియో ఎన్ తో కలిపి) 14,578 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీలను ఇష్టపడే వారిలో స్కార్పియోకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఓవరాల్ గా..
మొత్తం మీద టాప్-10లో ఉన్న కార్లన్నీ కలిపి మార్చి నెలలో 1,76,586 యూనిట్ల విక్రయాలను సాధించాయి. ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం ఆటోమొబైల్ రంగానికి శుభసూచకంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నా, డిజైర్ వంటి సెడాన్ కార్లు నంబర్ వన్ ప్లేస్ సాధించడం విశేషం. మారుతి సుజుకి వివిధ బాడీ స్టైల్స్ (సెడాన్, హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ) లో తన పట్టును నిరూపించుకుంటూ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















