News
News
X

Electric XUV400: సూపర్ హిట్ సిరీస్‌లో ఎలక్ట్రిక్ కారు - ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 వచ్చేస్తుంది!

ప్రముఖ కార్ల బ్రాండ్ మహీంద్రా మనదేశంలో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. అదే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400.

FOLLOW US: 

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 మనదేశంలో ఈ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ఆగస్టు 15వ తేదీన జరగనున్న యూకే ఈవెంట్‌లో మరిన్ని ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు వారి టెక్నాలజీ, ప్లాట్‌ఫాం గురించి కూడా తెలపనున్నారు. 2023 జనవరి నుంచి మార్చి మధ్యలో వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.

మహీంద్రా కంపెనీ ఎప్పటినుంచో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఉంది. కమర్షియల్ వాహనాల్లో ఈ-ఆల్ఫా మినీ, ట్రియో, ఈసుప్రో లాంటి వాహనాలను కంపెనీ లాంచ్ చేసింది. ఇక ప్యాసింజర్ వాహనాల్లో కూడా ఈ2ఓ ప్లస్, ఈవెరిటో వాహనాలు మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన మొదటి ఈఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజీ జెడ్ఎస్ ఈవీలతో ఈ కారు పోటీ పడనుంది. ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 ధర కూడా ఈ రెండిటి రేంజ్‌లోనే ఉండనుంది.

మనదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని మహీంద్రా కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ కంపెనీ నుంచి త్వరలో మరిన్ని కొత్త ఎస్‌యూవీలు లాంచ్ కానున్నాయి. 2026 నాటికి మనదేశంలో తిరిగే కార్లలో 16 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండనున్నాయని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది.

ప్రస్తుతం ప్యాసింజర్ ఈవీ మార్కెట్‌ అంత ఆశాజనకంగా లేకపోయినా గవర్నమెంట్ సబ్సిడీలు, మెరుగైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు, చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెరుగైన ఆప్షన్లు వంటివి ఎలక్ట్రిక్ కార్లను కొనడానికి ప్రోత్సహిస్తున్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

View this post on Instagram
 
A post shared by Gaadiwaadi.com (@gaadiwaadi)

Published at : 08 Jul 2022 04:46 PM (IST) Tags: Mahindra Electric XUV400 Launch Date Mahindra Electric XUV400 XUV400 Electric XUV400 eXUV400

సంబంధిత కథనాలు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!

జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!

Car Discounts : పండుగల సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఇవిగో బంపర్ ఆఫర్ల డీటైల్స్

Car Discounts :  పండుగల సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఇవిగో బంపర్ ఆఫర్ల డీటైల్స్

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Hyundai Tucson SUV Price: హ్యుండాయ్ టక్సన్ ధర రివీల్ చేసిన కంపెనీ - మొదటిసారి ఆ ఫీచర్‌తో!

Hyundai Tucson SUV Price: హ్యుండాయ్ టక్సన్ ధర రివీల్ చేసిన కంపెనీ - మొదటిసారి ఆ ఫీచర్‌తో!

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?