Mahindra XUV300 EV: ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలో - తక్కువ ధరలోనే - ఫీచర్లు ఎలా ఉండవచ్చు?
Mahindra XUV300 EV Expected Price: మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ధర కూడా ఎక్స్‌యూవీ400 ఈవీ కంటే తక్కువగా ఉండనుంది.
Mahindra XUV300 EV India Launch: అప్‌డేట్ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక స్పై ఫొటోలు, వీడియోలలో కనిపించింది. వీటిని కంపెనీ విస్తృతంగా పరీక్షిస్తుంది. అధికారికంగా విడుదల తేదీ వెల్లడి కానప్పటికీ ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 2024 ఫిబ్రవరి నాటికి విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఈవీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఎక్స్‌యూవీ400 EV కంటే చవకగా
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ300 కంటే దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కొంచెం పెద్దదిగా ఉండనుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీకి ప్రత్యర్థిగా ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 కంటే తక్కువ ధరతో రానుంది. ఎక్స్‌యూవీ300 ఈవీ వచ్చిన తర్వాత ఇది నెక్సాన్ ఈవీతో పోటీపడనుంది. ప్రస్తుతం దీని ఎక్స్‌షోరూం ధర రూ. 15.99 లక్షల నుంచి రూ. 19.39 లక్షల మధ్య ఉంది. ఎక్స్‌యూవీ400 ఈవీ కంటే ఎక్స్‌యూవీ300 ఈవీ ధర దాదాపు రూ. 2 లక్షలు తక్కువగా ఉంటుందని అంచనా. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ అధికారిక ధర 2024 జూన్ నాటికి ప్రకటించే అవకాశం ఉంది.
ఇంజిన్ ఇలా...
ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది 150 బీహెచ్‌పీ శక్తిని, 310 ఎన్ఎం టార్క్‌తో పాటు ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. దీనికి విరుద్ధంగా ఇదే పవర్‌ట్రెయిన్ సెటప్‌తో కూడిన ఎక్స్‌యూవీ400... ఎంఐడీసీ ప్రకారం ఒకే ఛార్జ్‌పై 375 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి దీని బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 50 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఈవీ స్పెసిఫిక్ డిజైన్‌తో...
ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ SUV డిజైన్, స్టైలింగ్ మహీంద్రా రాబోయే బీఈ (బోర్న్ ఎలక్ట్రిక్) ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొందింది. ప్రధానంగా ఫ్రంట్ ఎండ్‌లో చాలా డిజైన్‌కు సంబంధించిన మార్పులు చేయనున్నారు. ఇందులో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌తో రీడిజైన్ చేసిన ట్విన్ పార్ట్ గ్రిల్, అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అప్‌డేట్ చేసిన బంపర్ ఉన్నాయి. ఇది కాకుండా రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, ఫుల్ వైడ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడిన కొత్త టెయిల్‌గేట్ వంటి ఇతర మార్పులను కూడా పొందే అవకాశం ఉంది. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త సెంటర్ కన్సోల్, అప్‌డేట్ చేయబడిన డాష్‌బోర్డ్ డిజైన్‌ను పొందనుంది. మహీంద్రా కార్లకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం వినియోగదారులు మంచి ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నారు. కాబట్టి ఈ కారు క్లిక్ అయితే భారతీయ కార్ల మార్కెట్లో మహీంద్రా షేర్ మరింత పెరగడం ఖాయం.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!