(Source: ECI/ABP News/ABP Majha)
మహీంద్రా స్కార్పియో ఎన్ Vs క్లాసిక్: ఏది బెటర్ ఛాయిస్?
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధరలను ప్రకటించడంతో, కొంతమంది కొనుగోలుదారులు ఏ వెహికల్ కొనుగోలు చేస్తే మంచిదో ఆలోచిస్తున్నారు. ఈ రెంటింటిలో ఏది బెస్ట్ ఛాయిస్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
స్కార్పియో N అనేది.. స్కార్పియో క్లాసిక్ లేటెస్ట్ జనరేషన్ వెర్షన్. సాంకేతింగా చాలా మెరుగ్గా ఉంటుంది. తాజాగా క్లాసిక్ ధరలను ప్రకటించడంతో, కొంతమంది కొనుగోలుదారులు ఏ వెహికల్ కొనుగోలు చేస్తే మంచిది? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కార్ల మధ్య పోలికలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వీటిని పోల్చి చూసిన తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి..
ఏ SUV పెద్దది?
కొత్త ప్లాట్ ఫారమ్, ఎక్కువ స్థలం కోసం పొడవైన వీల్ బేస్ తో క్లాసిక్ కంటే స్కార్పియో N చాలా పెద్దదిగా ఉంటుంది. స్కార్పియో డిజైన్ ను అలాగే ఉంచుతూ.. స్కార్పియో Nను రూపొందించారు. ఈ లుక్ మరింత ప్రీమియంగా ఉంటుంది. అప్డేట్ చేయబడిన స్కార్పియో క్లాసిక్ సైతం మంచి ఆకర్షణతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
ఏ SUVకి ఎక్కువ స్థలం ఉంది?
స్కార్పియో N స్పష్టంగా పొడవైన వీల్ బేస్ తో మరింత విశాలంగా ఉంటుంది. లోపలి భాగంలో ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. క్లాసిక్ కూడా కెప్టెన్ సీట్లతో పాటు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
ఏ SUVలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి?
క్లాసిక్ స్కార్పియో N కంటే పెద్ద టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. కానీ, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఫ్రంట్/రియర్ కెమెరా, 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, వైర్ లెస్ ఛార్జింగ్, సన్ రూఫ్, అలెక్సా-ఎనేబుల్ వంటి అనేక ఫీచర్లతో స్కార్పియో N మరింత ఆధునీకంగా ఉంటుంది. What3Word, 6 ఎయిర్ బ్యాగ్ లు ఇందులో ఉంటాయి. స్కార్పియో క్లాసిక్ లో అవసరమైన ఫీచర్ లు ఉన్నాయి. కానీ, క్రూయిజ్ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్ బ్యాగులు లేవు.
ఏ SUV మరింత శక్తివంతమైనది?
Scorpio N శక్తివంతమైన 2.0l టర్బో పెట్రోల్ మాన్యువల్/ఆటోమేటిక్, 2.2l డీజిల్ ఇంజన్, 4 WD తో పాటు మాన్యువల్/ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంది. స్కార్పియో క్లాసిక్ కేవలం మాన్యువల్ గేర్ బాక్స్ తో 2.2లీ డీజిల్ ను మాత్రమే కలిగి ఉంది. ట్రీ వేరియంట్ ల కోసం తక్కువ ట్యూన్ లో అదే పవర్ అవుట్ పుట్ కలిగి ఉంటాయి. టాప్-ఎండ్ డీజిల్ స్కార్పియో N మోడల్‌లు డ్రైవ్ మోడ్ లు, 4WD ప్లస్ టెర్రైన్ మోడ్ లతో 175bhp వెర్షన్ ను కలిగి ఉంటాయి.
ఏ SUV ఎక్కువ విలువైనది?
స్కార్పియో క్లాసిక్ డీజిల్ రూ. 11.9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. స్కార్పియో ఎన్ డీజిల్ ప్రారంభ ధర రూ. 12.5 లక్షలు. ప్రీమియం స్కార్పియో N డీజిల్ మోడల్‌లతో పోల్చితే ధరలో తేడా ఉంటుంది. స్కార్పియో క్లాసిక్ అనేది పాత స్కార్పియో ప్రేమికుల ఎంపిక. స్కార్పియో N పెద్దది, మెరుగైన సదుపాయం కలిగి ఉంటుంది. ఖరీదైనది కూడా. మొత్తంగా క్లాసిక్ కంటే స్కార్పియో N బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.