Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
కియా సెల్టోస్ యూనిట్లు మనదేశంలో 3 లక్షలకు పైగా అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది.
కియా సెల్టోస్ మనదేశంలో 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయింది. కియా ఓవరాల్ సేల్స్‌లో సెల్టోస్ దాదాపు 60 శాతానికి పైగా ఉంది. కియా ఇటీవలే మనదేశంలో ఐదు లక్షల సేల్స్ మైలురాయిని దాటింది. సెల్టోస్‌లోని డీజిల్ మోడల్‌లో ఐఎంటీ వేరియంట్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది.
ఈ మోడల్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది. కియా సెల్టోస్ కొంటున్న ప్రతి 10 మందిలో ఒకరు 2022 మోడల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అలాగే హెచ్‌టీఎక్స్ పెట్రోల్ వేరియంట్, వైట్ కలర్ మోడల్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.
పెట్రోల్, డీజిల్ మోడల్‌లకు వినియోగదారులు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని కంపెనీ ప్రకటించింది. కియా ఈవీ6 ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ కారు. సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద లార్జ్ హెడ్‌ల్యాంప్స్ కూడా ఇందులో ఉండనున్నాయి. ముందువైపు బంపర్ డిజైన్ చాలా క్లీన్‌గా ఉంది. దీని డిజైన్ కూడా స్పోర్టీగా ఉంది. ఈ కారు లుక్ దీనికి మరింత ప్లస్ కానుంది.
ఈ కారు పొడవు 4681 మిల్లీమీటర్లుగా ఉండనుంది. 520 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించారు కాబట్టి లోపల విశాలంగా ఉండనుంది. 12.3 అంగుళాల కర్వ్‌డ్ టచ్‌స్క్రీన్ సిస్టం, 12.3 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సరౌండ్ వ్యూ మానిటరింగ్, మెరీడియన్ సౌండ్ సిస్టం, సన్‌రూఫ్, మూడు డ్రైవింగ్ మోడ్లు (నార్మల్, స్పోర్ట్, ఎకో), అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 528 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 350 కేడబ్ల్యూహెచ్ చార్జర్‌ను ఉపయోగిస్తే 10 నుంచి 80 శాతం చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే ఎక్కుతుంది. దీనికి మూడు సంవత్సరాల వారంటీ అందించనున్నారు. ఇక బ్యాటరీకి ఎనిమిది సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు తిరిగేవరకు వారంటీ అందించనున్నారు. వీటిలో ఏది ముందు దాటితే అప్పుడు వారంటీ పీరియడ్ ముగిసిపోనుంది.
కియా కారెన్స్ కూడా..
ఈ సంవత్పరం కియా కారెన్స్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర ధర రూ.9.59 లక్షల నుంచి రూ.17.69 లక్షల మధ్య ఉంది. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టంను అందించారు. మొత్తం 66 కనెక్టెడ్ కార్ టెక్నాలజీలు ఉన్న కియా కనెక్ట్ సూట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో, మూడో వరుసల కోసం పైభాగంలో అమర్చిన ఏసీ వెంట్లు ఇందులో ఉన్నాయి.
దీంతోపాటు ఆటోమేటిక్ ఏసీ, ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో వరుస సీట్ల కోసం ఎలక్ట్రిక్ ట్రంబుల్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు, స్పీడ్ లిమిటర్ ఉన్న ఆటో క్రూయిజ్ కంట్రోల్, స్పోర్ట్, ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
ఇందులో అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం నాలుగూ డిస్క్ బ్రేకులే. దీంతోపాటు బ్రేక్ అసిస్టట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. దీంతోపాటు రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా కూడా ఉన్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?