అన్వేషించండి

Kia Sonet HTK లేదా Hyundai Venue HX4: ₹10 లక్షల బడ్జెట్‌లో కొత్త డ్రైవర్‌కు ఏ కారు బెస్ట్?

₹10 లక్షల ఆన్‌రోడ్ బడ్జెట్‌లో Kia Sonet, Hyundai Venue మధ్య ఏది మంచిది? కొత్త డ్రైవర్‌కు కంఫర్ట్‌, ఫీచర్లు, డ్రైవింగ్ ఈజ్‌, రీసేల్ విలువ పూర్తి విశ్లేషణ.

Best Car Under 10 Lakh: భారత మార్కెట్‌లో ₹10 లక్షల ఆన్‌రోడ్ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో వచ్చే కాంపాక్ట్ SUV కోసం చూస్తున్నవారు ఎక్కువగా పరిశీలించే రెండు మోడళ్లు - Kia Sonet HTK (Optional) & Hyundai Venue HX4. ముఖ్యంగా మీరు కొత్త డ్రైవర్ అయితే, కారు ఎంపికలో కేవలం లుక్ లేదా బ్రాండ్ మాత్రమే కాదు... డ్రైవింగ్ ఈజ్‌, కంఫర్ట్‌, మెయింటెనెన్స్‌, రీసేల్ వాల్యూ కూడా కీలకం అవుతాయి. 

ఇంజిన్‌, పనితీరు - రెండింటికీ తేడా లేదు

ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. Kia Sonet, Hyundai Venue - ఈ రెండింటిలోనూ ఒకే ఇంజిన్‌, ఒకే గేర్‌బాక్స్ సెటప్ ఉంటుంది. కాబట్టి పికప్‌, పవర్‌, మైలేజ్ విషయంలో పెద్దగా తేడా ఉండదు. రోజువారీ నగర ప్రయాణాలకు, అప్పుడప్పుడు హైవే డ్రైవ్‌లకు రెండూ సరిపోతాయి. కొత్త డ్రైవర్‌కు ఈ ఇంజిన్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగేలా ఉంటుంది.

కంఫర్ట్‌, రైడ్ క్వాలిటీ - Venue ముందంజ

ఇక్కడే Hyundai Venue HX4 స్పష్టంగా ముందుంటుంది. 2025లో తాజాగా వచ్చిన Venue సైజ్‌లో కొద్దిగా పెద్దదైంది. ముఖ్యంగా సస్పెన్షన్ సెటప్‌ను హ్యుందాయ్ మార్చింది. ఫలితంగా, గుంతల రోడ్లు, స్పీడ్ బ్రేకర్లపై Venue మరింత కంఫర్ట్‌గా అనిపిస్తుంది. Sonetతో పోలిస్తే Venue రైడ్ క్వాలిటీ సాఫ్ట్‌గా ఉంటుంది. రోజూ డ్రైవ్ చేసే వారికి, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికి ఇది పెద్ద ప్లస్.

ఫీచర్లు, డ్రైవింగ్ ఈజ్

ఫీచర్ల విషయంలో రెండూ మంచి ప్యాకేజీలే. టచ్‌స్క్రీన్‌, కనెక్టెడ్ ఫీచర్లు, స్టీరింగ్ కంట్రోల్స్ వంటి అవసరమైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. అయితే, డ్రైవింగ్ ఈజ్ పరంగా Venue కొంచెం నమ్మకంగా అనిపిస్తుంది. స్టీరింగ్ ఫీల్ సాఫ్ట్‌గా ఉంటుంది, విజిబిలిటీ కూడా బాగుంటుంది. కొత్త డ్రైవర్‌గా ట్రాఫిక్‌లో కారు నడపాలంటే Venue కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది.

ఆఫ్టర్ సేల్స్, రీసేల్ విలువ

భారతదేశంలో Hyundai ఆఫ్టర్ సేల్స్ నెట్‌వర్క్ చాలా బలంగా ఉంటుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో. సర్వీస్ సెంటర్లు ఎక్కువగా ఉండటం, స్పేర్ పార్ట్స్ సులభంగా లభించడం Venueకి అదనపు బలం. రీసేల్ విలువ విషయంలో కూడా Venueకు కొంచెం ఆధిక్యం ఉంటుంది.

ధర 

Kia Sonet HTK Petrol 1.2L 5 Speed Manual - రూ. 10.12 లక్షలు (ఆన్‌రోడ్‌ ధర) 

Hyundai Venue HX 4 1.2 Petrol MT - రూ. 10.70 (ఆన్‌రోడ్‌ ధర) 

ఏది బెస్ట్ ఎంపిక?

ఇంజిన్ ఒకటే అయినా, మొత్తం ప్యాకేజీగా చూస్తే Hyundai Venue HX4 మీ అవసరాలకు (సుమారు ₹10 లక్షల ఆన్‌రోడ్‌ బడ్జెట్‌, కొత్తగా డ్రైవింగ్‌, తక్కువ మెయింటెనెన్స్‌) ఎక్కువగా సరిపోతుంది. కంఫర్ట్‌, డ్రైవింగ్ ఈజ్‌, ఆఫ్టర్ సేల్స్, రీసేల్ విలువ అన్నింటిలో Venue కొంచెం మెరుగ్గా ఉంటుంది. కొత్త డ్రైవర్‌గా, టెన్షన్ లేకుండా కారును ఉపయోగించాలంటే Venueనే మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget