అన్వేషించండి

ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి

Kia Carens Clavis EV: కియా మోటార్స్ కారెన్స్ క్లావిస్ EVపై 2.15 లక్షల వరకు బెనిఫిట్స్ ఇస్తోంది. ఎక్స్‌చేంజ్ బోనస్, నగదు తగ్గింపు, స్క్రాపేజ్ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కియా కేరెన్స్ క్లావిస్ EV పై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు.
  • పాత మోడళ్లపై ఎక్కువ ప్రయోజనాలు, 2025 స్టాక్ క్లియరెన్స్ లక్ష్యం.
  • ఫ్యామిలీ అవసరాలకు ప్రీమియం ఎలక్ట్రిక్ MPV, 490 కి.మీ. రేంజ్.
  • ఆధునిక డిజైన్, డ్యూయల్ స్క్రీన్, V2L వంటి ప్రీమియం ఫీచర్లు.

 Discount On EV Cars | భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటీలతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కియా మోటార్స్ తమ Kia Carens Clavis EV కొనుగోలుదారులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. కియా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ MPVపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్లు లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలగనుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పాత మోడళ్లపై ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి. తమ కుటుంబం కోసం ఎక్కువ రేంజ్ ఇచ్చే ప్రీమియం ఎలక్ట్రిక్ కారును కొనాలని చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. 

కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది?
నివేదికల ప్రకారం, Kia మోటార్స్ తన Carens Clavis EVపై సుమారు 2.15 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా HTM వేరియంట్‌పై అత్యధిక ప్రయోజనం లభిస్తోందని సమాచారం. కియా కంపెనీ 2025 మోడల్ ఇయర్ స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో పాత మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్ ఇస్తోంది. అదే సమయంలో 2026 మోడళ్లపై తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. కియా మోటార్స్ టైం టు టైం తమ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లకు ప్రయోజనాలు చేకూరుస్తుంది. గత నెలలోనూ కియా ఆఫర్లతో అమ్మకాల్లో దూసుకెళ్లింది.

Kia Carens Clavis EVని ప్రత్యేకంగా ఫ్యామిలీ జర్నీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ MPV, ఇందులో ఎక్కువ స్పేస్ వచ్చేలా క్యాబిన్, 6, 7 సీటర్ ఆప్షన్లు.. ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్నాయి. కియా కంపెనీ ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇచ్చింది. దీని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 490 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.  అందుకే ఈ కారు సిటీలో ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు తీసుకెళ్లడంతో పాటు లాంగ్ జర్నీలకు కూడా సరిపోతుందని కస్టమర్లు భావిస్తున్నారు.

కారు డిజైన్ ఎలా ఉంది?
Carens Clavis EV డిజైన్ విషయానికి వస్తే, లుక్ చాలా మోడ్రన్‌గా, ప్రీమియంగా ఉంది. ఇందులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, LED DRLలు, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, EV-స్టైల్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి దీనిని సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ MPVల కంటే ప్రత్యేకం చేస్తాయి. కారు ఫ్రంట్ లుక్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. వెనుక భాగంలో ఉన్న కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, ప్రీమియం ఫీల్ ఇచ్చేందుకు కియా ప్రయత్నించింది. ఇందులో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్ సెటప్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, బోస్ (Bose) సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాదు, టెక్నాలజీ, లగ్జరీ పరంగానూ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది.

కారు సేఫ్టీ ఫీచర్లు
భద్రత విషయానికి వస్తే, Kia కంపెనీ ఈ MPVని చాలా స్ట్రాంగ్‌గా తయారు చేసింది. ఇందులో Level-2 ADAS టెక్నాలజీ ఇచ్చారు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 360 డిగ్రీల కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇచ్చారు. కంపెనీ ఇందులో Vehicle to Load (V2L) ఫీచర్‌ను కూడా ఇవ్వగా.. దీని సహాయంతో  బ్యాటరీ ద్వారా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కూడా రన్ చేయవచ్చు. 

Frequently Asked Questions

Kia Carens Clavis EV పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?

Kia Carens Clavis EV పై సుమారు 2.15 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.

Kia Carens Clavis EV యొక్క రేంజ్ ఎంత?

ఈ కారు యొక్క పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 490 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇది నగర ప్రయాణాలకు, లాంగ్ జర్నీలకు కూడా సరిపోతుంది.

Kia Carens Clavis EV లోపల ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

ఈ కారులో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్ సెటప్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kia Carens Clavis EV యొక్క సేఫ్టీ ఫీచర్లు ఏమిటి?

ఈ MPVలో Level-2 ADAS టెక్నాలజీ, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget