అన్వేషించండి

Low Maintenance Cars India: అత్యంత తక్కువ నిర్వహణ ఖర్చు కలిగే హ్యాచ్‌బ్యాక్‌ కార్లు! మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ది బెస్ట్‌ ఆప్షన్స్‌!

Low Maintenance Cars India: కార్లు కొనడమే కాకుండా వాటి నిర్వహణపై కూడా దృష్టి పెడుతున్నారు వినియోగదారులు. అందుకే తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చు ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కారు నిర్వహణ ఖర్చు కుటుంబాలకు భారంగా మారింది.
  • తక్కువ నిర్వహణ ఖర్చుతో మంచి కార్ల కోసం అన్వేషణ.
  • రెనాల్ట్ క్విడ్, మారుతి ఆల్టో, వ్యాగన్ ఆర్ ఉన్నాయి.
  • టాటా టియాగో, పంచ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అందుబాటులో ఉన్నాయి.

Low Maintenance Cars India: ప్రస్తుతం వేగంగా పరుగెడుతున్న ప్రపంచంలో కారు లగ్జరీగా చూసే రోజు ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కారు అనేది అవసరంగా మారిపోయింది. బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తున్నాయి. అందుకే కారు ఇంటికి తెచ్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. కానీ తర్వాత మెయింటెనెన్స్‌ విషయంలో మాత్రం భారం తప్పదు. సర్వీసింగ్‌ ఖర్చులు, విడిభాగాల ధరలు, వార్షిక నిర్వహణ భారంతో చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతుంటారు. 

కారు కొనే సమయంలో మైలేజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, దాని మెయింటెనెన్స్‌ గురించి కూడా అంతే శ్రద్ధతో తెలుసుకోవాలి. ఒక వేళ మీరు తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణ కలిగిన కారు కోసం చూస్తున్నట్టైతే భారతీయ మార్కెట్‌లో కొన్ని హ్యాచ్‌బ్యాక్ కార్లు మీకు అద్భుతమైన ఎంపికలుగా నిలుస్తాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి, టాటా మోటార్స్,హ్యూందాయ్‌ వంటి కంపెనీలు ఈ విభాగంలో ముందు వరుసలో ఉన్నాయి. 

చాలా మంది కారు కొనే సమయంలో కేవలం ధరను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ప్రతి ఏటా చేయించాల్సిన సర్వీసింగ్, ఆయిల్ మార్పులు, ఇతర చిన్న చిన్న రిపేర్‌లు మీ నెలసరి ఖర్చులను పెంచేస్తాయి. వార్షిక మెయింటెనెన్స్‌ ఖర్చు ఐదువేల రూపాయల లోపు ఉంటే అది సామాన్య మధ్యతరగతి కుటుంబానికి పెద్ద భారం అనిపించదు. అందుకే సరసమైన ధరతోపాటు తక్కువ నిర్వహణ ఖర్చు ఉండే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. 

రెనాల్ట్ క్విడ్‌

తక్కువ నిర్వహణ ఖర్చు జాబితాలో అన్నింటికంటే రెనాల్ట్‌ క్విడ్ ముందంజలో ఉంది. ఇది చూడటానికి ఒక చిన్న ఎస్‌యూవీ తరహాలో స్టైలిష్‌గా ఉంటుంది. తక్కువ ధరలో మంచి లుక్‌ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. సుమారు 2500 నుంచి3000 వరకు నిర్వహణ ఖర్చు ఉంటుంది. 

మారుతీ సుజుకి ఆల్టో కే 10

మధ్యతరగతి భారతీయుల మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ మారుతీ సుజుకీ ఆల్టో వైపే ఉంటుంది. ఆల్టో కే 10 ప్రత్యేకంగా మధ్య తరగతి కుటుంబాల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. దీని వార్షిక మెయింటెనెన్స్ ఖర్చు 3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 

మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్‌

విశాలమైన స్పేస్‌,  సౌకర్యం కోరుకునే కుటుంబాలకు వ్యాగన్ ఆర్ నమ్మకమైనదిగా ఉంటోంది.దీని నిర్వహణ ఖర్చు 3500 నుంచి 5000 వరకు ఉంటుంది. 

టాటా టియాగో, టాటా పంచ్‌

టాటా మోటార్స్‌ ఇటీవల కాలంలో తన కార్ల నాణ్యత, భద్రతో వినియోగదారుల మనసు గెలుచుకుంది. టియాగో, పంచ్‌్ మోడళ్లకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఈ చిన్న కార్ల సర్వీసింగ్ ఖర్చు ఏడాదికి మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది. 

హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10

కొంచెం ప్రీమియం ఫీచర్లు, మెరుగైన బిల్ట్‌ క్వాలిటీ కోరుకునే వారికి ఈ కారు ఉత్తమ ఎంపిక. ఇతర హ్యాచ్‌ బ్యాక్‌లతో పోలిస్తే ఇది కొంచెం ఖరీదైనదిగా అనిపించవచ్చు. దీని ఫీచర్లు దృష్ట్యా నిర్వహణ ఖర్చు సమంజసంగానే  ఉంటుంది. దీనికి ఏడాదికి అయ్యే నిర్వహణ ఖర్చు నాలుగువేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. 

మెయింటెనెన్స్‌ ఖర్చు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

మెయింటెనెన్స్‌ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం చాలా అవసరం. సాదరంగా ప్రతి పదివేల కిలోమీటర్లకు లేదా ఏడాదికి ఒకసారి సర్వీసింగ్ చేయించడం వల్ల కారు ఇంజిన్ లైఫ్ బాగుంటుంది. కంపెనీ సూచించిన అధికారిక సర్వీస్ సెంటర్‌లోనే సర్వీసింగ్ చేయించాలి. దీని వల్ల పెద్ద పెద్ద మరమ్మతులు రాకుండా చూసుకోవచ్చు. 

Frequently Asked Questions

తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన కార్లు ఏవి?

భారతీయ మార్కెట్‌లో రెనాల్ట్ క్విడ్, మారుతీ సుజుకి ఆల్టో కే 10, వ్యాగన్ ఆర్, టాటా టియాగో, పంచ్‌, మరియు హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10 వంటి కార్లు తక్కువ నిర్వహణ ఖర్చుతో అద్భుతమైన ఎంపికలు.

కారు నిర్వహణ ఖర్చులో ఏయే అంశాలు ఉంటాయి?

కారు నిర్వహణ ఖర్చులో ప్రతి ఏటా చేయించాల్సిన సర్వీసింగ్, ఆయిల్ మార్పులు, మరియు ఇతర చిన్న చిన్న రిపేర్‌లు ఉంటాయి. ఇవి మీ నెలసరి ఖర్చులను పెంచుతాయి.

కారు నిర్వహణ ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చు?

కారు నిర్వహణ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా, అంటే ప్రతి పదివేల కిలోమీటర్లకు లేదా ఏడాదికి ఒకసారి అధికారిక సర్వీస్ సెంటర్‌లో సర్వీసింగ్ చేయించడం మంచిది. దీనివల్ల పెద్ద మరమ్మతులు రాకుండా ఉంటాయి.

టాటా మోటార్స్‌ కార్ల నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుంది?

టాటా టియాగో, పంచ్‌్ మోడళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ చిన్న కార్ల సర్వీసింగ్ ఖర్చు ఏడాదికి సుమారు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget