Maruti Suzuki Price Hike: 2025లో భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు - ఎంత పెంచుతున్నారంటే?
Maruti Suzuki Cars Price: ప్రముఖ కార్ల బ్రాండ్ మారుతి సుజుకి తన కార్ల ధరలను జనవరి నుంచి పెంచనుంది. కారును బట్టి నాలుగు శాతం వరకు ధర పెరగవచ్చని కంపెనీ పేర్కొంది.
Maruti Suzuki Cars Price Hike In January 2025: కొత్త సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. 2025లో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. అదే సమయంలో దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీలలో ఒకటైన మారుతి సుజుకి కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతి పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ల మోడల్లను బట్టి మారుతి కార్ల ధరల పెరుగుదల మారవచ్చు.
మారుతి ధర ఎందుకు పెంచుతోంది?
ఇన్పుట్ కాస్ట్, ఆపరేషనల్ ఖర్చులు పెరగడంతో ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. వినియోగదారులపై ధర ప్రభావం తక్కువగా ఉండేలా వాహనాల ధరలను వీలైనంత తక్కువగా ఉంచేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తామని కంపెనీ తెలిపింది. ఈ పెరిగిన ధరలు మార్కెట్‌పై కూడా కొంత ప్రభావం చూపవచ్చని మారుతి పేర్కొంది.
మారుతి అత్యంత చవకైన కారు ధర ఎంత?
మారుతీ సుజుకి అత్యంత చవకైన కారు ఆల్టో కే10. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ధర నాలుగు శాతం పెరిగితే, ఆల్టో బేస్ ధర దాదాపు రూ.16 వేల వరకు పెరగవచ్చు. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ ధర రూ. 5.96 లక్షలుగా ఉంది. జనవరిలో కార్ల ధరలు పెరిగిన తర్వాత దీని ధర దాదాపు రూ.6.20 లక్షల వరకు ఉండవచ్చు.
గ్రాండ్ విటారా కొత్త ధర
మారుతి గ్రాండ్ విటారా ఈ బ్రాండ్‌లో అత్యంత ఖరీదైన కారు. గ్రాండ్ విటారా ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి మొదలై రూ. 20.09 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ధరను కూడా నాలుగు శాతం పెంచితే, దీని బేస్ మోడల్ ధర దాదాపు 44 వేల రూపాయలు పెరగవచ్చు. ఈ కారు టాప్ వేరియంట్ ధర 80 వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
మారుతి ఫ్రాంక్స్ ధర ఎంత ఉంటుంది?
మారుతి ఫ్రాంక్స్ భారతీయ మార్కెట్లో మంచి పేరున్న కారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.8,37,500 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ధర నాలుగు శాతం పెరిగితే, ఆ కారు బేస్ వేరియంట్ ధర రూ.33,500 పెరగవచ్చు. ఫ్రాంక్స్ టాప్ మోడల్ ధర రూ.14.92 లక్షలు. జనవరిలో ఈ వేరియంట్ ధర దాదాపు రూ.60 వేలు పెరగవచ్చు. మారుతి ఫ్రాంక్స్ ధరలో నాలుగు శాతం పెరిగిన తర్వాత, ఈ కారు ధర 8.71 లక్షల నుంచి 15.52 లక్షల మధ్య ఉండవచ్చు.
మారుతి వ్యాగన్ఆర్ కొత్త ధర
మారుతీ వ్యాగన్ఆర్కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.54 లక్షల నుంచి మొదలై రూ. 7.33 లక్షల వరకు ఉంటుంది. దీని ధర నాలుగు శాతం పెరిగితే బేస్ మోడల్ ధర దాదాపు రూ.22 వేలు పెరిగి రూ.5.76 లక్షలకు చేరుకోవచ్చు. అదే సమయంలో దాని టాప్ మోడల్ ధర సుమారు రూ. 29 వేల వరకు పెరగవచ్చు. దీని కారణంగా టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.62 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?