Mahindra XUV700 Price: మహీంద్రా XUV700 కార్ల ధరలు భారీగా తగ్గింపు, ఆ నాలుగు నెలలు మాత్రమే ఆఫర్!
Mahindra XUV700 Price Detials: మహీంద్రా XUV700 ధరను భారీగా తగ్గిస్తూ కంపెనీ కీలక ప్రకటన చేసింది. రూ. 2 లక్షల వరకూ తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.
![Mahindra XUV700 Price: మహీంద్రా XUV700 కార్ల ధరలు భారీగా తగ్గింపు, ఆ నాలుగు నెలలు మాత్రమే ఆఫర్! Mahindra XUV700 AX7 prices cut by rs 2 lakhs How much will it cost now know details Mahindra XUV700 Price: మహీంద్రా XUV700 కార్ల ధరలు భారీగా తగ్గింపు, ఆ నాలుగు నెలలు మాత్రమే ఆఫర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/7c4052b2150e8070d09ef6cb79a8eac91720601280929517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mahindra XUV700 Price Cut: మహీంద్రా నుంచి వచ్చిన XUV700 వెహికిల్స్‌కి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. భారీ బాడీ, వావ్ అనిపించే డిజైన్‌తో చాలా తొందరగా పాపులర్ అయిపోయింది. కాస్త ధర ఎక్కువ ఉందన్న కంప్లెయిట్స్ వస్తున్న క్రమంలోనే గుడ్ న్యూస్ చెప్పింది మహీంద్రా కంపెనీ. XUV700 సిరీస్‌లోని AX7 మోడల్ ధరని భారీగా (Mahindra XUV700 AX7 Price Cut) తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఏకంగా రూ.2 లక్షల వరకూ తగ్గించింది. XUV700 లో టాప్‌ఎండ్ మోడల్‌లో ఈ స్థాయిలో ధర తగ్గించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ 7 సీటర్ పెట్రోల్ కార్ ధర రూ.19.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అదే సిక్స్ సీటర్‌కి అయితే రూ.19.69 లక్షల నుంచి ప్రారంభమవుతుదని వెల్లడించింది.
పెట్రోల్ AT AX7 6 సీటర్ కార్ ధర రూ.21.19 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, ఇదే మోడల్‌లో సిక్స్ సీటర్ స్టార్టింగ్ ప్రైస్ రూ.20.99 లక్షలుగా ఉందని తెలిపింది. AX7 డీజిల్ కార్ కాస్ట్ రూ.20.19లక్షల నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా చూస్తే ఒక్కో మోడల్‌పై రూ.1.8 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకూ ధర తగ్గించింది సంస్థ. జులై 10వ తేదీ నుంచి దాదాపు నాలుగు నెలల పాటు ఈ ఆఫర్ (Mahindra XUV700 AX7 Prices) అప్లై అవుతుందని ప్రకటించింది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే... AX7 మోడల్‌లో పారానోమిక్ సన్‌రూఫ్ ప్లస్ ఫీచర్ ఇచ్చింది కంపెనీ. దీంతో పాటు 18 ఇంచ్ అలాయ్స్, పవర్డ్ డ్రైవర్స్ సీట్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఇచ్చింది.
Mahindra XUV700 AX7 ఫీచర్స్
మూడేళ్ల క్రితమే ఈ మోడల్ లాంఛ్ కాగా (Mahindra XUV700 AX7 Price and Features) ఇప్పటికే 2 లక్షల కార్‌లు అమ్ముడయ్యాయి. రూ.50 వేలు ఎక్కువ చెల్లిస్తే డీజిల్ కార్‌నీ డెలివరీ చేస్తోంది కంపెనీ. ఇక ఈ కార్ ఫీచర్స్ చూస్తే 26 ఇంచుల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పానారోమిక్ సన్‌రూఫ్, యాపిల్ కార్‌ప్లే కంపాటిబిలిటీతో పాటు డ్రైవర్ నిద్ర మత్తులో ఉంటే వెంటనే డిటెక్ట్ చేసి అలెర్ట్ చేసే ఫీచర్‌నీ చేర్చింది. LED హెడ్‌ల్యాంప్స్, 12 స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, వెంటిలేటెడ్ సీట్స్, బ్లైండ్ వ్యూ మానిటర్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ధర కూడా తగ్గడం వల్ల ఇన్ని ఫీచర్స్ తక్కువ కాస్ట్‌కే లభించనున్నాయి. 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 2.2 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్‌తో పాటు ఆటోమెటిక్ గేర్ సిస్టమ్‌నీ తీసుకొచ్చింది. అయితే..ఈ తగ్గించిన ధరలు నాలుగు నెలల పాటు కొనసాగుతాయని సంస్థ ప్రకటించింది. ఈ మోడల్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి మూడేళ్లవుతున్న సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చింది. మార్కెట్‌ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రీమియం రేంజ్‌లో ఈ కార్‌లు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ధరల తగ్గింపుతో ఈ సేల్స్ ఇంకా పెరిగే అవకాశముంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)